భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు
1885లో రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అయిన అలెన్ ఆక్టావియన్ హ్యూమ్ గవర్నర్ జనరల్ అయిన డఫ్రీన్ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశాడు.ఏ.ఓ.హ్యామ్ యొక్క స్వీయచరిత్రను వెడెన్‌బర్న్ రచించాడు.
భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా బ్రిటీష్ వారి మంచి పరిపాలనా విధానాలను భారతీయులకు తెలియ జేయుటకు బ్రిటీష్‌వారు నిర్ణయించారు. దీనినే సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతం అంటారు.
భారతీయ విద్యావంతులు బ్రిటీష్ వారి నిజ స్వరూపాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయుటకు నిర్ణయించారు. దీనిని లైటెనింగ్ సిద్ధాంతం అంటారు.
భారత జాతీయ కాంగ్రెస్ మొదట్లో ఇండియన్ నేషనల్ యూనియన్‌గా పిలవబడింది.
దాదాబాయి నౌరోజీ యూనియన్‌కు బదులు కాంగ్రెస్ అనే పదాన్ని చేర్చాడు.
భారత జాతీయ కాంగ్రెస్ ఆంగ్ల అధ్యక్షులు:
1) జార్జి యూల్
2) వెడెన్‌బెర్న్ (2సార్లు)
3) ఆల్ఫ్రైడ్ వెబ్
4) హేవ్రీ కాటన్
భారత జాతీయ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు:
1) అనిబిసెంట్
2) సరోజినీనాయుడు
3) నళినీసేన్ గుప్తా