తెలంగాణాలో సాయుధ పోరాటం Sayudha Poratam in Telangana

TSStudies

తెలంగాణాలో సాయుధ పోరాటం  

స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రైతాంగ పోరాటాలు జరిగినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానంలో గల తెలంగాణపై వాటి ప్రభావం మాత్రం నామమాత్రంగానే ఉందేది
ఆ సమయంలో తెలంగాణ ప్రజలు భూస్వామి, పటేల్‌, పట్వారీ వ్యవస్థలతో అనేక అగచాట్లు పడ్డారు
నికృష్టమైన ఫ్యూడల్‌ దోపిడీ విధానంతో అనేక ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతులు భూస్వాముల కబంధ హస్తాల నుండి బయటపడి స్వేచ్చా వాయువులు పీల్చడం కొరకు సాయుధ పోరాటాన్ని సాగించారు
తెలంగాణలో సాయుధ పోరాటం 1946-51 మధ్య కాలంలో జరిగింది
తెలంగాణాలో సాయుధ పోరాటాన్ని చేపట్టినవారు -కమ్యూనిస్ట్‌లు
హైద్రాబాద్‌లో కమ్యూనిస్ట్‌ పార్టీ 1940లో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలచే స్థాపించబడింది. 
తెలంగాణాలో సాయుధ పోరాటం జరగడానికి క్రింది  కారణాలున్నాయి
1. భూస్వామ్య వ్యవస్థ :
అప్పటి నిజాం రాజ్యంలో ప్రధానంగా 3 రకాల భూములు  ఉండేవి
i) దివానీ/ఖల్సా: ఇవి 60% ఉండేవి. జమీందార్ల ఆధీనంలో వుండేవి. వీరు తమ గ్రామాలలోని ప్రజలను బానిసలుగా పరిగణించి అనేక విధాలుగా దోచుకొనేవారు. ఈ భూస్వాములు దొరలుగా పిలవబడి మహిళలపై లైంగిక ఆకృత్యాలు కూడా చేసేవారు. మహిళలను ఆడబాప(దాసి)గా మార్చేవారు. ప్రజలు భూస్వాములను 'బాంఛన్‌ నీ కాల్మొక్తా' అని క్రింద పడేవారు. 
ii) జాగిర్‌దారీ : ఇవి 30% ఉండేవి. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు, సైనిక ఉన్నత అధికారులకు జీతాలకు బదులుగా భూములు ఇవ్వబడేవి. వీటినే జాగిర్జారీ 'భూములుగా పేర్కొనేవారు.
అగ్రహార మరియు ఇనామ్‌ భూములు కూడా జాగిర్టారీ భూముల క్రిందకు వచ్చేవి
iii) సర్ఫేఖాస్: ఇవి 10% ఉండేవి. ఈ భూముల నుండి వచ్చిన శిన్తును నిజాం తన సొంత అవసరాలకు ఉపయోగించుకునేవాడు
పైన పేర్కొనబడిన భూములలోని దేశ్‌పాండేలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్‌దార్‌లు, పటేల్‌ పట్వారీ, మఖ్ఞదారుల్సు, ఇతర రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రజలను దోచుకున్నారు. 
విసునూరి జానమ్మ, విసునూరి రామచంద్రారెడ్డి, బేతవోలు సీతారామచంద్రారావు, కంఠాత్ముకూరు పింగళి  ఆకృత్యాలు దీనికి నిదర్శనం

2. వెట్టి చాకిరి/ బగీలా:
జమీందార్లు లేదా వడ్డీ వ్యాపారులు రుణాలిచ్చి వడ్డీకి బదులుగా రుణం తీసుకొన్న వారి కుటుంబంలోని ఒకరిని తమ ఇంటిలో లేదా పొలంలో ఉచితంగా సేవ చేయించుకునేవారు. 
