ఆంధ్ర మహాసభ-Role of Andhra Mahasabha in Nizams State
తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ సంస్థ - ఆంధ్ర మహాసభ
ఆంధ్ర మహాసభ లో మొదటి తరం నాయకులందరూ మితవాదులు
ఉదా! మాడపాటి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మందముల నరసింగారావు, జమలాపురం కేశవరావు, పులిజాల వెంకటరంగారావు
ఆంధ్ర మహాసభలో 2వ తరం నాయకులందరూ అతివాదులు
ఉదా॥ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్టూం మొహియుద్దీన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు
1930 నుండి 1946 మధ్య కాలంలో అనేక ప్రాంతాలలో ఆంధ్ర మహాసభ యొక్క సమావేశాలు జరిగాయి
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రయత్నాల ఫలితంగా ఆంధ్రమహాసభతో పాటు సమాంతరంగా ఆంధ్ర మహిళా సభలు కూడా నిర్వహించబడ్డాయి
జోగిపేట సమావేశం - 1930 మార్చి :
అధ్యక్షుడు- సురవరం ప్రతాపరెడ్డి
మహిళా సభ అధ్యక్షురాలు - నడింపల్లి సుందరమ్మ
గస్తీ నిషాన్- 53ను రద్దు చేయాలని ఈ సభ తీర్మానించింది
1926లో వాక్, సభ, పత్రిక స్వాతంత్రాలను హరించుట కొరకు ఈ గస్తీ నిషాన్-53 ఆర్డినెన్స్‌ను నిజాం ప్రభుత్వం తీసుకొచ్చింది. బాల్య వివాహాలను నిరోధించాలని, వితంతు వివాహాలను ప్రోత్సహించాలని తీర్మానం.
దేవరకొండ సమావేశం (నల్గొండ) - 1931 :
అధ్యక్షుడు - బూర్గుల రామకృష్ణారావు
ఈ సభలో కూడా గస్తీ నిషాన్-53ను రద్దు చేయాలని మరల డిమాండ్ చేశారు
ఈ సభకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు
1 గూడవల్లి రామబ్రహ్మం (సినీ నిర్మాత)
2 మాదిరి భాగ్యారెడ్డివర్మ (ఆది హిందూ ఉద్యమకర్త)
3 రావి నారాయణరెడ్డి
(స్నేహితునితో కలిసి హైదరాబాద్ నిజాం కళాశాల నుండి కాలినడకన దేవరకొండ సభకు వచ్చాడు)
ఖమ్మమ్మెట్టు - 1934 :
అధ్యక్షుడు- పులిజాల వెంకటరంగారావు
దేవదాసీ విధానం రద్దు చేయాలని ఈ సభ తీర్మానం చేసింది
సిరిసిల్ల (కరీంనగర్) 1935 :
అధ్యక్షుడు - మాడపాటి హనుమంతరావు
మహిళా సభ అధ్యక్షురాలు - మాడపాటి మాణిక్యాంబ
ఈ సభ నిర్వహణ కొరకు వేములవాడ భీమకవి పేరు మీదుగా వేములవాడ భీమకవి నగర్ నిర్మించబడింది
ఈ సభలో స్వపరిపాలన డిమాండ్ చేయబడింది
తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే తీర్మానం ఆమోదించబడింది
రావి నారాయణరెడ్డి ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాడు .
షాద్‌నగర్ (మహబూబ్‌నగర్) - 1936:
అధ్యక్షుడు - కె.వి.రంగారెడ్డి
నిజామాబాద్ - 1937:
అధ్యక్షుడు - మందముల నరసింగరావు (రయ్యత్ పత్రిక సంపాదకుడు)
ఇది జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన మొదటి సభ
పౌర హక్కులు డిమాండ్ చేయబడ్డాయి
తెలుగుభాషను మాత్రమే ఉపయోగించాలనే నియమాన్ని ఎత్తివేయాలని రావి నారాయణరెడ్డి పట్టుబడ్డాడు. కానీ, సురవరం దీన్ని వ్యతిరేకించాడు.
మల్కాపురం -1940 :
అధ్యక్షుడు - రామచంద్రరావు
రాజకీయ నంస్మరణల కోనం వచ్చిన అరవముదం అయ్యంగార్ కమిటీ యొక్కనివేదిక ఈ సభలో చర్చించబడింది
ఈ నివేదిక పూర్తిగా తిరస్కరించబడింది
చిలుకూరు (రంగారెడ్డి) -1941 :
అధ్యక్షుడు - రావి నారాయణరెడ్డి
ఆంధ్ర మహాసభ యొక్క సభ్యత్వ రుసుము 1 రూపాయి నుండి 4 అణాలకు తగ్గించబడింది
తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే నియమం ఎత్తివేయబడింది
ధర్మారం(వరంగల్) -1942 :
అధ్యక్షుడు - కోమటేశ్వరరావు
ఈ సభలో అతివాదుల ఆధిపత్యం అధికమయింది
హైదరాబాద్: మన కర్తవ్యం అనే గ్రంథాన్ని విమర్శించడం జరిగింది. దీని రచయితలు బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు
హైదరాబాద్-1943 :
అధ్యక్షుడు - కె.వి.రంగారెడ్డి
మొదటిసారిగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి
అంధ్ర సారస్వత పరిషణ్ ఏర్పాటు గురించి ఈ సభలో చర్చించబడింది
భువనగిరి (నల్గొండ)-1944 :
అధ్యక్షుడు - రావి నారాయణరెడ్డి
11వ సభయైన ఈ భువనగిరి ఆంధ్ర మహాసభ అతి ముఖ్యమైనది
సభ్యత్వ రుసుము 4 అణాల నుండి 1 అణాకు తగ్గించారు
ఈ సభలోనే ఆంధ్రా మహాసభ అధికారికంగా మితవాదులు, అతివాదులుగా చీలిపోయింది
ఇక నుండి వేర్వేరుగా సభలు నిర్వహించుకొనుటకు నిర్ణయించారు.
ఈ సభ తర్వాత ఆంధ్ర మహాసభ యొక్క శాఖలు తెలంగాణాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ శాఖలనే సంగములు అని పిలిచేవారు
మడికొండ (వరంగల్-1 945 :
ఇది మితవాదుల సభ
అధ్యక్షుడు - మందముల నర్సింగరావు
సభ్యత్వ రుసుం 1 అణా నుండి రూ. 1కి పెంచారు
ఖమ్మం -1945 :
ఇది అతివాదుల సభ
అధ్యక్షుడు - రావి నారాయణరెడ్డి
పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్న సభ. వెట్టి చాకిరీ రద్దు చేయాలని తీర్మానం
బుర్రకథ కళకారుడు నాజర్ ఈ సభకు హాజరయ్యాడు
కంది (మెదక్) -1946 :
ఇది మితవాదుల సభ
అధ్యక్షుడు - జమలాపురం కేశవరావు
కరీంనగర్ - 1946 :
ఇది అతివాద సభ
అధ్యక్షుడు - బద్దం ఎల్లారెడ్డి
1946లో జరిగిన ఈ రెండు సభలు కూడా ఆంధ్ర మహాసభ యొక్క చివరి సభలుగా పరిగణించబడుతాయి.
దీని తరువాత ఆంధ్ర మహాసభలోని మితవాదులు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరిపోగా అతివాదులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారు.