కాంగ్రైస్ సోషలిస్టు పార్టీ :
దీనిని 1934లో బొంబాయిలో ఆచార్య నరేంద్రదేవ్ (మొట్టమొదట కార్యదర్శి), రామ్‌మనోహర్‌లోహియా, జయప్రకాష్ నారాయణ్, మిన్నూ మసానీలు స్థాపించారు.
వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఉంటూనే వామపక్ష భావాల వ్యాప్తి కొరకు ప్రయత్నించారు.
వీరు 1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కీలకమైన పాత్ర పోషించారు.
సిపిఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా):
వివ్లవ పోరాటం ద్వారా ఆర్థిక సాంఘిక సమానత్వాన్ని తీసుకురావడమే కమ్యూనిస్ట్‌ల లక్ష్యం
ప్రవంచంలో మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ సిద్దాంతాలను కారల్ మార్క్స్ పేర్కొన్నాడు
కారల్ మార్క్స్ యొక్క కమ్యూనిన్స్ సిద్ధాంతాలతో ప్రభావితుడైన లెనిన్ 1917లో రష్యా (USSR)లో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
కమ్యూనిస్ట్ సిద్దాంతాలను ప్రపంచమంతా వ్యాప్తి చేయుటకు 1917లో లెనిన్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించాడు.
ఈ సంస్థలో భారతీయ సభ్యుడు M. N. రాయ్
1920 అక్టోబర్‌లో M. N. రాయ్ రష్యాలోని తాష్కెంట్‌లో ప్రస్తుతం (ఉజ్జేకిస్తాన్ రాజధాని) CPI ను స్థాపించాడు
1920-25 మధ్యకాలంలో ఈ క్రింది నాయకుల పోరాట ఫలితంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ సిద్దాంతాలు వ్యాప్తి చెందాయి.
1. M. N. రాయ్:
పత్రిక: వాన్‌గార్డ్ ( ఇది ఇండియాలో మొదటి కమ్యూనిస్ట్ పత్రిక)
పుస్తకం: India in Transition
పార్టీ : రాడికల్ డెమొక్రటిక్ పార్టీ/ రాడికల్ హ్యుమనిస్ట్ పార్దీ
2. S. A. డాంగే:
పత్రిక : The Socialist
పుస్తకం: గాంధీ vs లెనిన్
3.ముజాఫర్ అహ్మద్:
బాంబే ప్రెసిడెన్సీలో కమ్యూనిస్ట్ సిద్దాంతాలను వ్యాప్తి చేశాడు.
పత్రిక: నవయుగ్, లాంగర్
4. ఆసఫ్ హుస్సేన్ హస్వీ:
ఢిల్లీ మరియు ఉత్తరభారతదేశంలో కమ్యూనిస్ట్ సిద్దాంతాలను వ్యాప్తి చేశాడు
పత్రిక : కాంగ్రెస్, ఇన్‌క్విలాబ్
5. షౌకత్ ఉస్మానీ:
యునైటెట్ ప్రావిన్స్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్) లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను వ్యాప్తి చేశాడు
6. సింగరవేలు శెట్టియార్:
ఇతను మద్రాస్‌లో కమ్యూనిస్ట్ సిద్దాంతాలను వ్యాప్తి చేశాడు
ఇతను మద్రాస్‌లో అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాడు
ఉదా: మద్రాస్ ట్రేడ్ యూనియన్
1925 నాటికి భారతదేశంలో కమ్యూనిస్ట్ సిద్దాంతాలు బాగా వ్యాప్తి చెందాయి
1925 డిసెంబర్‌లో భారతదేశంలోని కమ్యూనిస్ట్‌లు కాన్పూర్‌లో సమావేశం అయ్యారు
ఈ సమావేశంలోనే 1925 డిసెంబర్ 26న CPI సత్యభక్త నేతృత్వంలో పునఃస్థాపించబడింది
బ్రిటన్‌కు చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు స్ప్రాట్ (Spratt) భారతదేశంలో పర్యటించి కమ్యూనిస్ట్ సిద్దాంతాల వ్యాప్తికి కృషి చేశాడు
1929లో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ లను అణచివేయుటకు మరియు స్ప్రాట్ ను భారతదేశం నుండి తరిమివేయుటకు ఈ క్రింది చట్టాలు తెచ్చింది
1. Public Safety Bill
2. Trade Dispute Bill
1930లో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్‌లపై అనేక కుట్రాలను మోపి జైళ్ళకు తరలించింది.
ఉదాహరణ: మీరట్ కుట్ర, కాన్పూర్ కుట్ర, పెషావర్ కుట్ర, బోల్స్‌విక్ కుట్ర