వడ్డీరేటు అధికంగా ఉందడం వల్ల రుణం ఎప్పటికీ తీరేది కాదు. ఫలితంగా ఆ వ్యక్తి శాశ్వతంగా పన్ని చేయాల్సి వచ్చేది దీన్నే వెట్టి చాకిరీ లేదా భగీలా అని పేర్మొన్నారు
3. వడ్డీ వ్యాపారం / నాగు:
నాగు వడ్డీ వ్యాపారం ప్రకారం తీసుకున్న అప్పు ఒక సంవత్సరంలోనే రెట్టింపవుతుంది. 2 సంవత్సరాలకు 4 రెట్లు
అవుతుంది
ఈ వడ్డీ వ్యాపారం కారణంగా తెలంగాణలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు
4. హుక్కీ మాలీకానా పన్ను: 
ఇది కల్లుగీత కార్మికులపై విధించే పన్ను.
ఈ పన్ను కారణంగా కల్లుగీత కార్మికులు  సాయుధ పోరాటం ప్రారంభమైనపుడు పెద్దఎత్తున కమ్యూనిస్ట్‌లకు మద్దతు పలికారు
5. ఆంధ్ర మహాసభ:
1921 నవంబర్‌ 12న ఏర్పడిన నిజాం రాష్ట్ర జనసంఘం 1930లో ఆంధ్ర మహాసభగా ఆవిర్భవించింది
1944 లో జరిగిన భువనగిరి ఆంధ్రమహాసభ తరువాత దీని శాఖలు తెలంగాణాలోని అనేక గ్రామాలలో ఏర్పాటు చేయబద్దాయి. వీటిని 'సంగంలు' అని పిలిచేవారు
గ్రామాల్లోని యువకులు సంగంలో సభ్యులుగా చేరి జమీందార్ల ఆకృత్యాలను ఎదుర్కోనేవారు
6. కామ్రేడ్స్‌ అసోసియేషన్‌:
దీన్ని మఖ్దుం మొహినోద్దీన్, సయ్యద్‌ ఇబ్రహీం, లింగారెడ్డి, బహదూర్‌ గౌడ్  మొదలగువారు 1940లో స్థాపించారు
ఆర్థిక, సాంఘిక  సమానత్వాన్ని సాధించుటకు ఈ సంస్థ కృషి చేసింది. 
7. రాజకీయ పాఠశాలలు:
1930-34 మద్య కాలంలో ఆంధ్రాలో కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలు పూర్తిగా వ్యాపించాయి
ఆంధ్రాకు చెందిన యన్‌,జి.రంగా తెలంగాణ కమ్యూనిస్ట్‌ నాయకులు అయినా బద్దం ఎల్లారెడ్డి, హనుమయ్యలకు కృష్ణా జిల్లా కంకిపాదులో కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చాడు. 
పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు కరీంనగర్ లోని జగిత్యాలలో రాజకీయ పాఠశాలను నిర్వహించి వట్టికోట అళ్వార్‌స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావులకు కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలపై శిక్షణ కల్పించారు.
దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ ప్రజల సాయుధ పోరాటాల చరిత్ర అనే పుస్తకాన్ని రచించాడు
8. కొలనుపాక జమీందార్‌పై దాడి
కొలనుపాక జమీందార్‌ పేదల భూములను అక్రమంగా ఆక్రమించినప్పుడు ఆరుట్ల సోదరులు (రామచంద్రారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి) జమీందారుపై దాడి చేసి భూములను తిరిగి పొంది వాటిని ప్రజలకు పంచారు.
