ఆర్య సమాజం - Role of Aarya Samajam in Nizam's State
ఆర్య సమాజం :
1875లో దయానంద సరస్వతి ఆర్య సమాజ్‌ను బాంబేలో స్థాపించాడు.
వేదాల ప్రకారంగా ఉన్న హిందూ మతాన్ని తెలియజేయుటయే ఈ ఆర్య సమాజ్‌యొక్క ముఖ్య లక్ష్యం.
అందువల్లనే దయానంద సరస్వతి గోబ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చాడు
1892లో ఆర్య సమాజ్ యొక్క శాఖ హైదరాబాద్‌లో ఏర్పడింది
అప్పటి హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు-కమతా ప్రసాద్‌జీ మిశ్రా
ఆర్య సమాజ్ వేదాల గురించి వివరిస్తూ నిజమైన హిందూ మతాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు వారికి అనేక
ఇతర అంశాలపై అవగాహన కల్పించేది
ఆర్య సమాజ్ మత మార్చిడిలను ఖండించేది ఆర్య సమాజ్ శుద్ధి అనే ఉద్యమాన్ని చేపట్టి ఇతర మతాల్లో చేరిన హిందువులను గుర్తించి వారిని శుద్ధి చేసి మరలా హిందూ మతంలోకి మార్చించేది
హైదరాబాద్‌లో స్వపరిపాలన ఉండాలని డిమాండ్ చేసింది
1939లో హైదరాబాద్ డే అనే పేరుతో సదస్సులు నిర్వహించింది.
1939 జనవరి 25, మార్చి 22, ఏప్రిల్ 22, మే 22, జూన్ 29 తేదీలలో హైదరాబాద్ డేలను నిర్వహించింది
ఆర్య సమాజ్‌లో ప్రముఖ సభ్యులు - కేశవరావు కొరాట్కర్, గణపతి హార్టికార్, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, దామోదర్ సత్యలేకర్, ఎం.ఆర్. శ్యాంరావు
దివ్యజ్ఞాన సమాజం (థియోసోఫికల్ సొసైటీ):
భారతదేశంలో 1890లో అనిబిసెంట్ అధ్యక్షురాలిగా మద్రాసులోని అడయార్ కేంద్రంగా దివ్యజ్ఞాన సమాజం స్థాపించబడింది
దివ్యజ్ఞాన సమాజం యొక్క హైదరాబాద్ శాఖ సం 1905-06లో స్థాపించబడింది
ముఖ్య. ఉద్దేశం. : రాచరిక దుష్పరిణామాలను, మతపాక్షిక దృక్పథాన్ని వ్యతిరేకించడం
దివ్యజ్ఞాన సమాజానికి మద్దతుగా 1917లో ఆంధ్రమాత అనే పత్రిక ప్రారంభమైంది
యంగ్ మెన్స్ ఆంధ్ర అసోసియేషన్ :
ఈ సంస్థ ముఖ్యంగా తెలుగు భాష మరియు తెలుగు వారి సంస్కృతిని ప్రచారం చేసింది
హ్యూమానిటేరియన్ లీగ్:
న్యాయవాది అయిన రాయ్ బాలముకుంద్, వర్తకుడైన లాల్‌జీ మేఘ్‌జీల సంయుక్త కృషి వల్ల హ్యూమానిటేరియన్ లీగ్ 1918లో స్థాపించబడింది.
దీనికి అధ్యక్షుడిగా రాయ్ బాలముకుంద్ ఎన్నికయ్యారు
ఈ లీగ్ ద్వారా భాగ్యరెడ్డివర్మ హరిజన ఉద్ధరణకై కృషి చేశాడు.
హిందూ సోషల్ క్లబ్ :
స్థాపకుడు : రాజా మురళీ మనోహర్ బహద్దూర్, కేశవ అయ్యర్, రామచంద్ర పిళ్ళై, కృష్ణ అయ్యర్‌లు హిందూ సోషల్ క్లబ్‌లో ముఖ్యపాత్ర పోషించారు
ముఖ్య ఉద్దేశం : సాంఘిక దురాచారాలపై వ్యతిరేక ప్రచారం చేయడం
ఈ సంస్థ సముద్రయానం హిందువులకు నిషిద్ధం అనే మూఢ నమ్మకాన్ని తొలగించి, అనేకమంది హిందూ విద్యార్థులను ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లేటట్లు కృషి చేసింది
చార్మినార్ వద్ద మాల్వాల్ సభను ఏర్పాటుచేసి బొంబాయి కాంగ్రెస్ ప్రతినిధి అయిన స్రవంతిబాయ్ త్రయంబక కెనరాన్ చేత ఉపన్యాసాలు ఇప్పించారు.
హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్:
స్థాపకులు : వామన్‌రావ్ నాయక్, కేశవరావు కోరట్కర్ (1915)
ముఖ్య ఉద్దేశం : ప్రాథమిక విద్యావ్యాప్తి, గ్రంథాలయాల స్థాపన మరియు స్త్రీ విద్యను 'ప్రోత్సహించడం.
హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ :
స్థాపకులు : వామన్‌రావ్ నాయక్, కేశవరావు కోరట్కర్ (1918)
ముఖ్య ఉద్దేశం : నిజాం సంస్థానంలో సామాజిక, రాజకీయా సంస్కరణలు తీసుకురావడం.
హైదరాబాద్ స్టేట్ రాజ్యాంగ సవరణ సంఘం :
ముఖ్య ఉద్దేశం : ప్రజల రాజకీయ హక్కుల కొరకు పోరాటం చేయడం
ఈ సంఘం ద్వారా రాజ్యంలో వాక్ స్వాతంత్ర్యం, పత్రిక స్వాతంత్ర్యం కావాలని బట్లర్ కమిటీకి విజ్ఞప్తి చేశారు
ఈవిధంగా తెలంగాణలోని ఇతర సంస్థలు మరియు సంస్థలు మరియు సంఘాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగింది.