తెలంగాణ చరిత్ర
పూర్వయుగం
Ø చరిత్ర
పూర్వయుగం అంటే లిఖిత పూర్వక ఆధారాలు లేని యుగం
Ø లిఖిత ఆధారాలు
లభిస్తున్న గత 2300 సంవత్సరముల
కాలాన్ని చారిత్రక యుగం అంటారు.
Ø తెలంగాణాలో
మొదటిసారిగా చరిత్ర పూర్వ యుగానికి (బృహత్ యుగానికి) సంబందించిన ప్రదేశం నల్గొండ
జిల్లా లోని వలిగొండ, దీనిని పరిశోధన
చేసినవారు - రాబర్ట్ బ్రూస్ పూట్.
Ø హైదరాబాద్
పురావస్తుశాఖ 1914లో ఏర్పాటు
చేయబడింది.
Ø కొత్త
రాతియుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్టు - రాగి
Ø రాక్షసగూళ్ళ
యుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు - ఇనుప పనిముట్లు, కావున ఈ కాలాన్ని అయో (ఇనుప) యుగమని కూడా
అంటారు. ఈ యుగంలో చిన్న చిన్న రాజ్యాలు, లిపి, నాగరికతా
చిహ్నాలు ప్రారంభమైనవి. కాబట్టి ఈ యుగాన్ని "చరిత్ర పూర్వ యుగం" , "చారిత్రక యుగం", "మధ్య సంధి యుగం (ప్రోటో
హిస్టరీ) లేదా "పురా చారిత్రక యుగం" అని అంటారు.
Ø చరిత్ర పూర్వ
యుగాన్ని వారు వాడిన పనిముట్ల ఆధారంగా కూడా పిలుస్తారు.
ఉదాహరణ:
దిగువపాత
రాతియుగం - గులక రాయి పనిముట్లు
మధ్య పాత
రాతియుగం - రాతి పెచ్ఛుల పనిముట్లు
ఎగువ పాత
రాతియుగం - కొచ్చెటి పనిముట్లు
మధ్య రాతియుగం
- చిన్న చిన్న రాతి పనిముట్లు
కొత్త రాతి
యుగం - నున్నటి పనిముట్లు
రాక్షసగుళ్ల
యుగం - ఇనుప లోహ పనిముట్లు
దిగువ పాత రాతియుగం (3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం):
ఈ యుగానికి చెందిన ముఖ్యమైన
ప్రదేశాలు
·
ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ , పొచ్ఛేర
జలపాతం
·
కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖిని , రామగుండం
·
ఖమ్మం జిల్లాలోనే పాల్వంచ
·
నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జున కొండ
·
మహబూబనగర్ జిల్లా లోని చంద్రగుప్త పట్టణం, ఈర్ల దిన్నె
Ø పెద్ద ఆకారాలతో ఉండే చేతి
గొడ్డళ్లు, గోఖుడు రాళ్లు , వృత్తాకారపు రాళ్ళూ, ఈ యుగపు మనుషుల వేటలో మరియు
ఆహారణ సేకరణలో ఉపయోగపడ్డాయి .
Ø ఈ యుగపు ఆయుధాలు ఆఫ్రికా
లోని "అష్యులియన్" ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నాయి .
మధ్య పాత రాతి యుగం (1 లేదా . లక్షల సంవత్సరాల క్రితం):
Ø మొదటిసారిగా ఎద్దు
అస్థిపంజరం అవశేషాలు లభించిన ప్రదేశం - మహబూబనగర్ జిల్లాలోని యపాలపాడు దగ్గర
జరిపిన త్రవ్వకాల్లో. దీనినిబట్టి ఈ యుగపు మానవులకు ఎద్దులతో సంబంధం ఉంది
అని అర్ధం అవుతుంది.
Ø ఈ యుగపు మానవులు వదిన
పనిముట్లు - చిన్న తరహా గొడ్డళ్లు, గండ్ర గొడ్డళ్లు, గోకుడు రాళ్లు
ఎగువ పాత రాతి యుగం(క్రీ.