ఈ దాడి తెలంగాణలో సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొంటారు
9. రైతులపై ప్రభుత్వ లెవీ:
2వ ప్రపంచ  యుద్ధ కాలంలో ఆహర కొరత సంభవించినప్పుడు నిజాం ప్రభుత్వం లెవీని విధించి అతి తక్కువ ధరలకు రైతుల నుండి బలవంతంగా పంటలను కొనుగోలు చేసేది
దీని కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోని సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపారు

కమ్యూనిస్ట్‌ల పోరాట దశలు (1940-1951)
Communism in Telangana,Telangana History in Telugu,History of Telangana in telugu,sayudha poratam in telangana,communism against in nizam state,ravi narayana reddy,vetti chakiri,bhageela in telangana, nagu vyaparam in telangana,puchalapalli sundarayya role in communism,comrades association in telangana,ts studies,tsstudies,ts study circle,Armed conflict in Telangana,sayuda poratam in telangana,
1939లో రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డిలు యన్‌.జి.రంగా నుండి కమ్యూనిస్ట్‌ సిద్దాంతాలపై రాజకీయశిక్షణ పొందిన అనంతరం 1940లో కమ్యూనిస్ట్‌ పార్టీని హైదరాబాద్‌లో స్థాపించారు. 
అప్పట నుండి 1951వరకు కమ్యూనిస్ట్‌ల పోరాటాలను 4 దశలుగా విభజించవచ్చు
1. 1940-1946 : కమ్యూనిస్ట్‌లు బలపడ్డారు
2. 1946 జూలై 4- 1947:  జూన్ 12  భూస్వాములకు,దొరలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం
3. 1947 జూన్ 12 - 1948 సెప్టెంబర్‌ 17:  నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం  
4. 1948 సెప్టెంబర్‌ 17 - 1951 అక్టోబర్‌ 21 : భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా
కమ్యూనిస్ట్‌లు మొదటి దశలో బలపడగా మిగతా మూడు దశలలో జమీందార్లు, నిజాం, భారత ప్రభుత్వానికి
వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని చేపట్టారు. 
మొదటి దశ (1940-1946):
తెలంగాణలో సాయుధ పోరాటానికి మొదటిగా స్ఫూర్తినిచ్చిన సంఘటన షేక్‌ బందగీ యొక్క రక్తతర్పణం. 
షేక్‌ బందగీ తన భూమి హక్కుల కోసం విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పోరాటం చేశాడు. 
విసునూర్‌ దేశ్‌ముఖ్‌ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ షేక్‌ బందగీ ధైర్యంగా అతన్ని ఎదుర్కొని న్యాయస్థానంలో తన హక్కుల కోసం పోరాటం చేశాడు
దీంతో ఆగ్రహించిన విసునూరు దేశ్‌ముఖ్‌ 1940 జులై 27న కామారెడ్డిగూడెం బస్టాపు వద్ద షేక్‌ బందగీని అతి దారుణంగా చంపించాడు. 
బందగీ సమాధి కామారెడ్డిగూడెం వద్ద నిర్మించబడింది. 
తెలంగాణ సాయుధ పోరాటాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన మా భూమి నాటకాన్ని రచయితలైన సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్మరరావులు బందగీ సమాధికి నివాళులు అర్చించే దృశ్యంతో ప్రారంభించారు. 
బందగీ రక్తం చిందిన క్షేత్రం
బలిదానాలకు వెరవని క్షేత్రం
స్వాభిమానవు సస్వ క్షేత్రం
స్వతంత్ర యోధులకు సమరక్షేత్రం
1940-46 మధ్య కాలంలో కమ్యూనిస్ట్లు విద్యావారోత్సవాలు, ప్రభుత్వ లెవీ వ్యతిరేక వారోత్సవాలు, ఇతర చైతన్య ఉత్సవాలను నిర్వహించి ప్రజల మద్దతును పొందారు. 
1944లో భువనగిరి ఆంధ్ర మహాసభ తర్వాత దాని శాఖలు తెలంగాణలోని వివిధ గ్రామాలలో సంగంలు అనే పేరుతో ఏర్పాటు చేయబడ్డాయి. 
సాయుధ పోరాటాన్ని చేపట్టడంలో ఈ సంగం సభ్యులే కీలక పాత్ర పోషించారు. 
