గ్రంధాలయోద్యమం Grandhalayodyamam in Telangana
తెలుగువారు తమ గత చరిత్రను తెలుసుకొనుట కొరకు చేసిన ప్రయత్నమే గ్రంథాలయ ఉద్యమం
గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు, పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు
తెలుగు వారి చరిత్రను వివరించే పుస్తకాలను తెలుగు భాషలోనే రచించి, వాటిని గ్రంథాలయాలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గ్రంథాలయ ఉద్యమ ప్రధాన లక్ష్యం
సురవరం ప్రతాపరెడ్డి గారు గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలోని తొలి ఉద్యమంఅని పేర్కొన్నారు
దీనిలో భాగంగానే తెలంగాణలో అనేక గ్రంథాలయాలు, సంస్థలు స్థాపించబడ్డాయి
గ్రంథాలయ ఉద్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు.
ఇతను ఈ క్రింది గ్రంథాలయాలు, సంస్థలను స్థాపించాడు
శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం
దీన్ని 1901 సెప్టెంబర్ 1న హైదరాబాద్(కోఠి)లో స్థాపించారు
ఇది హైదరాబాద్‌లో మొదటి తెలుగు గ్రంథాలయంగాపరిగణించబడుతుంది
దీని స్థాపనకు మునగాల రాజు నాయని వెంకటరంగారావు ధనసహాయం చేశాడు.
రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం
1904 ఫిబ్రవరి 2న హనుమకొండలో పింగళి వేంకటరామారెడ్డి ఇంట్లో స్థాపించారు
ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం (1905) - సికింద్రాబాద్
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి (1906) - హైదరాబాద్
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి ద్వారా నవలల పోటీలు నిర్వహించేవారు
విజ్ఞాన చంద్రిక మండలి 1910లో ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని ప్రచురించింది
చిలుకూరి వీరభద్రరావుచే రచించబడిన ఆంధ్రుల చరిత్ర గ్రంథంలో తెలుగు వారి గత వైభవం గురించి పేర్కొనబడినది
ఈ గ్రంథం ఆంధ్రాలో మరియు తెలంగాణాలోని తెలుగు వారిని పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది
ప్రాచీన, మధ్య యుగాలలో తెలుగువారి వైభవం గురించి ఈ గ్రంథంలో వివరించబడింది
తెలంగాణలో కొమర్రాజు లక్ష్మణరావు కంటే ముందే అనేక మంది ఈ క్రింది గ్రంథాలయాలను స్థాపించారు
1872:
సోమసుందర మొదలియారు సికింద్రాబాద్‌లో గ్రంథాలయాన్ని స్థాపించాడు.
ఇది తెలంగాణలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి గ్రంథాలయంగా పేర్కొనవచ్చు.
ఈ గ్రంథాలయాన్ని 1884లో మహబూబియా కాలేజిలో విలీనం చేశారు
ఇదే సంవత్సరంలో ముదిగొండ శంకరాధ్యులు శంకరానంద గ్రంథాలయం అనే పేరుతో కవాడిగూడలోని శంకరమఠంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు
1879:
అఘోరనాథ్ ఛటోపాధ్యాయ యంగ్‌మెన్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీని స్థాపించి, అందులో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు
చేశాడు.
అఘోరనాథ్ ఛటోపాధ్యాయ భార్య వరదసుందరీదేవి తన ఇంట్లోనే రాత్రి బడిని నిర్వహించి, మహిళలకు విద్యాబోధన చేసేవారు. ఆ విధంగా ఆ ఇల్లు అఘోరనాథ్ దర్చార్‌గా పిలువబడింది
అఘోరనాథ్ ఛటోపాధ్యాయ ముల్లా అబ్బుల్ ఖయ్యూం సహాయంతో బ్రదర్‌హుడ్ సొసైటీని స్థాపించాడు
1891:
అసఫియా స్టేట్ లైబ్రరీని స్థాపించారు
స్థాపకులు - ముల్లా అబ్బుల్ ఖయ్యూం, నవాబ్ ఇమాదుల్ ముల్క్ (అసలు పేరు మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామి)
ఈ గ్రంథాలయాన్నే నేడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా పిలుస్తున్నారు.
