Indian Independence Movement-4

TSStudies
అతివాదులు (1905-1920):
1905 నుండి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో అతివాదుల ఆధిపత్యం కొనసాగింది.
అతివాదుల డిమాండ్‌ మేరకు 1905లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ గోఖలే నేతృత్వంలో వారణాసి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో బెంగాల్‌కు వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది.
1906లో అతివాదుల డిమాండ్‌ మేరకు దాదాబాయ్‌ నౌరోజీ నేతృత్వంతో కలకత్తా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్ సమావేశంలో మొత్తం భారతదేశం వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది.
1907లో రాష్‌ బిహారీ బోస్‌ అధ్యక్షతన సూరత్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్‌కాంగ్రెస్ అధికారికంగా రెండుగా  చీలిపోయింది.  (మితవాదులు -అతివాదులు)

లక్ష్యాలు:
మితవాదుల అన్ని లక్ష్యాలు
స్వరాజ్యము
బ్రిటన్‌ పరిశ్రమల నుంచి భారతీయులు చేనేతకారులను రక్షించుట

పద్ధతులు:
1. ఊరేగింపులు
2. స్వదేశీ మరియు బహిష్కరణ
3. విదేశీ వస్తాలను దహనం చేయుట
4. గణేష్‌ శివాజీ ఉత్సవాలను జరిపించడం
5. వార్తాపత్రికలు
6. సంస్థలు
7. పుస్తకాలు
8. పట్టణాల్లో సమావేశాలు నిర్వహించుట