ఈ దశలో క్రింది కొందరు జమీందార్లపై దాడులు జరిగాయి
1 మేకూరి రాఘవరావుపై దాడి : ఇతను ధర్మారం జమీందార్‌. పేదల భూములను ఆక్రమించుకోదానికి ప్రయత్నించగా స్థానిక లంబాడీలు ఇతని గుండాలను తిప్పికొట్టారు. ఈ తిరుగుబాటు నాయకత్వం వహించింది - జాటోతు హోము. 
2 విసునూరి రామచంద్రారెడ్డిపై దాడి : ఇతను జనగాం జమీందార్‌. ఇతను పేదల భూములను ఆక్రమించుకోగా దావూద్‌రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి సహాయం పొంది ఇతనిపై దాడి చేసి ఆ భూములను తిరిగి పొంది పేదలకు పంచాడు. 
౩ కఠారి నరసింహారావుపై దాడి ; ఇతను మండ్రాయిజమీందార్‌. ఇతను పేదల భూములను ఆక్రమించుకోగా ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇతనిపై దాడి చేసి ఆ భూములను తిరిగి పొంది పేదలకు పంచాడు. 

రెండవ దశ (1946 జూలై 4-1947 జూన్‌ 12) :
చాకలి పోలమ్మ/ఐలమ్మ వరంగల్‌లోని పాలకుర్తికి చెందిన రజక మహిళ
ఈమె భర్త నర్సయ్య. ఈమె మల్లంపల్లి
ముఖ్తేదార్‌ నర్సింహరావు భార్య అయిన జయప్రదాదేవి నుండి 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసింది.
అప్పటి విసునూరు రామచంద్రారెడ్డి ఐలమ్మ పండించిన పంటను దౌర్జన్యంగా తీసుకురావడానికి గుండాలను పంపాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పాలకుర్తి స్థానిక సంగం ఆర్గనైజర్‌ చకిలం యాదగిరిరావు, సూర్యాపేట దళం సభ్యులైన భీంరెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం మొదలగు 20 మంది పాలకుర్తికి చేరుకుని గుండాలను తరిమికొట్టారు.
దీనికి ప్రతీకారంగా విసునూరు రామచంద్రారెడ్డి పోలీసుల సహాయంతో వారిని బంధించి, చిత్రహింసలకు గురి చేయించాడు. 
దీని గురుంచి మీజాన్ పత్రికలో ఉప సంపాదకుడుగా పనిచేసిన అడవి బాపిరాజు తన ప్రత్యేక శీర్షిక ద్వారా తెలియజేశాడు. 
విసునూరు దొరసాని జానమ్మ (విసునూరి రామచంద్రారెడ్డి తల్లి) ప్రజలపై అనేక ఆకృత్యాలకు పాల్పడేది.
విసునూరు దొర, దొరసానులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ప్రముఖులు - నల్ల నరసింహులు, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి
ప్రధానంగా పై ఇద్దరిని హతమార్చుటకు విసునూరు జమీందార్‌ 1946 జులై 4వ తేదీన కడవెండి గ్రామానికి గుండాలను పంపాడు.
కానీ ఆ సమయంలో నల్ల నరసింహులు హైదరాబాద్‌లోని ఒక సదస్సుకు హాజరయ్యాడు. ఈ గుండాలు కడవెండి గ్రామంలోని సంగం సభ్యుల ఇళ్లపై దాడులకు దిగారు. ఈ దాడిలోనే దొడ్డి కొమురయ్య వీర పోరాటం చేసి అసువులు బాశాడు. 
ఇతని మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు ఆగ్రహించి రక్తానికి రక్తం అని నినాదం చేన్తూ విసునూరు రామచంద్రారెడ్డిపై దాడి చేశారు. విసునూరు రామచంద్రారెడ్డి యొక్క మామిడి తోటను ధ్వంసం చేసి అతని గుండాలను చితకబాదారు. ఈ సంఘటనతో తెలంగాణాలో సాయుధ పోరాటం ప్రారంభమైంది. 
