పుష్యభూతి వంశం- Pushyabhuti Dynasty

TSStudies
Pushyabhuti Dynasty in Telugu

పుష్యభూతి వంశం: 

హర్షవర్ధనుడు(క్రీ.శ. 606-647)
Pushyabhuti Dynasty,history of Pushyabhuti Dynasty in telugu,Pushyabhuti Dynasty history in telugu,Pushyabhuti Dynasty notes in telugu,Pushyabhuti Dynasty study material in telugu,indian history Pushyabhuti Dynasty in telugu,Pushyabhuti Dynasty indian history,ancient history Pushyabhuti Dynasty in telugu,Pushyabhuti Dynasty ancient history in telugu,ts studies,tsstudies,ts study circle,tspsc group 2 study material in telugu,tspsc study material in telugu,tspsc groups exam notes in telugu,history of harsha vardanudu pushyabhuti dynasty in telugu,emperor harshavardhan history in telugu
హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు.
ఇతని తండ్రి ప్రభాకర వర్ధనుడు, సోదరుడు రాజ్యవర్థనుడు, సోదరి రాజశ్రీ.
ప్రభాకర వర్ధనుడి మరణానంతరం రాజ్యవర్ధనుడు ధానేశ్వర్‌కు పాలకుడైనాడు. సోదరి రాజశ్రీని కనోజ్‌రాజు గృహవర్మన్‌కు ఇచ్చి వివాహం చేశారు.
దేవగుప్తుడు గౌడ శశాంకుని సహాయంతో కనోజ్‌పై దాడి చేసి గృహవర్మన్‌‌ను హతమార్చాడు. రాజశ్రీ మధ్య భారతదేశ అడవులకు పారిపోయింది.
రాజశ్రీని మధ్య భారతదేశ అడవుల్లో బౌద్ధ సన్యాసి దివాకర మిత్రుని ఆశ్రయం పొందింది.
ఈ విషయం తెలుసుకున్న రాజ్యవర్థనుడు ధానేశ్వర్‌ నుండి బయలుదేరి కనోజ్‌పై దాడిచేసి దేవగుప్తడుని తరిమివేశాడు.
తిరుగు ప్రయాణం చేస్తున్న రాజ్యవర్థనుడిపై గౌడ శశాంకుడు హఠాత్తుగా దాడిచేసి అతనిని హతమార్చాడు.
క్రీ.శ. 606లో 16 సం॥ల వయసులో హర్షవర్ధనుడు ధానేశ్వర్‌కు రాజు అయ్యాడు. (బాని లేదా బందీ అనే ప్రధాని సలహా మేరకు పాలకుడయ్యాడు)
హర్షవర్దనుడు మొదటగా తన సోదరి రాజశ్రీను మధ్య భారతదేశ అడవుల నుండి కాపాడాడు.
హర్షవర్ధనుని బిరుదులు - 
1) 3వ అశోకుడు
2) శిలాదిత్య
3) ఉత్తరాపధస్వామి
ఇతను ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి అనే పుస్తకాలను రచించాడు.
ఇతని ఆస్థాన కవి మరియు చరిత్రకారుడైన బాణభట్టుడు హర్షచరిత్రం, కాదాంబరి, పార్వతీ పరిణయం అనే పుస్తకాలను రచించాడు.
క్రీశ. 629లో చైనా యాత్రికుడు 'హ్యూయాన్‌త్సాంగ్‌' హర్షవర్ధనుని ఆస్థానాన్ని సందర్శించాడు. ఇతను సి-యు-కి అనే పుస్తకాన్ని రచించాడు.
60 రోజుల్లో కోతకొచ్చే వరి పంట, పరియాత్ర(బైరట్ లో సాగు చేయబడినట్లుగా హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడు. మగధ ప్రాంతంలో సువాసననిచ్చే బియ్యాన్ని పండించారు. వరి, గోధమ, చెరకు పండించినట్లు భానుడు తెలిపాడు.
మయూర -'అష్టక' మరియు 'సూర్య శతకము'ను రచించారు.
హర్షుడు బౌద్ధ మతాన్ని పోషించాడు. ప్రతీ 5 సం॥లకు ఒకసారి హర్షుడు 'మహామోక్ష పరిషత్‌'లను ప్రయాగలో జరిపించేవాడు(మొత్తం 6సార్లు నిర్వహించాడు). తాను 5 సం॥లలో సంపాదించిన సొమ్మును ఈ మహామోక్ష పరిషత్‌లో పేదలకు పంచేవాడు.
సర్వమత సమ్మేళనమును కనోజ్‌ వద్ద నిర్వహించాడు. ఈ సభకు హ్యాయంగ్‌త్సాంగ్‌ అధ్యక్షత వహించాడు.
ఈ సభలోనే బుద్ధుని యొక్క బంగారు విగ్రహం రూపొందించబడింది.
బౌద్ధ మతాన్ని విదేశాలలో వ్యాప్తి చేయుటకు కూడా నిర్ణయం తీసుకొనబడింది.
హర్షుడు బుద్దుడి పళ్లను (Teeth)  కాళ్మీర్‌ నుండి తీసుకొచ్చాడు.
హర్షుడు సిర్పూర్‌లో లక్ష్మణుడి దేవాలయమును ఇటుకలతో నిర్మించాడు.
హర్షుడు ఈ క్రింది శాసనాలను వేయించాడు
1) సోంపట్‌
2) మధుబని
3) బన్సాకారి 
గౌడ శశాంకుడు మరణించిన తర్వాత హర్షుడు తన రాజధానిని ధానేశ్వర్‌ నుంచి కనోజ్‌కు క్రీ.శ. 621లో మార్చాడు.
నలంద విశ్వవిద్యాలయమును ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ విశ్వవిద్యాలయంగా మార్చాడు.
హ్యుయాంగ్‌త్సాంగ్‌ తన పుస్తకం సి-యు-కి లో నలంద విశ్వవిద్యాలయం గురించి వివరించాడు.
హర్షుడు నలంధ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కొరకై మొట్టమొదటిసారిగా పోటీ పరీక్షలను ప్రవేశపెట్టాడు.
హర్షుని తర్వాత కనోజ్‌ పాలకుడు -అర్జునుడు. ఇతని కాలంలో వాంగ్‌త్సి కనౌజ్‌ను సందర్శిరిచాడు.
వాంగ్‌త్సిను అర్జునుడు అవమానించాడు. దీంతో వాంగ్‌లత్సి అర్జునుడిని ఓడించి తనతోపాటు చైనాకు తీసుకుపోయాడు.
కనోజ్‌ను పాలించిన చివరి గొప్ప పాలకుడు -యశోవర్మన్‌
యశోవర్మన్‌ కాలంలోని భవభూతి ఈ క్రింది పుస్తకాలను రచించాడు.
1) ఉత్తర రామ చరిత
2) మాలతీ మాధవన్‌
3) మహావీర చరిత
ఇతని ఆస్థానంలోనే వకపతిరాజు 'గౌడవాహో' అనే పుస్తకాన్ని రచించాడు. (గౌడవాహో-గౌడ శశాంకుని మరణం).
గౌడశశాంకుడు బోధి వృక్షమును నరికివేశాడు.