వందేమాతర ఉద్యమం (1905-11):
అతివాద నాయకులు భారతదేశంలో మొదటిగా చేపట్టిన ప్రధాన ఉద్యమం వందేమాతర ఉద్యమం
1905లో బెంగాల్‌ విభజన కారణంగా “వందేమాతర ఉద్యమం” ప్రారంభం అయింది.
బెంగాల్‌లోని జాతీయ ఉద్యమ భావాలను అణచివేయుటకు అప్పటి గవర్నర్‌ జనరల్‌ “లార్డ్‌ కర్జన్‌” బెంగాల్‌ను రెండుగా విభజించాలని నిర్ణయించాడు.
బెంగాల్‌ భౌగోళికంగా అతిపెద్ద ప్రాంతము, పరిపాలనా సౌలభ్యం కొరకు దీనిని రెండు భాగాలు విభజిస్తున్నట్లు లార్డ్‌ కర్జన్ 1905 జులై 19న అధికారిక ప్రకటన చేశాడు. తక్షణమే ఈ ప్రతిపాదనను ఖండిస్తూ. ఎ.యన్‌. బెనర్జీ, కె. కె మిత్రాలు బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమాలను చేపట్టారు.
contribution of K.K. Mitra in the freedom movement of India in telugu,K.K. Mitra Indian social reformer,K.K. Mitra  Indian National Congress,How The Mahatma Was Influenced by K.K. Mitra in telugu,What is the contribution of K.K. Mitra towards India's freedom struggle in telugu,What was the role of K.K. Mitra in the Indian Independence Struggle in telugu,The legacy of K.K. Mitra,Mahatma Gandhi s Political Mentor K.K. Mitra,K.K. Mitra was the pioneer of Indian National movement,కె.కె మిత్ర యొక్క 'సంజీవని” పత్రికలో మొట్టమొదటగా “బాయ్‌కాట్‌ లేదా బహిష్కరణ” అనే పదం పేర్కొనబడింది.
1905 సెప్టెంబర్‌లో మద్రాస్‌ బీచ్‌లో "సుబ్రమణ్యం అయ్యర్ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో
1. సుబ్రమణ్య భారతి తమిళ పద్యాలు ఆలపించాడు.
2. కేళా శ్రీరామ్మూర్తి వందేమాతర గీతం ఆలపించాడు.
3. సి.హెచ్‌ సుబ్బారావు నేతృత్వంలో ఉద్యమ వ్యాప్తికి జాతీయ నిధి ఏర్పాటుచేయబడింది.
1905 అక్టోబర్‌ 16న బెంగాల్‌ విభజన అమలులోకి వచ్చింది.
దీని ప్రకారం బెంగాల్‌ రెండు భాగాలుగా(పశ్చిమ బెంగాల్‌, తూర్పు బెంగాల్‌గా విభజించబడినది. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిములు మైనార్టీలు కాగా, తూర్పు బెంగాల్‌లో హిందువులు మైనార్టీలు అయ్యారు.
ఈ అక్టోబర్‌ 16వ తేదీను బెంగాల్‌లోని ప్రజలు “బ్లాక్‌ డే లేదా మౌర్నింగ్  డే(నిరసన దినం)గా పాటించారు.
అక్టోబర్‌ 16వ తేదీన ప్రజలు పాదరక్షలు లేకుండా వీధులలోకి వచ్చి స్థానిక జలాశయాలలో పవిత్ర స్నానాలు చేసి సోదర భావత్వాన్ని పెంపొందించుటకొరకు రాఖీ ఉత్సవాలు జరుపుకొన్నారు.
ఇక నుండి విదేశీ వస్తువుల ఉపయోగాన్ని బహిష్కరించి కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని బెంగాల్‌లోని ప్రజలు అదే రోజున (అక్టోబర్‌ 16)న ప్రతిజ్ఞ చేశారు.
దీనితో 'స్వదేశీ ఉద్యమం” ప్రారంభం అయింది.
ఉద్యమ కారులు వందేమాతర గీతాన్ని ఆలపిస్తూ బెంగాల్‌
విభజన వ్యతిరేక ఉద్యమాలను చేపట్టారు. దీనితో ఈ ఉద్యమానికి వందేమాత ఉద్యమం అని పేరు వచ్చింది. మొదట్లో వందేమాతర ఉద్యమం మితవాదుల ఆధీనంలో ఉండేది.
1906లో వందేమాతర ఉద్యమం అతివాదుల చేతులలోకి వచ్చింది.
వందేమాతర ఉద్యమాన్ని భారతదేశం అంతా వ్యాప్తి చేసి దీనిని ఒక జాతీయ ఉద్యమంగా మార్చాలని అతివాదులు నిర్ణయించారు.
1906 డిసెంబర్‌లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన ఐ.యన్‌.సి వార్షిక సమావేశం కలకత్తాలో జరిగింది. ఈ సమావేశంలో స్వరాజ్యం, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అనే నాలుగు తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
ఈ సమావేశానికి హాజరైన నాయకులు తమ ప్రాంతాలకు వెళ్లిన తరువాత వందేమాతర ఉద్యమాన్ని తమ ప్రాంతాలలో వ్యాప్తి చేయాలని అతివాదులు పిలుపు ఇచ్చారు.
దీంతో వందేమాతర ఉద్యమం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యాపించింది.
contribution of Bipin Chandra Pal in the freedom movement of India in telugu,Bipin Chandra Pal Indian social reformer,Bipin Chandra Pal  Indian National Congress,How The Mahatma Was Influenced by Bipin Chandra Pal in telugu,What is the contribution of Bipin Chandra Pal towards India's freedom struggle in telugu,What was the role of Bipin Chandra Pal in the Indian Independence Struggle in telugu,The legacy of Bipin Chandra Pal,Mahatma Gandhi s Political Mentor Bipin Chandra Pal,Bipin Chandra Pal was the pioneer of Indian National movement,Freedom fighter Bipin Chandra Palబిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో వందేమాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు. రాజమండ్రి లో బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగులోకి అనువాదించాడు.
వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రలో సంఘటనలు
1. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల సంఘటన
2. కాకినాడ సంఘటన
తి. కోటప్పకొండ సంఘటన
4. తెనాలి బాంబు కేసు