ఈ సాయుధ పోరాటం ప్రారంభమైనపుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, అతని సోదరీమణులు కుమారి శశిరేఖ, స్వరాజ్యంలు కడవెండిని సందర్శించి తమ ఉపన్యాసాలు, ఉయ్యాల పాటల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు. 
ఈ సాయుధ దళ  పోరాటం నుమారు 150 గ్రామాల్లో వ్యాపించింది. సాయుధ పోరాటం కొరకు అనేక గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక్కో రక్షణ దళంలో 20-30 మంది సభ్యులు ఉండేవారు వీరికి ప్రాథమిక చికిత్స, పేలుడు పదార్థాలు, ఆయుధాల ఉపయోగంలో శిక్షణ కల్పించబడింది. 
హైగరాబాద్‌-వరంగల్‌ మధ్య రవాదారి దిగ్బంధం చేయబడింది. 
తెలంగాణలో సాయుధ పోరాటం ప్రారంభమైన తర్వాత ఈ క్రింది సంఘటనలు చోటు చేసుకున్నాయి. 
1946 ఆగస్టు 11- టి.హయగ్రీవాచారి వరంగల్‌ కోటలో జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భూస్వాముల గుండాలు, రజాకార్లు వరంగల్‌లోని స్తంభంపల్లి ప్రాంతంపై దాడి చేశారు. అప్పుడే మొగులయ్యగౌడ్‌ వారిని ప్రతిఘటించి మరణించాడు. 
1946 అక్టోబర్‌ 18 - బాలెం గ్రామంలో గార్లపాటి అనంతారెడ్డి, పటేల్‌ మట్టారెడ్డిలు పోరాటం చేస్తూ మరణించారు. 
1946 నవంబర్‌ 2 - పాత సూర్యాపేట వద్ద సంగం సభ్యులు భూస్వాములు మరియు సైన్యంతో పోరాటం చేస్తున్నప్పుడు నరసయ్య, భిక్షమయ్య అనే దళ సభ్యులు మరణించారు. 
1946 డిసెంబర్‌ 1 - మల్తారెడ్డిగూడెంలో సుమారు 600 మంది ప్రజలు బరిసెలు, గొడ్డళ్లు, రోకళ్లతో భూస్వాముల గుండాలను, సైన్యాన్ని ఎదుర్కొన్నారు.
అప్పుడే హరిజన మహిళలు చింద్రాల గురువమ్మ, తొండమ్మ, అంకాలమ్మలు మరణించారు. వీరు తెలంగాణలో అమరులైన తొలి హరిజన మహిళలు. గాంధీజీ తెలంగాణా సాయుధ పోరాటం గురించి నివేదిక ఇవ్వవలసిందిగా పద్మజా నాయుడును కోరాడు. 
సాయుధ పోరాటం హింసాత్మకంగా మారడంతో నిజాం ప్రభుత్వం దాని అణచివేత చర్యలు చేపట్టింది. 
1946 అక్టోబర్‌లో వట్టికోట అళ్వార్‌స్వామి అరెస్ట్‌ చేయబడ్డాడు. సైనిక శిబిరాలు అడవులలో ఏర్పాటు చేయబడ్డాయి. దీంతో అనేక మంది కమ్యూనిస్ట్‌ నాయకులు విజయవాడకు పారిపోయారు. 
అప్పట్లో కమ్యూనిస్ట్‌లు విజయవాడను స్టాలిన్‌ గ్రాడ్‌ అని పిలిచేవారు. 
1946 నవంబర్‌లో హైద్రాబాద్‌ సంస్థానంలో కమ్యూనిస్ట్‌ పార్టీపై నిషేధం విధించబడింది. 


