సంస్థానాలు, గడీలు
(అసఫ్‌జాహీ కాలంలోని జాగీర్దార్లు, జమీందారులు, దేశ్‌ముఖ్‌లు, దొరలు)
హైదరాబాద్ అసఫ్‌జాహీ రాజ్యంలో కొన్ని స్వయంపాలన అధికారాలు కలిగిన సంస్థానాలు మరియు పన్ను వసూలు అధికారాలు పొందిన భూస్వాములు (గడీలు) ఉండేవారు.
నిజాం రాజ్యంలో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి.
1. పాల్వంచ
2 మునగాల
3 దోమకొండ
4 పాపన్నపేట
5 గద్వాల్
6 వనపర్తి
7 జటప్రోలు
8 రాజాపేట
9 అనెగొంది
10 దుబ్బాక
11 అమరచింత(ఆత్మకూరు)
12 గురుగుంట
13 నారాయణపేట
14 సిర్నవల్లి
నిజాం రాజ్యంలోని కొన్ని ప్రముఖ భూస్వాములు/గడీలు
1. విసునూరు గడీ
2 ఆత్మకూరు గడీ
3. కల్లెడ గడీ
4. జిల్లెల గడీ
5 కంఠాత్మకూర్ గడీ
6 పోలంపల్లి గడీ
7 సిర్నవల్లి గడీ
8 సంజీవన్‌రావుపేట గడీ
9 బేతవోలు గడీ
సంస్థానాలు
సేనాపతులు/ఉన్నత అధికారులు పాలకులకు సేవలు అందించినందుకు ప్రతిఫలంగా కొన్ని ప్రాంతాల పాలనా అధికారాలను పొందేవారు. ఈ ప్రాంతాలే సంస్థానాలుగా ప్రసిద్ధి చెందాయి.
1. పాల్వంచ:
రాజధాని - పాల్వంచ
రెండవ రాజధాని - అశ్వరావుపేట
స్థాపకుడు - అప్పన్న అశ్వారావు
చివరివాడు - విజయ అప్పారావు
అప్పన్న అనే వ్యక్తి 2వ ప్రతాపరుద్రుని యొక్క గుర్రాన్ని నియంత్రించడంతో 2వ ప్రతాపరుద్రుడు అప్పన్నకి అశ్వారావు అనే బిరుదునిచ్చి పాల్వంచ ప్రాంతానికి అధిపతిని చేశాడు. అప్పటి నుంచి వీరి వంశాన్ని అశ్వరావు వంశం అంటారు.
వెంకట్రామ అశ్వరావు ఈ వంశంలో ప్రముఖుడు. ఇతను నిజాం అలీ నుండి రాజ్ బహదూర్ అనే బిరుదు పొంది, 3 వేల కాల్బలాన్ని 2 వేల అశ్వక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ వంశంలో చివరి ప్రముఖుడు విజయ అప్పారావు. ఇతను కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం గ్రంథాలయ ఏర్పాటులో సహకరించాడు.
శ్రీనాథుని వెంకట్రామయ్య ఈ వంశ చరిత్రను వివరిస్తూ అశ్వరాయ చరిత్ర/శ్రీరామ పట్టాభిషేకం అనే గ్రంథం రచించాడు
2. మునగాల :
మొదటి రాజధాని - రేపాల
రెండవ రాజధాని - సిరిపురం
మూడవ రాజధాని - నడిగూడెం బహమనీల కాలంలో గార్లపాటి వంశానికి చెందిన ఎల్లప్ప మునగాల జాగీర్దార్‌ని పొందాడు.
ఇతని తర్వాత కాలంలో ప్రముఖుడు అయ్యన్న కుమారుడు.
ఇతని భార్య సుభద్రాదేవి (కీసర వారి వంశం)
అయ్యన్న కుమారుడి మరణానంతరం సుభద్రాదేవి మునగాలను పాలించింది.
ఈమె తన సోదరుడైన ముకుందప్పకు పాలనా బాధ్యతలు అప్పగించింది.
ముకుందప్ప బెరంగజేబుకు మద్దతు ప్రకటించడంతో మునగాల సంస్థానం ముకుందప్ప యొక్క కీసరవారి వంశానికి లభించింది. అప్పటి నుండి మునగాలను కీసరవారి వంశస్తులు పాలించారు.
1766 లో అసఫ్జాహి పాలకుడైన నిజాం అలీ ఉత్తర సర్కార్‌లను బ్రిటిష్ వారికి అప్పగించడంతో మునగాల బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది.
కీసరవారి వంశం ఆస్తి తగాదాల కారణంగా పతనమైంది. ఈ వంశానికి చెందిన గోపమ్మ కోదండరామయ్యను దత్తత తీసుకొని పాలకుడిగా ప్రకటించింది.
తర్వాత కాలంలో గోపమ్మ మరియు కోదండ రామయ్య భార్య అయిన రుక్కమ్మల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో కొమర్రాజు వెంకటవృయ్య మధ్యవర్తిగా నియమించబడ్డాడు. చివరకు మునగాల యొక్క హక్కులు రుక్కమ్మకు ఇవ్వబడ్డాయి.
రుక్కమ్మ కుమార్తె లచ్చమ్మ నాయిని వెంకటరంగారావు/నరసింహరావుని దత్తత తీసుకొని మునగాల జమీందారుగా ప్రకటించింది.
నాయని వెంకటరంగారావు మొదట్లో గొప్ప అభ్యుదయవాది. సాహిత్యాన్ని ప్రోత్సహించాడు.
ఇతనికి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం ఉంది.
తెలుగు విజ్ఞాన సర్వస్వం సృష్టికర్త కొమర్రాజు లక్ష్మణరావు మునగాల గడీ(సంస్థానంలో) దివాన్‌గా పనిచేశాడు.
కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులతో కలసి 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం, హన్మకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయంను స్థాపించారు.
నాయని ఆహ్వానం మేరకు జాతీయ పతాక రూపకర్త అయిన పింగళి వెంకయ్య రెండు మూడేళ్ల పాటు ఈ సంస్థానంలో వుండి, నాయనికి ప్రత్తి సాగులో మెళకువలను నేర్పాడు పింగళి వెంకయ్య ప్రత్తి పంటపై పరిశోధన చేయడం వల్ల అతన్ని పత్తి వెంకయ్య అని కూడా పిలిచేవారు.
నాయని వెంకటరంగారావు మొదట్లో అనేక అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ తర్వాత తన అభ్యుదయ భావాలను వదిలేసి తెలంగాణలోని గడిలో పరిపాలన చేశాడు.
నాయని రంగారావు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ బ్రిటిష్ వారిచ్చిన రావు బహద్దూర్ కారణంగా నాయని వెంకట రంగారావుగా పిలువబడ్డాడు.
నాయని అనేక మంది ప్రజల భూములను ఆక్రమించాడు. కరణం భూములతో పాటు చాకలి, మంగళి, కమ్మరి ఇనామ్ భూములను కూడా ఆక్రమించాడు.
నాయని వెంకట రంగారావుకు వ్యతిరేకంగా 1930లో మెట్టమెదటిసారిగా మునగాల జమీన్ రైతు సంఘం ఏర్పాటు చేయబడింది.
తన భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపట్టిన సత్యాగ్రహాలను నాయని అణచివేశాడు.
144 సెక్షన్‌ను విధింపజేసి, దీన్ని ధిక్కరించిన పశువులను కూడా అరెస్ట్ చేయించాడు
ఇతనికి వ్యతిరేకంగా నండూరి ప్రసాదరావు కలుకోవ సత్యాగ్రహం చేపట్టాడు
1949లో మద్రాన్ ఎస్టేట్స్ చట్టం ప్రకారం మునగాల జమిందారీ రద్దు అయింది.
నందికేశ్వరశాస్త్రి శివతత్వ సుధానిధి అనే గ్రంథంలో నాయిని రంగారావు యొక్క వంశ చరిత్రను తెలియజేశాడు.
3. దోమకొండ:
మొదటి రాజధాని - బిక్కనవూరు
రెండవ రాజధాని - కామారెడ్డిపేట
మూడవ రాజధాని - దోమకొండ
కామినేని కాచారెడ్డి మూల పురుషుడు. ఇతను దోమకొండ జాగీర్‌ను బహమనీల నుండి పొందాడు.
1వ ఎల్లారెడ్డి రైతుల ఉద్ధరణకు కృషిచేసి నిజామాబాద్‌లో అనేక చెరువులు త్రవ్వించాడు.
2వ మల్లారెడ్డి ఒక గొప్పకవి. ఇతను షద్బక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం పద్మపురాణం అనే గ్రంథాలను రచించాడు
2వ ఎల్లారెడ్డి లింగపురాణం అనే గ్రంథాన్ని రచించాడు.
రాజన్నచౌదరి రాజధానిని కామారెడ్డిపేటకు మార్చాడు. రాజేశ్వరరావు రాజధానిని దోమకొండకు మార్చాడు.
చివరి పాలకుడైన రాజా సోమేశ్వరరావు బల్వంత్ అనే బిరుదును మీర్ మహబూబ్ అలీఖాన్ నుండి పొందాడు.