1895 :
హైదరాబాద్ రాజ్యంలో మరాఠి భాషా సంస్కృతుల అభివృద్ధికోసమె భారత గుణవర్ధక సంస్థ గ్రంథాలయాన్ని 1895
మార్చి 27న స్థాపించింది.
శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం
గ్రంథాలయం ఏర్పడిన తర్వాత
కొమర్రాజు లక్ష్మణరావు 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం గ్రంథాలయం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో పెద్దఎత్తున గ్రంథాలయ ఉద్యమం వ్యాప్తి చెందింది
ఈ ఉద్యమంతో ప్రభావితమై అనేకమంది ఈ క్రింది గ్రంథాలయాను స్థాపించారు
1908:
శబ్దానుశాసన ఆంధ్ర భాషానిలయంను వరంగల్‌లోని మట్టెవాడలో 1908 మే 22న ముదిగొండ శంకరాచార్యులు స్థాపించారు
ముదిగొండ శంకరాచార్యులు ఈ గ్రంథాలయానికి తన సొంత ఇంటిని దానం చేశారు
ఈ గ్రంథాలయంలో లభించిన తెలంగాణ కవుల వివరాలను బట్టి సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికను విడుదల చేశారు
గోల్కొండ కవుల సంచిక ఆధునిక కాలంలో వెలువడిన మొట్టమొదటి తెలుగు కవితా సంకలనం
బద్దిరాజు సోదరులైన సీతారామచంద్రారావు, రాథువ రంగారావులు నిర్వహించిన 'తెనుగు' అనే పత్రికకు ఈ గ్రంథాలయం పంపిణీ కేంద్రంగా పనిచేసింది
1918:
అంధ్ర సరస్వతీ గ్రంథనిలయంను 1918 మార్చి నెలలో నల్గొండలో స్థాపించారు
నిర్వాహకులు - షబ్బవీసు వెంకట రామనర్సింహారావు
ఈ గ్రంథాలయంలో మహబూబియా రీడింగ్ రూమ్ మరియు షబ్నవీసు సొంతంగా ఏర్పాటు చేసుకున్న గ్రంథాలయం విలీనమైనాయి
1918:
అంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయంను 1918లో సూర్యాపేటలో పువ్వాడ వెంకటప్పయ్య స్థాపించారు
కృషి ప్రచురిణే గ్రంథమాల అనే ఒక సంస్థను స్థాపించి తెలుగు పుస్తకాలను ముద్రించాడు
1918:
శ్రీ విజ్ఞాన విద్యుత్ ప్రవాహిన్యాంధ్ర భాషా నిలయంను 1918లో ఖమ్మంలో స్థాపించారు
యల్లాప్రగడ కృష్ణమూర్తి, కోదాటి నారాయణరావులు కలసి జ్యోతి అనే ఒక లిఖిత మాన పత్రికను ఈ గ్రంథాలయం నుండి వెలువరించారు
ఈ గ్రంధాలయం తర్వాత కాలంలో విద్యార్థి గ్రంథాలయంగా మారింది
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన ఫార్వర్డ్ బ్లాక్ పత్రిక ఈ గ్రంథాలయానికి వచ్చేది
ఈ గ్రంధాలయం తరవున హరిజనవాడలో రెండు పాఠశాలలు నిర్వహించేవారు
1918:
రెడ్ది హాస్టల్ గ్రంథాలయంను రాజబహదుర్ వెంకట రామారెడ్డి 1918లో హైదరాబాద్‌లో స్థాపించారు
ఈ గ్రంథాలయంలో వి.డి.సావర్కర్ రచించిన వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ గ్రంథం ఉండడం వల్ల ప్రభుత్వం ఈ గ్రంథాలయాన్ని నిషేధించింది.