3వ దశ (1947 జన్‌ 12-1948 సెప్టెంబర్‌ & 1947 జూన్‌ 12):
నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ తాను సర్వ స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు నిజాం తనకు వ్యతిరేకమైన వారిని అణచివేయుట ప్రారంభించాడు. ఇదే సమయంలో రజాకార్ల దాడులు కూదా అధికమయ్యాయి
దీంతో ప్రజలకు రక్షణ కల్ప్సించుటకు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని చేపట్టాలని కమ్యూనిస్ట్‌లు నిర్ణయించారు. జూన్‌ 12 తరువాత కమ్యూనిస్ట్‌ నాయకులు విజయవాడ నుండి తెలంగాణాలోకి ప్రవేశించి సాయుధ పోరాటానికి సంబంధించిన చర్యలు చేపట్టారు
1947 సెప్టెంబర్‌ 11న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు కమ్యూనిస్ట్‌లు ప్రకటన చేశారు
కమ్యూనిస్ట్‌లు తివ్యూహ పద్ధతిని పాటించారు
1 ఒకేసారి పోలీస్ ‌ స్టేషన్‌లు, జమీందారు వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి ఆయుధాలను, సొత్తును కొల్లగొట్టుట
2 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేయుట
3 విధ్వంసక దళాలను ఏర్పాటు చేయుట
కామ్రేడ్స్  యన్‌.భూతారెడ్డి అనభేరి ప్రభాకర్‌రావులు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకొనే సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. 
కామ్రేడ్‌ ప్రభాకర్‌ ఇల్లంతకుంట వద్ద పోలీస్స్టేషన్‌పై దాడిచేసి ఆరుగురిని హతమార్చాడు. 
తర్వాత రజాకార్లతో జరిగిన సంఘర్షణలో వీరిద్దరూ మరణించారు. 
నల్ల నరసింహులు 1948 మే 19-20 తేదీల్లో కొడకంద్ల గ్రామంలో రజాకార్ల శిబిరంపై దాడిచేసి శిబిరంలో వున్న రజాకార్లను హతమార్చాడు, ఇతను కోమాలపల్లి వద్ద కూడా రజాకార్ల శిబిరంపై దాడి చేశాడు. 
దీనికి ప్రతీకారంగా సాయుధ పోరాటాన్ని అణచివేయుటక్షు నిజాం ప్రభుత్వం అనేక కఠిన చర్యలు చేపట్టింది. ఈ అణచివేత క్రమంలో అనేకహింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి
1. ఖైరాన్‌పల్లిలో 88 మందిని కాల్చి చంపారు
2. గుంద్రాంపల్లిలో 16 మందిని గొయ్యిలోఉంచి కాల్చిచంపారు. 
ఆరుట్ల గ్రామంలో 11 మందిని ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపుటకు ప్రయత్నించగా ఉత్తమ్మ అనే మహిళ వారిని కాపాడింది. 
సాయుధ పోరాటంలో పాల్గొన్నవారిని ఉత్తేజితపరచుట కొరక్షు అనేకగీతాలు, కవిత్వాలు రచించబడ్డాయి. 
'బందెనెక బండి కట్టి...”
నైజాము సర్కరోడా నాజీల మించినోడా 
గోల్కొండ ఖిలా కింద గోరి కడతం కొడకో  ----- బండి యాదగిరి
నా తెలంగాణా కోటి రతనాల వీణ 
నా తెలంగాణ కోటి అందాల జాణ
నా తెలంగాణా వీర పరాక్రమసేన ----- దాశరథి కృషమాచార్వులు
1947 నవంబర్‌ 29న నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ భారత ప్రభుత్వంతో యధాతథ ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకున్నాడు. 
ఈ ఒవృంద౦ం తరువాత ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని కమ్యూనిస్ట్‌లను కఠినంగా అణచివేయుటకు ప్రయత్నించాడు. 
కానీ కమ్యూనిస్ట్‌లు సుమారు 3000 గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకొని 12 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. 
ఉద్యమ వ్యాప్తి కొరకు కమ్యూనిస్ట్‌లు చందాలు కూడా వసూలు చేసేవారు. 