4. పాపన్నపేట (మెదక్-అందోల్ చరిత్ర) :
మొదటి రాజధాని - కల్పగురు
రెండవ రాజధాని - అందోల్
మూడవ రాజధాని - పాపన్నపేట
ఈ సంస్థాన స్థాపకుడు అనంతరెడ్డి. ఇతను బహమనీల నుండి కల్పగురు జాగీర్‌ను పొందాడు
రామినెడు రాజధానిని అందోల్‌కు మార్చాడు. నరసింహారెడ్డి భార్య శంకరమ్మ నిజాం అలీ నుండి రాయ్ బగన్ (ఆడసింహం) అనే బిరుదును పొందింది. శంకరమ్మ తన తండ్రి సంగారెడ్డి పేరు మీద సంగారెడ్డి పట్టణం నిర్మించింది.
తల్లి రాజమ్మ పేరు మీద రాజంపేట, తన పేరు మీద శంకరంపేట, తన సేనాధిపతి పాపన్న పేరుమీద పాపన్నపేట
నిర్మించింది.
5. గద్వాల (మహబూబనగర్)
రాజధాని - గద్వాల
ఈ సంస్థానం పరిధిలో 360 గ్రామాలు ఉన్నాయి.
మూలపురుషుడు - బుద్దారెడ్డి.
బుద్ధారెడ్డి గద్వాల జాగీర్‌ను 2వ ప్రతాపరుద్రుని నుండి పొందాడు
పెద సోమభూపాలుడు గొప్పవాడు. ఇతను గద్వాల కోటను నిర్మించాడు. ఇతను జయదేవుని గీతాగోవిందంను తెలుగులోకి అనువదించాడు.
చిన సోమభూపాలుడు రతిశాస్త్రంను తెలుగులోకి అనువదించాడు. గద్వాలకు చెందిన రాణి ఆదిలక్ష్మీదేవమ్మ తన మనవడు అయిన కృష్ణరాయ భూపాలుడిని దత్తత తీసుకుని గద్వాల పాలకుడిగా ప్రకటించింది. కానీ, ఇతను పూర్తి పాలనా బాధ్యతలు చేపట్టక ముందే ఇది భారత యూనియన్ (హైదరాబాద్ రాష్ట్రం) లో విలీనమైంది.
6. వనపర్తి (నహబూబ్‌నగర్):
మొదటి రాజధాని - నూగూరు
రెండవ రాజధాని -వనపర్తి
ఈ సంస్థానం పరిధిలో 124 గ్రామాలు ఉన్నాయి.
ఈ సంస్థాన స్థాపకుడు వీరకృష్ణారెడ్డి కాగా గొప్పవాడు - గోపాలరావు.
చివరి పాలకుడు - 3వ రామేశ్వరరావు
వీరక్రిష్టారెడ్డి బహమనీల నుండి నూగూరు జాగీర్‌ను పొందాడు
వెంకటరెడ్డి కాలంలో పెనగలూరి వెంకటాద్రి అనే కవి మోహిని విలాసం అనే గ్రంథాన్ని రచించాడు
1వ రామకృష్ణారావు రాజధానిని వనపర్తికి మారాడు.
రాజరాజేశ్వరరావు దళితుల ఉద్ధరణకు కృషి చేశాడు. కుల వివక్షను ఖండించాడు. విద్య, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. ఇతని బిరుదు రాజా బహద్దూర్.
ఇతను 19వ శతాబ్ధం మొదటి దశకా(1810-40)ల్లో ఉన్నాడు. అందువల్లనే నురవరం ప్రతావరెడ్డి రాజరామేశ్వరరావుని ప్రథమావంధ్ర సంఘ సంస్కర్త అని పేర్కొన్నాడు.
నెమలూరి వెంకటశాస్త్రి వనపర్తి సంస్థాన చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు.
7. జటప్రోలు (మహబూబ్‌నగర్):
మొదటి రాజధాని - జటప్రోలు
రెండవ రాజధాని - కొల్లాపురం
మూలపురుషుడు - చెవిరెడ్డి(భేతాళ రెడ్డి)
చివరి పాలకుడు - వెంకట జగన్నాథరావు
మాదానాయుడు విజయనగర పాలకుల నుండి జటప్రోలు జాగీర్‌ను పొందాడు.
సురభి మాదవరాయలు చంద్రిక పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు.
సురభి వెంకటలక్ష్మారావు కాలంలో సదాశివశాస్త్రి, అవధానం శేషాశాస్రి చంద్రికా పరిణయంపై శరథాగయు అనే వాఖ్యాన గ్రంథం రచించాడు.
సురభి నర్సింగరావు నక్షత్ర ఖేలనం(సంస్కృతంలో) అనే గ్రంథాన్ని రచించాడు.