పూ. 20000 - 10000 సంవత్సరాల క్రితం) :
Ø ఈ యుగంలో జీవించిన ప్రజలు
బ్లేడ్ పనిముట్లు, ప్రక్క అంచు ఉన్న బ్లేడ్ పనిముట్లు, కొన్నిచోట్ల ఎముకలతో చేసిన పనిముట్లను వాడారు.
Ø రాతి గుహల్లో రంగు బొమ్మలను
గీయడం నేర్చుకున్నారు
Ø ఇది "హాలోసీన్" ఆరంభ దశను చుసిస్తుంది.
మధ్య రాతి యుగం(క్రీ.పూ. 8500 - 3000 సంవత్సరాల క్రితం):
Ø భౌగోళిక వాతావరణ పరంగా
"తోలి హాలోసీన్" యుగానికి చెందినది.
Ø ఈ యుగంలో అతి చిన్న
(సూక్ష్మ) రాతి ఆయుధాలను వాడారు.
Ø ఈ యుగాన్ని 'సూక్ష్మ రాతి యుగం" అని కూడా అంటారు.
Ø ఈ యుగానికి చెందిన
గుహల్లోని రంగు చిత్రాల్లో 150 కి పైగా బొమ్మలు
కనిపిస్తాయి.
Ø వీటిలో ప్రధానంగా జింక, చెవుల పిల్లి, హైనా, నక్క, కుక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు
సున్నపురాయి, గ్రానైట్ రాయి కొండా గుహలలో
కనిపిస్తాయి.
Ø వీటిలో ముఖ్యమైనది జింక
చిత్రం.
కొత్త రాతి యుగం (క్రీ.పూ. 3000 - 1500 సంవత్సరాల క్రితం):
Ø ఈ యుగం మలిదశలో రాగి, కంచుతో పనిముట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. వీటి సహాయంతో
భూమిని త్రవ్వి మొక్కలను నాటడం, పెంచడం, పంటలను పండించడం నేర్చుకున్నారు.
Ø దీని వల్లనా స్థిర
నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా కుటుంబం, సమాజం, గ్రామం ఏర్పడ్డాయి.
Ø పండిన పంటలను నిల్వ
చేసుకోవడానికి పాత్రలు అవసరమైనాయి దీనివల్ల కుండలు, బానాలు తయారు చేసుకోవడానికి కారణమైనది. మొదట కుండలను
చేత్తో చేసేవారు తరువాత కుమ్మరి చక్రాన్ని కనుకొన్నారు. వ్యక్తిగత ఆస్థి అనే
భావన పుట్టి ధనిక - పేద సమాజ ఏర్పాటుకు దారి తీసింది.
Ø పశువులను మఛ్చిక
చేసుకున్నారు. పంట ఉత్పత్తి చేయడానికి వ్యాపారం పుట్టుకకు దారి తీసాయి.
Ø కరీంనగర్ జిల్లా లో
తొగర్రాయి అవాసంలో పైకి పొడుచుకు వఛ్చిన గ్రానైట్ గుట్టల దగ్గర పనిముట్లను
తయారుచేసే కేంద్రం కనిపించింది.
Ø మట్టిపాత్రలకు ఎక్కువగా
కెంపు రంగు అలంకారం ఉండేది.
Ø ఈ యుగపు ఆర్ధిక వ్యవస్థ
ప్రధానంగా పశుపోషణ , వ్యవసాయం మీద ఆధారపడింది.
Ø బూడిద కుప్పలు, కొన్ని అడవి జంతువుల లేదా పశువుల దొడ్లు లభించిన ప్రదేశం -
మహబూబనగర్ జిల్లాలోని ఉట్నూరు
Ø మూపురపు ఎద్దుల టెర్రకోట
బొమ్మలు, తాటి చిత్ర లేఖనాలు కరీంనగర్
జిల్లాలోని బూదగది, వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట, నల్గొండ జిల్లాలోని రాచకొండ, ఖమ్మం
జిల్లాలోని నల్లముడి, మహబూబనగర్ జిల్లాలోని
దుప్పాడు గుట్ట, దొంగల గట్టు తదితర
ప్రాంతాలు వెలుగు చూశాయి.
