Qutb Shahi Dynasty కుతుబ్‌షాహీలు 1

TSStudies

Qutb Shahi Dynasty in Telugu

కుతుబ్‌షాహీలు 1512-1687 మధ్య కాలంలో మొత్తం ఏడుగురు పాలకులు 175 సంవత్సరాలు పరిపాలించారు.  వీరు షియా ముస్లింలు. 

స్థాపకుడు -- సుల్తాన్ కులీకుతుబ్ షా
గొప్పవాడు -- మహ్మద్ కులీకుతుబ్ షా
చివరివాడు -- హాసన్ తానీషా 
రాజధాని -- గోల్కొండ 
రాజభాష -- పర్షియా / పారశీ 
తెగ -- కురుకునెల్ 

సుల్తాన్ కూలీ కుతుబ్ షా (1512 - 1543)
ఇతను దక్షిణ ఇరాన్లోని హందం ప్రాంతానికి చెందినవాడు 
ఇతని తెగ కురుకునెల్ తెగ 
హందంలోని ఆకునోవ్ తెగచే పరాజయం పాలై ఇరాన్ ను వదిలి మొదటిగా ఉత్తర భారత్ చేరుకొని అక్కడి నుండి దక్షిణంలో బహుమనీ రాజ్యంలోకి ప్రవేశించారు 
బహుమనీ రాజు 3వ మహ్మద్ కురుకునెల్ తెగకు ఆశ్రయం కల్పించాడు 
కులీకుతుబ్ షా యొక్క కుటుంబీకులకు 3వ మహ్మద్ తన ఆస్థానంలో ఉన్నత పదవులు ఇచ్చాడు 
కులీకుతుబ్ షా 3వ మహ్మద్ యొక్క అంగరక్ష సైనిక దళంలో ఒక సిపాయిగా చేరాడు

తరువాత అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ప్రాంతానికి తరఫ్ దార్ గా నియమించబడ్డాడు 
మహ్మద్ గవాన్ మరియు 3వ మహ్మద్ మరణాంతరం బహుమనీ రాజ్యం చీలికకు గురైంది 
దీనితో కులీకుతుబ్ షా 1512 లో తెలంగాణాలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు 
గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు 
ఇతను గోల్కొండలో 2 మినార్ లతో ఒక మసీద్ ను నిర్మించాడు తరువాత దీనిని ఇబ్రహీం కుతుబ్ షా పూర్తి చేసాడు 
ఈ మసీద్ ల ఆధారంగా తరువాతి కాలంలో చార్మినార్ నిర్మాణం జరిగింది 
3వ కుమారుడు జంషీద్ కులీకుతుబ్ షా మహ్మద్ హుందానిచే సుల్తాన్ కుతుబ్ షా ను చంపించాడు 

జంషీద్ కూలీ కుతుబ్ షా (1543 - 1550)
ఇతను చాల కఠినంగా వ్యవహరించేవాడు 
ఫెరిస్తా ప్రకారం చిన్న చిన్న తప్పులకు కూడా మరణశిక్ష విధించేవాడి 
ఇతని సోదరుడు అయినా ఇబ్రహీం కూలీ కుతుబ్ షా దేవరకొండ దుర్గాధిపతిగా ఉండేవాడు 
ఇబ్రహీం తన అన్న అయిన జంషీద్ మీద కుట్రలు పన్నాడు 
ఈ విషయం తెలుసుకున్న జంషీద్ ఇబ్రహీంను బంధించుటకు సైన్యాన్ని పంపించాడు 
దీనితో ఇబ్రహీం కూలీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని వదిలి విజయనగర సామ్రాజ్యంలోకి ప్రవేశించాడు 
ఇబ్రహీం 7సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం లో గడిపాడు 
అప్పుడే ఇబ్రహీం కులీకుతుబ్ షా తెలుగు కవులను కలుసుకొని తెలుగు భాషపై అభిమానం పెంచుకున్నాడు 
1550 లో జంషీద్ కులీకుతుబ్ షా 'రాజ యక్ష' అనే వ్యాధితో మరణించాడు 
జంషీద్ భార్య అయినా బిల్కిస్ జమాన్ తన మైనర్ కుమారుడైన సుభాన్ ను పాలకుడిగా ప్రకటించింది 
కానీ ఇబ్రహీం కులీకుతుబ్ షా విజయనగర సైన్యం సహకారంతో గోల్కొండను ఆక్రమించాడు 
ఇబ్రహీం సుబాన్ ను హతమార్చి తానే పాలకుడిని అని ప్రకటించుకున్నాడు 



Tags: Telangana History Qutb Shahi Dynasty, founder of Qutb Shahi Dynasty, empires list of Qutb Shahi Dynasty, tspsc Qutb Shahi Dynasty notes in telugu, Qutb Shahi Dynasty study material in telugu, appsc notes in telugu, Qutb Shahi Dynasty great empire, last king of Qutb Shahi Dynasty, kings list of Qutb Shahi Dynasty