8. సిర్నవల్లి:
స్థాపకుడు - వెన్నమారెడ్డి
ప్రదేశం - నిజామాబాద్ జిల్లా, దర్చల్లి మండలం
నిజాం కాలం మొదట్లో ఈ సంస్థానం నర్సారావు ఆధీనంలో వుండేది. తర్వాత చీలం ప్రతాపరెడ్డి చేతిలోకి వచ్చింది.
ప్రతాపరెడ్డి చనిపోవడంతో ఆయన భార్య జానకీబాయి పాలనా బాధ్యతలు చేపట్టింది.
జానకీబాయి చాలాకాలం పాటు పాలించింది. ఈమె కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు పేర్కొంటారు.
ఈమె అనేక చెరువులు, కుంటలు, కాలువలు త్రవ్వించింది. జానకీబాయికి పాలనలో వకీల్ లింగన్న అనే పట్వారీ సహకరించేవాడు.
1901లో నిజాం రాజు హైదరాబాదు నుండి బోధన్ మీదుగా మహరాష్ట్రకు రైలు మార్గం వేయిస్తున్నప్పుడు ఆ మార్గాన్ని సిర్నవల్లి మీదుగా వేసేలా నిజాం రాజును జానకీబాయి ఒప్పించింది. దీనికి కృతజ్ఞతగా ఇందూరు ప్రాంతానికి నిజామాబాద్‌గా పేరును మార్చింది.
ఈమెకు సంతానం లేకపోవడంతో మెదక్‌కు చెందిన రామలింగారెడ్డిని దత్తత తీసుకుంది.
తర్వాతి కాలంలో ఈ గడీ పాలనను చీలం రామలింగారెడ్డి చూసేవాడు.
తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఈ గడీ మీద కూడా దాడులు జరిగాయి. కానీ, అప్పటికే గడీలోని దొరలందరూ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
ఫ్యూడల్ వ్యవస్థ అంతం తర్వాత జరిగిన నక్సల్ పోరాటంలో, దట్టమైన అడవులు కలిగిన సిర్నవల్లి గ్రామం మిలిటెంట్ల కేంద్ర స్థానంగా వుండేది.
9. నారాయణపురం:
నల్గొండ జిల్లాలోని నారాయణపురాన్ని మంచల్‌రెడ్డి పాలించాడు
రాయన్‌రెడ్డి రాజాపేట కోటను నిర్మించాడు
ఈ సంస్థానంలో చివరి పాలకురాలు - జహరున్నీసా బేగం
10. ఆత్మకూరు/అమరచింత (మహబూబ్‌నగర్ జిల్లా) :
తొలి రాజధాని - తివుడంపల్లి
2వ రాజధాని - ఆత్మకూరు
ఈ సంస్థానం మూల పురుషుడు - గోపాల్‌రెడ్డి
మొదటివాడు - గోపాల్‌రెడ్డి
2వ సాహిబ్‌రెడ్డి రాజధానిని తివుడంపల్లి నుండి ఆత్మకూరుకు మార్చాడు
చివరి పాలకురాలు - భాగ్యలక్ష్మమ్మ
గడీలు
గడీ అనగా కోట అని అర్ధం (మరాఠీ భాషలో)
భూస్వాముల కోటలను గడీలు అనేవారు. ఈ భూస్వాములను దొరలు అని పిలిచేవారు. వీరు తమ ప్రాంతాల్లో అధికారాలు చెలాయించేవారు. భూస్వాములు తమ కార్యకలాపాలను తమ కేంద్ర స్థానంలోని కోట నుండి నిర్వహించేవారు. ఈ కోటనే గడీ అనేవారు.
భూస్వాములు ప్రజల భూములను ఆక్రమించి, గ్రామాలను దోచుకుని, ప్రజలతో వెట్టి చేయించి ఈ గడీలను నిర్మించారు. ఈ గడీ చుట్టూ మట్టితో, రాతితో లేదా రెండూ కలిపి కట్టిన ఎత్తయిన ప్రహారీ గోడలు, అన్ని వైపులా బురుజులు ఉండేవి. మందపు ఇనుప కడ్డీలతో, పిడులతో తయారు చేసిన బలమైన తలుపులు, ఎత్తయిన దర్వాజలు (గుమ్మాలు) ఉండేవి. సాధారణంగా ఈ కోట (గడీ)లో రెండు భాగాలు ఉండేవి
1. ముందు భాగం - భూస్వామి అధికారిక వ్యవహారాలు
2. వెనుక భాగం - భూస్వామి కుటుంబం నివాసం
భూస్వామి ప్రజలను గడీ ముందు భాగానికి పిలిపించి విచారణ జరిపేవాడు.
ప్రజలు చెల్లించాల్సిన జరిమానాలను నిర్ణయించేవాడు. ప్రజలను హింసించేది కూడా ఈ ముందు భాగంలోనే. దెబ్బలు కొట్టడానికి కొరడాలు, చిన్న కర్రలు ఉపయోగించేవారు. దీంతో పాటు ఇంకా వేలాడదీసి కొట్టేవారు.
భూస్వాములు సాగించే ఈ దురాగతాలకు గడీ ముందు భాగం కేంద్ర స్థానంగా ఉందేది.
ఆ ప్రదేశపు వాతావరణం అత్యంత భయానకంగా ఉండేది. అక్కడికి వెళ్లినవారు ఎటూ తోచని స్థితిలో ఉంటూ దొరకు దాసోహం అనేవారు. దీన్నే తెలంగాణలో 'గడీల పాలన' అని పిలుస్తారు.
అవ్పట్లో తెలంగాణలో వన్ను వనూలు చేయుటకు నియమించబడిన వారిని వివిధ పేర్లతో పిలిచేవారు. వారిలో ప్రముఖులు
దేశ్‌ముఖ్‌లు దేశ్‌పాండేలు పటేళ్లు
దేశ్‌ముఖ్‌లు దేశ్‌పాండేలు పటేళ్లు
పట్వారీలు జాగీర్‌దార్లు మఖ్తాదారులు
దేశ్‌ముఖ్ - వీరు ఉన్నత స్థానంలో ఉండేవారు. వీరు అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. వీరు పన్నులు వసూలు చేయడానికి స్థానికంగా అనేక మంది క్రిందిస్థాయి ఉద్యోగులను నియమించేవారు. ఈ దేశ్‌ముఖ్‌లే తర్వాత కాలంలో భూస్వాములు గా ఎదిగి తమ ఆధీనంలోని గ్రామాల్లో దొరలుగా పెత్తనం చెలాయించసాగారు.
దేశ్‌పాండే - వీరు.కూడా ఉన్నత స్థానంలో ఉండే ఒక మేధావి వర్గంగా పరిగణించబడేవారు. వీరిలో అత్యధికంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు.
పటేల్, పట్వారీ - క్షేత్ర స్థాయిలో పన్ను వసూలు చేసే క్రింది స్థాయి ఉద్యోగులు. వీరు కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలను అనేక విధాలుగా దోచుకున్నారు. లేని పన్నులను వసూలు చేసేవారు. వీఠు చిన్న భూస్వాములుగా పెత్తనం చెలాయించేవారు.
జాగీర్‌దార్లు - ఉన్నత ఉద్యోగులకు జీతాలకు బదులుగా భూములు ఇవ్వబడదేవి. వీటిని జాగీర్లు అంటారు. ఈ భూముల యజమానులను జాగీర్‌దార్లు అంటారు. జాగీర్‌దార్లు క్షేత్ర స్థాయిలో వివిధ రకాల పన్నులు వసూలు చేసి ప్రజలపై ఆకృత్యాలు చేసేవారు.
మఖ్తాదార్లు - వీరికి గ్రామాల్లో పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది. ఈ విధంగా పన్నులు వసూలు చేసే అధికారాన్ని పొందినందుకు గాను ప్రభుత్వానికి రుసుమును చెల్లించేవారు.
తర్వాత కాలంలో పైన పేర్కొనబడిన ప్రతీ ఒక్కరు కూడా భూములకు యజమానులై భూస్వాములు లేదా దొరలుగా పెత్తనం చెలాయించారు.
భూస్వాములు/దొరల దగ్గర అనేక మంది పని చేసేవారు
పెద్ద గుమస్తా - దొరకు సలహాలు ఇచ్చేవారు
చిన్న గుమస్తా - దొరలు చెప్పిన పనులు చేసేవారు
సేరిదారులు - వ్యవసాయం చేయించేవారు
సైసు - గుర్రాన్ని చూసుకునేవారు
దొరలలో కొంతమంది మంచివారు కూడా వున్నారు.
మందముల నర్సింగరావు ప్రకారం మంచి దొరలు
1 నవాబ్ సాలర్‌జంగ్
2 మహారాజా కిషన్‌సింగ్
3 నవాబ్ కామూల్ జంగ్
విసునూరు గడీ:
నిర్మించిన సంవత్సరం -1935-36
ప్రదేశం -నల్గొండ జిల్లా జనగామ తాలూకా
యజమాని -రాపాక రామచంద్రారెడ్డి
రాపాక రామచంద్రారెడ్డి తండ్రి కోనరెడ్ది, తల్లి జానమ్మ. రాపాక జానమ్మ క్రూరురాలు. గుండాలతో అనేక గ్రామాలను ఆక్రమించి దురాగతాలకు పాల్పడేది.
జానమ్మను చూసి అందరూ భయపడేవారు. ఈమెను అమ్మా అని పిలిచినా తప్పే. “ఏంట్రా, అమ్మా అంటావ్..నీ అయ్యకు పెళ్లాన్నా?” అని గద్దించేది. అయ్యా అని పిలిపించుకునేది.
రామచంద్రారెడ్డి కూడా తల్లికి తగ్గ కొడుకే. ఇతని దురాగతాలకు అంతులేదు. ఇతను 60 గ్రామాలకు దేశ్‌ముఖ్.
రాపాక రామచంద్రారెడ్డి వినునూరులోని గ్రామాలను ఆక్రమించి, 4 ఎకరాలలో సకల వనతులతో గడీని నిర్మించుకున్నాడు. ఇందులో అప్పటికి ప్రపంచంలో అందుబాటులో వున్న సౌకర్యాలన్నీ వుండేవి.
ఈ గడీ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇటుక,సున్నపు బట్టీలు, అనేక గ్రామాలలోని తుమ్మ చెట్లను, బర్మా నుండి టేకు కర్ర, బెల్జియం నుండి అద్దాలు, అజంజాహి మిల్లు నుండి ప్రత్యేక విద్యుత్ లైను వేయించాడు.
ఈ గడీ గృహ ప్రవేశోత్సవంను ఎంతో వైభవంగా నిర్వహించాడు. పనులన్నీ ప్రజలతో వెట్టిగా చేయించాడు. దొర ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే, ఎడ్లబండిలో వెళ్లేవాడు. బండి ముందు ఒక చాకలి పరుగెత్తేవాడు.
రామచంద్రారెడ్డి ఆ సమయంలోనే ఇంగ్లాండ్ నుండి ఒక కారు, రైఫిల్, పిస్టల్‌లను కొన్నాడు (అప్పటికి హైదరాబాద్‌లో మాత్రమే కార్లు వుండేవి)
దొర కుడి భుజం - బాబుదొర (ఇతను రెండవ కొడుకు)
రామచంద్రారెడ్డికి ప్రతి ప్రాంతంలో నమ్మకమైన బంటు వుండేవాడు.
విసునూర్ - మస్కీన్ అలీ, ఓనమాల వెంకయ్య
దేవరుప్పల - అబ్బాస్ అలీ
వరిమిడ పల్లె - జాన్‌మియా
ముత్తారం - రాంరెడ్డి
విసునూర్ గడీ ఎన్నో నెత్తుటి మరకలకు నెలవు. ఎంతో మంది అమాయక ప్రజలను బలితీసుకుంది.
రామచంద్రారెడ్డి అండతో ఇతని అనుచరులు ప్రజలపై దౌర్జన్యాలు చేసేవారు.
మూడు రోజుల బాలింత కూడా పొలం పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. పిల్లలకు పాలు ఇవ్వాలంటే మోదుగ దొప్పలో పాలు పిండి చూపించమనేంత క్రూరుడు విసునూర్ రామచంద్రారెడ్డి.
చిన్న భూస్వాముల పై కూడా అరాచకాలకు దిగేవాడు.
మోత్కూరు మండల భూస్వామి పడిశాల వెంకటరెడ్దిని హత్య చేయించాడు.
బమ్మెర మఖ్తాదారు నరసింహారావును అనేక అవనూనాలకు, హింసకు గురిచేశాడు.
తెలంగాణ ప్రజల జీవిత పరిశీలనకు వచ్చిన జాతీయ కాంగ్రెస్ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్య, నిరీక్షణరావు, భోగాతుల రామారావులను విసునూరు గడీలో 8 రోజులపాటు బంధించాడు.
అందుకే విసునూరు గడీ సాయుధ పోరాటానికి తొలి కేంద్రమైంది.
తన భూమిని దక్కించుకోవడానికి విసునూరి దౌర్జన్యాన్ని ఎదురించి, న్యాయం పోరాటం చేసి గెలిచిన పేద ముస్లిం యువకుడు షేక్ బందగీని కత్తులతో దాడి చేయించి హతమార్చాడు.
బందగీ మరణం తెలంగాణలో తొలి రక్త ప్రేరణగా నిలిచింది.
అన్యాయంగా పంటను కబళించాలని ప్రయత్నించిన విసునూరికి ఎదురొడ్డి పోరాడిన మహిళ చాకలి ఐలమ్మ తెలంగాణలో భూస్వాముల పై తిరుగుబాటులో తొలి విజయకేతనం ఎగురవేసింది.
