Satavahana Dynasty Bit Bank 6

TSStudies
0
1. రుద్రదాముని కుమార్తె ను వివాహం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు 
వాశిస్థిపుత్రశతకర్ణి 

2. జునాఘడ్ శాసనాన్ని వేయించింది 
రుద్రదాముడు (సంస్కృతంలో ఇది మొదటి శాసనం)

3. ద్వి భాషలతో కూడిన నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు ఎవరు 
వాశిస్థిపుత్రశతకర్ణి  (ప్రాకృతం మరియు తమిళం)

4. వాశిస్థిపుత్రశతకర్ణి యొక్క బిరుదు 
క్షత్రప 

5. శాతవాహనులలో చివరి గొప్పవాడు 
యజ్ఞశ్రీ శాతకర్ణి (అనేక యజ్ఞాలు చేయడం వల్లన అతనికి ఈ పేరు వచ్చింది)

6. యజ్ఞశ్రీ శాతకర్ణి ఏ చిహ్నాలతో నాణెములను ముద్రించాడు 
ఓడ తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నం 

7. శాతవాహన రాజులలో ఎవరి కాలంలో రోమ్ తో వర్తకం అధికంగా జరిగేది 
యజ్ఞశ్రీ శాతకర్ణి 

8. మత్స్య పురాణం సంకలనం ఎవరి కాలంలో ఆరంభమైంది 
యజ్ఞశ్రీ శాతకర్ణి 

9. ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలంలో ఉండేవాడు 
యజ్ఞశ్రీ శాతకర్ణి 

10. మహావిహారం లేదా పారావత విహారం ను యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరికోసం నిర్మించాడు 
ఆచార్య నాగార్జునుడు 

11. యజ్ఞశ్రీ శాతకర్ణి ని త్రిసముద్రాధిపతి అని ఎవరు పేర్కొన్నారు 
బాణభట్టుడు (హర్ష వర్ధనుని చరిత్రకారుడు)

12. విజయశ్రీ శాతకర్ణి ఎన్నవ రాజు 
28వ రాజు 

13. విజయపురి పట్టణంను నిర్మించినది ఎవరు 
విజయశ్రీ శాతకర్ణి 

14. విజయశ్రీ శాతకర్ణి తరువాత ఎవరు పరిపాలించారు 
చంద్రసేనుడు / చంద్రశ్రీ 

15. శాతవాహనుల చివరి రాజు 
3వ పులోమావి (30వ రాజు)

16.. 3వ పులోమావి పై ఎవరు తిరుగుబాటు చేసారు 
శాంతమూలుడు (సేనాధిపతి) (దీనితో పులోమావి బళ్లారికి పారిపోయాడు)

17. బళ్లారిలో మ్యాకదోని శాసనాన్ని వేయించింది ఎవరు 
3వ పులోమావి 

18. కార్లే, ధరణికోట శాసనాలు వేయించింది ఎవరు 
2వ పులోమావి 

19. చినగంజాం శాసనం వేయించింది ఎవరు 
యజ్ఞశ్రీ శాతకర్ణి 

20. నాగార్జున కొండ శాసనం వేయించింది ఎవరు 
విజయశ్రీ శాతకర్ణి 

Tags: tspsc study material in telugu, telangana history study material in telugu, telangana history MCQ, appsc study material in telugu, appsc notes in telugu, tspsc notes in telugu, history notes pdf, telangana history practice questions with answers in telugu, satavahana dyansty notes in telugu, telangana history satavahana kings linst


Post a Comment

0Comments

Post a Comment (0)