సాధారణంగా పగటి పూట రజాకార్లు గ్రామ ప్రజలను దోచుకొనగా రాత్రిపూట కమ్యూనిస్ట్‌లు గ్రామ ప్రజలను పీడించేవారు.  అందువల్లనే వీరి పాలనను దిన్‌కీ సర్కార్‌..రాత్‌కీ సర్కార్‌ అని వ్యంగ్యంగా పిలిచేవారు. 
ఉస్మాన్‌ అలీఖాన్‌ తాను సర్వస్వతంత్రంగా ఉండుటకు కావలసిన చర్యలు చేపట్టి కమ్యూనిస్ట్‌లను అణచివేసే ప్రక్రియను నిర్లక్ష్యం చేశాడు. దీంతో తెలంగాణాలో కమ్యూనిస్ట్‌లు బలపడ్డారు. 
అవరేషన్‌ పోలో తరువాత 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది

4వ దశ (1948 సెప్టెంబర్‌ 17-195 అక్టోబర్‌ 21) :
1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం అయినప్పటికీ సాయుధ పోరాటాన్ని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించాలని కేంద్ర కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యదర్శి రణదీవ (బి.టి.ఆర్‌.) పిలుపునిచ్చాడు. 
వల్లభాయ్‌ పటేల్‌ హైదరాబాద్‌లో పర్యటించి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్‌ని కూడా ఉండనివ్వనని పేర్కొన్నాడు. 
కమ్యూనిస్ట్‌లను అణచివేయుటకు అప్పటి హైదరాబాద్‌ సైనిక గవర్నర్‌ జనరల్‌ అయిన జనరల్‌ చౌదరికి సర్వ అధికారాలు ఇవ్వబడ్డాయి.
దీనితో జనరల్‌ చౌదరి సైన్యాన్ని అడవిలోకి పంపి అనేక మంది కమ్యూనిస్ట్‌లను హతమార్చాడు. అందువల్లనే కమ్యూనిస్టులు సెప్టెంబర్‌ 17ను బ్లాక్‌ డే లేదా విద్రోహదినంగా జరుపుతారు. 
జనరల్‌ చౌదరి నాయకత్వంలో కమ్యూనిస్టులు అణచి వేయబడ్డారు. 
1949 మార్చి 9న కమ్యూనిస్టు నాయకుడైన తిరుమలరెడ్డిని జనరల్‌ చౌదరి సైన్యం బంధించి కంచనపల్లిలో ఒక చింతచెట్టుకు కట్టి హతమార్చారు. 
అప్పట్లో కమ్యూనిస్టులకు ఆశ్రయమిస్తున్న గ్రామ ప్రజలపై సైన్యం దాడులు చేసేది. 
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తండ్రి కమ్యూనిస్టులకు ఆశ్రయం ఇచ్చాడని అతన్ని సైన్యం హతమార్చింది. 
భారత స్వాతంత్ర్య అనంతరం రష్యా భారతదేశానికి మిత్రదేశంగా ఏర్పడింది. రష్యా సలహా మేరకు 1951 అక్టోబర్‌ 21న కమ్యూనిస్ట్‌లు తమ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. 
1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్‌లు తెలంగాణాలో అధిక సీట్లు గెలుచుకున్నారు. 
తెలంగాణా కమ్యూనిస్ట్‌ నాయకుడైన రావి నారాయణరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుండి దేశంలోనే అత్యధిక మెజారిటీతో పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు
పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణా సాయుధ పోరాటంపై "Telanganga Peoples Struggles and It's Lessons" అనే పుస్తకాన్ని రచించాడు. 
తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేయడానికి భారత ప్రభుత్వం 1947-48లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ఖర్చుపెట్టిన దానికంటే రెండింతలు ఖర్చు పెట్టిందని పుచ్చలపల్లి వ్యాఖ్యానించారు.