చాకలి ఐలమ్మకు సహకరించిన దళం- భీంరెడ్డి నర్సింహారెడ్డి దళం
కడవెండి గ్రామంలో రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ అక్రమాలకు ఎదురు తిరిగి, రామచంద్రారెడ్డి పై తిరుగుబాటు చేసిన దొడ్డి కొమరయ్యను దొర గుండాలు కాల్చి చంపారు.
సంజీవన్‌రావుపేట గడీ:
నిర్మించిన సంవత్సరం : 1910
నిర్మించిన సంవత్సరం : 1910
ప్రదేశం ; నారాయణఖేడ్ (మెదక్)
యజమాని : సంజీవన్‌రావు దేశ్‌ముఖ్
ప్రధాని : దొడ్డప్ప
సంజీవన్‌రావుపేట గడీ 50 గ్రామాలకు కేంద్రం. ఈ గడీ నుండే మొత్తం పాలన జరిగేది.
ఈ గడీని పాలించిన దొరలు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. ఈ గడీ పాలనలో అరాచకం కాకుండా అభివృద్ధి వుండేది.
సంజీవన్ రావు కాలంలో ఎక్కువ అభివృద్ధి జరగడం వలన సంజీవన్‌రావు పేట అనే పేరు వచ్చింది.
సంజీవన్‌రావు రైతులకోసం అనేక చెరువులను త్రవ్వించాడు. నాందేడ్-హైదరాబాద్ ప్రధాన రహదారి నుండి నిజాంపేట, నారాయణఖేడ్‌ల మీదుగా సంజీవన్‌రావుపేటకు రహదారిని నిర్మించాడు.
సంజీవన్‌రావుపేటలో అన్ని కులాల వారికి ఉచితంగా ఇళ్లను నిర్మించాడు.
నిజాం ప్రభువు పర్యటన కోసం సంజీవన్‌రావుపేటలో కేవలం ఒక నెలలోనే ఒక భవనాన్ని నిర్మించాడు.
నిజాం ప్రధాని మహారాజ కిషన్‌ప్రసాద్ ఈ గ్రామాన్ని తరచూ సందర్శించేవాడు.
ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు ఈ గడీ దొరలపై రజాకర్లు దాడి చేశారు.
సంజీవన్‌రావు 1946లో మరణించాడు. ఈయన అనంతరం ఇతని భార్య పద్మావతి పాలించేది.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత ఈ గడీ ప్రధాని అయిన దొడ్డప్ప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.
కంఠాత్మకూర్ గడీ :
ప్రదేశం ; నల్గొండ జిల్లా కంఠాత్మకూర్
యజమాని : పింగళి ప్రతాపరెడ్డి
ఈ గడీ ప్రజల వెట్టి చాకిరీ ద్వారా నిర్మించబడింది.
పింగళి ప్రతాపరెడ్డి ప్రజలపై అనేక ఆకృత్యాలు చేసేవాడు. నాగు వడ్డీ వ్యాపారం, నిర్బంధ వసూళ్లు చేసేవాడు. అధికంగా పన్నులు విధించేవాడు.
ప్రజలు ఇతనికి మాత్రమే కాకుండా ఇతని పాలేర్లకు కూడా సేవలు చేయాల్సి వచ్చేది.
ఈయన గుమస్తా వడ్ల పెద్దన్న ప్రజలతో వేలిముద్రలు వేయించి దొంగ కాగితాలు సృష్టించేవాడు.
వడ్ల పెద్దన్న ఇంట్లో దొంగతనం నేరం మోపి శిక్షింపబడిన వ్యక్తి - దానమల్లు
వడ్ల పెద్దన్నకు ప్రజలు. ఏమాత్రం ఎదురు తిరిగినా చిత్రపాంసలకు గురిచేసి, అనేక నేరాలలో ఇరికించి ఇబ్బందులకు గురిచేసేవాడు.
పోలంపల్లి గడీ :
ప్రదేశం : కరీంనగర్ జిల్లా, తిమ్మాపురం మండలం
యజమాని: అనభేరి వెంకటేశ్వరరావు
అనభేరి వెంకటేశ్వరరావు, రాధాబాయి దంపతుల కుమారుడు అనభేరి ప్రభాకరరావు
అనభేరి ప్రభాకరరావు దొర బిడ్డగా జన్మించినప్పటికీ దొరతనాన్ని చూపలేదు. ప్రజల తరపున పోరాడారు. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు.
దొర కుంటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకరరావు దొర వ్యవస్థకే వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాడు.