Ø ఈ కాలంలో ప్రజలు ప్రదానంగా
జొన్నలు, పప్పులు, వడ్లు పండించేవారు. పంటలను ప్రధానంగా వర్షాధారంగానే
పండించేవారు.
Ø కొత్త రాతియుగంలో చనిపోయిన
వారి తలను ఉత్తరం వైపు పెట్టి ఖననం చేసేవారు.
Ø నాగార్జునకొండలో ఆవాస
ప్రాంతంలో ఇద్దరి శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు కనిపించాయి.
రాక్షసగుళ్ల యుగం
(క్రీ.పూ. 1500 - క్రీ. శ . 300 సంవత్సరాల వరకు)
Ø ఈ యుగంలో ఇనుప
వస్తువులు వాడటం వలన దీనిని అయో యుగమని అంటారు.
Ø చనిపోయిన వారి
అస్థి పంజరాలను శవపేటికలో గాని,
రాతిగుండులో
కానీ పెట్టి పూడ్చి ఆ గూడు చుట్టు పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో
నిలిపేవారు. కావున ఈ యుగాన్ని రాక్షసగుళ్ల
యుగం అంటారు. స్థానిక ప్రజలు వీటిని పాండవుల గూళ్ళు, వీర్లపాడులని కూడా అంటారు.
Ø చనిపోయిన
వ్యక్తికి ప్రియమైన పెంపుడు జంతువులను (కుక్క) కూడా అతనితోపాటు ఖననం
చేసేవారు.
Ø హైదరాబాద్
కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న రాక్షసగూడు సమాధి దేశంలోనే మొదటిది.
Ø రాక్షసగుళ్ల
సమాధులను నిర్మాణం ఆధారంగా 4 రకాలుగా
వర్గీకరించవచ్చు. అవి
1) గుంత సమాధులు: గుంత తవ్వి
అందులో మట్టి శవపేటికలో గాని, దీర్ఘచతురస్రాకారపు
రాతి పలకల గదిలో గాని అస్థిపంజరాన్ని పూడ్చి దాని చుట్టూ వలయాకారంలో పెద్ద పెద్ద
రాళ్లను నిలిపితే దానిని గుంత సమాధి అంటారు.
2) గూడుసమాదులు: దీర్ఘచతురస్రాకారపు
రాతి గదిని పూర్తిగా పూడ్చి వేయకుండా ఒక మూరెడు ఎత్తు భూమి ఉపరితలంపైకి
కనిపించే విధంగా పూడ్చి దాని మీద ఒక రాతి పాలకను పెడితే దానిని గూడు సమాధి అంటారు.
3) గది సమాధి : రాతి సమాధి
మొత్తం భూమి ఉపరితలం మీదనే ఉంటె దానిని గది సమాధి అంటారు.
4) గుహ సమాధులు : కొండల్లో గుండ్రటి గుహలను తొలచి వాటిల్లో
శవాలను పెట్టి కప్పువేస్తే వాటిని గుహ సమాధులు అంటారు.
Ø మహబూబనగర్
జిల్లాలోని ఉప్పలపాడు గుంతసమాధిలో పడవ ఆకారపు శవపేటిక లభ్యమైంది.
చిన్నమారూర్ గూడు సమాధిపై తడిక గుర్తులు కనిపించాయి.
Ø మహబూబనగర్
జిల్లాలో ఉన్న వీరాపురం సమాధుల్లో అనేక రకాల 'ఆహార ధాన్యాలు' లభించాయి.
వాటిలో ముఖ్యమైనవి వరి, బార్లీ, కొర్రలు వంటి తృణ ధాన్యాలు.
Ø హైదరాబాద్
కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని సమాధిలో రాగులు బయటపడ్డాయి.
Ø గుహరాళ్ళపై
చెక్కిన రేఖాచిత్రాలలో ప్రధానంగా త్రిశూలం, చక్కంలో నుంచి దూరిపోయే త్రిశూలం, బల్లెం కనిపిస్తాయి.