1924 నుండి 1982 వరకు సురవరం ప్రతాపరెడ్డి ఈ గ్రంథాలయానికి ఉచిత కార్యదర్శిగా పనిచేశారు.
ఇదే సమయంలో సురవరం ప్రతాపరెడ్డి గారు గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి తెలంగాణ-ఆంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రచించారు.
1921 :
బహిరామియా గ్రంథాలయం 1921 ఏప్రిల్ 6న కొలనుపాకలో స్థాపించబడింది
1923:
విజ్ఞాన ప్రచారిణీ గ్రంథాలయంను 1923లో మంథనిలో అవధాని కృష్ణయ్య స్థాపించారు
దీన్ని ఉస్మానియా ఆంధ్ర భాషానిలయం అని కూడా పిలిచేవారు
1930:
శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం 1930లో సింగరేణిలో స్థాపించారు
ఈ గ్రంథాలయానికి సొంత భవనమును మరియు రేడియోను సింగరేణి కాలరీస్ కంపెనీ సమకూర్చింది
1934:
శ్రీ ఆంధ్రభాష ఉద్ధారక గ్రంథాలయం1934లో పెదగోపవరంలోమామునూరు నాగభూషణరావు, ఉప్పల వేంకటేశ్వరశాస్త్రి, జమలారెడ్డి ఒద్దిరాజు నారాయణరావులు స్థాపించారు
ఒక వయోజన విద్యాలయం ఈ గ్రంథాలయానికి అనుబంధంగా నిర్వహించబడేది
1939:
విద్యాభివర్థినీ గ్రంథాలయంను 1989లో తోటవల్లి (కరీంనగర్)లో బోయినపల్లి వేంకట రామారావు స్థాపించారు
ఈ గ్రంథాలయానికి అనుబంధంగా ఒక హరిజన పాఠశాలను, ఒక వయోజన పాఠశాలను, ఒక సంచార గ్రంథాలయమును, ఒక ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారాన్ని వేంకట రామారావు స్థాపించారు
1943:
శ్రీ హనుమదాంధ్ర గ్రంథాలయం 1948లో ములకలపల్లి (ఖమ్మం)లో స్థాపించబడింది
ఈ గ్రంథాలయం ఆంధ్ర సారస్వత పరిషత్ వారిచే స్థాపించబడింది
ఉమ్మెత్తల రామానుజరావు పిల్లలమర్రి (సూర్యాపేట)లో వివేక వికాసినీ గ్రంథాలయంను స్థాపించాడు
సంచార గ్రంధాలయం :
తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా ప్రాంతాన్ని పరిగణిస్తారు
ఆర్మూర్ తాలూకా అధికారిగా పనిచేషే అయ్య టి కె బాలయ్య తాలూకా పరిధిలోని మారుమూల గ్రామాలకు ఎడ్లబండిపై వెళ్లి పుస్తకాలను పంపిణీ చేసి, తను అంతకు ముందు ఇచ్చిన పుస్తకాలను తీసుకుని వచ్చేవాడు
ఆంధ్రభాష గ్రంథాలయ మహాసభలు
ప్రథమ మహాసభ:
జరిగిన ప్రదేశం - బెజవాడ (1914)
ప్రారంభించినది - అయ్యంకి వెంకట రమణయ్య
2వ మహాసభ:
జరిగిన ప్రదేశం - రాయచూర్ జిల్లా అలంపూర్ తాలూకాలోని క్యాతూర్ (1946 మార్చి 1-3)
సభాధ్యక్షుడు - రాజబహదూర్ వెంకటరామారెడ్డి
ఆంధ్రభాష గ్రంథాలయ మహాసభ వారు తమ ప్రచార కార్యక్రమాలను 3 భాగాలుగా విభజించారు
1) వయోజనశాఖ 2) విద్యాశాఖ 3) సాంకేతికశాఖ
తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి మరికొన్ని ముఖ్య గ్రంథాలయాలు