దొరల దగ్గర గల 40 గ్రామాలకు చెందిన ప్రజల దస్తావేజులను తగులబెట్టాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అనభేరి ప్రభాకరరావు నాయకత్వం వహించాడు.
కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలతో ప్రభావితమై, కరీంనగర్ జిల్లాలో అవభేరి ప్రభాకరరావు కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించి ఆంధ్ర మహాసభతో కలసి ప్రజల కోసం పనిచేశాడు.
నిజాం ప్రభుత్వంలో తెలుగుకు గౌరవం ఇవ్వాలని ప్రశ్నించి పోరాటం చేశాడు.
రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకర్ల బారి నుండి ప్రజలను కాపాడడం కోసం భూపతిరెడ్డి 12 మందితో కలిసి ఒక దళాన్ని ఏర్పాటు చేశాడు.
సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు గాను నిజాం ప్రభుత్వం ప్రభాకర్‌రావుపై నజర్‌బంద్ జారీ చేసింది. అయినప్పటికీ ప్రభాకర్‌రావు రహస్యంగా దళాన్ని నడిపి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడాడు.
దీంతో 1948 మార్చి 14న రజాకర్లు ప్రభాకరరావుపై దాడిచేసి హతమార్చారు. ఈ పోరాటంలో ప్రభాకర్‌రావుతో పాటు భూపతి రెడ్డి, 12 మంది దళ సభ్యులు కూడా మరణించారు. ప్రజల కోసం పోరాడిన దొరగా అనభేరి ప్రభాకరరావు చరిత్రలో నిలిచిపోయాడు.
ప్రభాకరరావుతో పాటు మరి కొంతమంది దొరలు ఈ కోవకే చెందుతారు. వారిలో నల్గొండ జిల్లా, భువనగిరి తాలూకాలోని రేణికుంట రామిరెడ్డి ఒకరు.
ఇతని ఇంటిపేరు చింతలకుంట అయినప్పటికీ గ్రామం పేరు మీదుగా రేణికుంట రామిరెడ్డిగా పేరొందారు.
రేణికుంట రామిరెడ్డి కూడా దొర అయినప్పటికీ దొర వ్యవస్థకు, రజాకర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
ఇతను ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలసి రజాకర్లకు వ్యతిరేకంగా మిలిటరీ తరహా దళాన్ని ఏర్పాటు చేశాడు.
చివరకు రజాకర్లతో పోరాటంలోనే వీరమరణం పొందాడు.
బేతవోలు గడీ:
నిర్మించిన సంవత్సరం : 1880
ప్రదేశం : నల్గొండ జిల్లా బేతవోలు గ్రామం
యజమాని : తడకమళ్ల సీతారామచంద్రరావు
ఈ గడీ తెలంగాణ మట్టి మనుషుల చేతిలో బద్దలు కొట్టబడింది.
హైదరాబాద్‌లో నివాసముండే సిద్దిఖీ అనే నవాబు దగ్గర తడకమళ్ల సీతారామచంద్రరావు 5 గ్రామాలను మళ్లాకు తీసుకున్నాడు.
1 బేతవోలు 2 జర్రిపోతులగూడెం 3 ఆచార్యులగూడెం 4 చిన్నారిగూడెం 5 పాలెంగూడెం
అప్పటికే బేతవోలు గడీని బొంబాయి ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు.
బేతవోలు గ్రామానికి మునగాల మీదుగా నీళ్లు వస్తాయి. కానీ, మునగాల దొర నాయని వెంకట రంగారావు నీటిని బేతవోలు గ్రామానికి వెళ్లకుండా అడ్డుకున్నాడు.
దీంతో సీతారామచంద్రరావు కోర్టులో కేసు వేసి బేతవోలు గ్రామానికి నీళ్లు వచ్చేలా చేశాడు. ఇందుకు అయిన ఖర్చును వడ్డీ, చక్రవడ్డీతో సహా ప్రజల నుండే వసూలు చేసేవాడు.
సెంట్ల పన్ను, ఆడబిడ్డ గంపలు, దేవుని పన్ను, కౌలుదారుని పన్ను, పశువులకు రూపాయిన్నర పన్ను చేనేత మగ్గాల పన్ను, పెళ్లి పన్ను మంత్రసాని పన్ను వంటి అనేక పన్నులు వసూలు చేసేవాడు.
సీతారామచంద్రరావు భూములను ఆక్రమించడం, ప్రజలతో వెట్టి చాకిరీ చేయించుకోవడం వంటి ఆకృత్యాలకు పాల్చడేవాడు. దీంతో ఆగ్రహించిన ప్రజలు సాయుధ పోరాట సమయంలో ఈ గడీపై దాడి చేసి, ధ్వంసం చేశారు.