విష్ణుకుండినులు Vishnukundina Dynasty

TSStudies
0

Vishnukundina Dynasty Study Material in Telugu


స్థాపకుడు - ఇంద్రవర్మ 
గొప్పవాడు - 2వ మాధవవర్మ 
చివరి గొప్పవాడు - మంచన భట్టారికుడు 
రాజధాని - ఇంద్రపురం, కీసర 
మతం - వైష్ణవమతం 
రాజభాష - సంస్కృతం 
రాజచిహ్నం - పంజా ఎత్తిన సింహం 
వీరి పరిపాలన కాలం - (క్రీ.శ. 358 - 569)
వీరిపరిపాలన, చారిత్రక విషయాలు ప్రధానంగా 'తుమ్మలగూడెం' శాసనం ద్వారా తెలుస్తుంది 

ఇంద్రవర్మ (క్రీ.శ. 358 - 370)

  • బిరుదు - ప్రియపుత్రుడు 
  • ఇతను రామతీర్థ శాసనం వేయించాడు 
  • ఇతని రాజధాని ఇంద్రపాలనగరం (నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం  ఇంద్రపాలగుట్ట)

మొదటి మాధవవర్మ (క్రీ.శ. 370 - 398) 

  • ఇతను ఇంద్రవర్మ కుమారుడు 
  • ఇతనియొక్క బిరుదు విక్రమమహేంద్ర 
  • ఉండవల్లి, భైరవకొన, మొగల్ రాజపురంలో గుహలను చెక్కించాడు 

మొదటి గోవిందవర్మ (క్రీ.శ. 398 - 440)

  • ఇతను విష్ణుకుండినులలో అగ్రగణ్యుడు 
  • ఇతని బిరుదు విక్రమశాయుడు 
  • ఇతనియొక్క రాజధాని ఇంద్రపాలపురం 
  • ఇతనువేసిన 'ఇంద్రపాలనగర' తామ్ర శాసనం తెలంగాణాలో లభించిన తొలి సంస్కృత శాసనం 
  • ఇతను వేయించిన 'చైతన్యపురి' శాసనం తెలంగాణాలో లభించిన తొలి పాకృత శాసనం 

రెండవ మాధవవర్మ (క్రీ.శ. 440 - 495)

  • ఆనాటి దక్షిణభారతదేశ రాజులందరిలో గొప్పవాడు 
  • ఇతనికి 'త్రివరనగర భువన యువతి ప్రియుడు' అనే  బిరుదు కలదు 
  • ఇతను రాజధానిని అమరావతికి మార్చాడు 
  • ఇతను తన విజయాలను పురస్కరించుకొని 11 అశ్వమేధయాగాలు, 1000 క్రతువులను నిర్వహించాడు 
  • ఉండవల్లి గుహల్లో 'పూర్ణ కుంభాన్ని' చెక్కించాడు 
  • ఇతను దేశంలోనే ప్రథమంగా 'నరమేద యాగం' 'పురుషమేద యాగం' చేసాడు. దీని సందర్బంగా 'పినారక భట్టా' అనే బ్రాహ్మణుడిని వధించాడు 

ఒకటవ విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 510 - 525)

  • ఇతని బిరుదు మహాకవి 
  • ఇతను 2వ మాధవ వర్మ మరియు వాకాట మహాదేవి యొక్క కుమారుడు 
  • వాకాట రాజు 2వ పృథ్విసేనుడి మరణం తరువాత 'వాకాట రాజ్యం' విష్ణుకుండినుల రాజ్యంలో ఏకమైనది 

Post a Comment

0Comments

Post a Comment (0)