రైతు సంక్షేమం

TSStudies
0
రైతు సంక్షేమం
మా భూమి మా పంట యాప్ ఆవిష్కరణ: 
22 మే 2017 న హైదరాబాద్ లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు 
రైతులకు భూమి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు పంట వివరాలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు తోడ్పడుతుంది

పట్టు రైతు మద్దతు పథకం: 
కొమరం భీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి, భద్రాది కొత్తగూడం జిల్లాలకు చెందిన గిరిజనులు టస్సార్ పట్టుగూళ్లను  ఉత్పత్తి చేస్తున్నారు 
టస్సార్పపట్టుగూళ్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది 
పట్టును అధికంగా ఉత్పత్తిచేసే రైతుకు ప్రభుత్వం ఇచ్చే అవార్డు పట్టు రైతు అవార్డు 
అంతర్జాతీయ స్థాయి బైవోల్టిన్ పట్టును ఉత్పత్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం బెంగళూరు లోని సెంట్రల్ సిల్క్ బోర్డు తో కలిసి కేటలైటిక్  డెవలప్ మెంట్  ప్రోగ్రాంను అమలు చేస్తుంది 
పట్టు దారం మద్దతు పథకం ద్వారా కుటుంబానికి ప్రతి నెల నాలుగు కిలోల పట్టుదారం కొనుగోలుపై Rs.600  ప్రోత్సాహకం అందించడం జరుగుతుంది

రైతుబంధు: 
ప్రారంభం: 2014 జూలై 19 
ఉద్దేశం: రైతులకు పంట రుణాలను అందించడం 
ప్రత్యేకత: గరిష్టంగా రెండు లక్షల వరకు అందించడం

పంటల బీమా: 
ప్రారంభం: 2014 జూలై 21 
ఉద్దేశం భీమా కల్పించడం ద్వారా విపత్తు వలన నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించడం

మన ఊరు-మన కూరగాయలు పథకం: 
ప్రారంభం: ఆగస్టు 6, 2014 
ఉద్దేశం: 
1) హైదరాబాద్ పట్టణ కూరగాయల అవసరం తీర్చడం 
2) కూరగాయల ధరల స్థిరీకరణ 
3) రైతులకు, కొనుగోలుదారులకు మధ్యవర్తుల తొలగింపు 
4) రైతులకు భరోసా ఇచ్చి ఆత్మహత్యలను నివారించటం 
కార్యాచరణ ప్రణాళిక: ఎంపిక చేసిన జిల్లాలు- రంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి 
ప్రభుత్వం 35 గ్రామాలను 1900 రైతులను ఎంపిక చేసింది 
ప్రతి క్లస్టర్, ప్రతిరోజూ 3 టన్నుల కూరగాయలను పట్టణానికి పంపిణీ చేయాలి

సద్దిమూట (సద్దిబువ్వ):
గతంలో దీనిపేరు సుభోజనం 
ప్రారంభం: 2014 అక్టోబర్ 13 
వేదిక: సిద్దిపేట మార్కెట్ యార్డు 
ప్రత్యేకత మార్కెట్ యార్డులో రైతులకు 5 రూపాయలకే భోజనం అందించడం

సుఖీభవ (2015 అక్టోబర్):

రైతుల ఆత్మహత్యలను ఆపి నివారణ చర్యలను పాటించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం 
ఇది ప్రతి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటయింది 
దీనిలో భాగంగా రైతులకు అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు, వడ్డీ వ్యాపారుల నుండి సమస్యలు లేకుండా చూస్తారు 
నోట్:104 టోల్ఫ్ ఫ్రీ నంబర్ ను రైతుల కోసం ఏర్పాటు చేయడమైనది

రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణి: 
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఎరువుల కొనుగోలుపై ప్రతి ఎకరాకు Rs.4 వేల చొప్పున ఖరీఫ్ (వర్షాకాలం), రబీ (యాసంగి) రెండు పంటలకు కలిపి Rs. 8 వేల రూపాయలు అందజేయనున్నట్లు ఏప్రిల్ 13, 2017 న రైతులకు జరిగిన జనహిత కార్యక్రమం లో సీఎం కేసీఆర్ ప్రకటించారు

రుణమాఫీ పథకం:
2014 మార్చి 31 వరకు ఉన్న లక్షలోపు వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు 
చివరి విడతగా Rs.4 వేల కోట్లను విడుదల చేసింది 
దీంతో మొత్తంగా రైతులకు Rs.16,124 కోట్ల రుణమాఫీ పూర్తయింది 
ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 35.29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది

సాదాబైనామా: 
రాష్ట్రంలో భూవివాదాలను సత్వరం పరిష్కరించాలని భూ రికార్డులను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది 
గతంలో రైతులు, ఇతర వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్న భూముల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఉద్దేశించినది సాదాబైనామా 
ఇందులో భాగంగా 2016 జూన్ 3-22 వరకు సాధాబైనామాలను గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు 11.19 లక్షల మంది లబ్ధి పొందారు 
జూన్ 30, 2016 నాటికి 6.18 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేశారు. 2.99 లక్షల దరఖాస్తులు తిరస్కరించడం జరిగింది

రైతు సమన్వయ సమితిలు: 
రైతులను సంఘటిత పరిచే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది 
సాగుభూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులను సంఘంలో సభ్యులుగా చేరుస్తారు. 15 మందితో గ్రామ, 24 మందితో మండల, జిల్లా సమితులను నియమించనున్నారు. అన్ని జిల్లాల నుంచి 42 మందితో రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తారు 
ప్రభుత్వం వచ్చే వానాకాలం నుంచి రైతులకు పెట్టుబడి కోసం Rs.8,000 ఇవ్వనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు 
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వివరాలు: గ్రామాలు 10,733 రైతులు 45,10,990  విస్తీర్ణం 1,24,06,476 ఒక్కో గ్రామానికి సగటు రైతులు 420 మంది, ఒక గ్రామానికి సగటు విస్తీర్ణం 1156 ఎకరాలు 
రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డిని సీఎం నియమించారు 
ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి దానిలో 15 మంది సభ్యులను నియమించారు. ఇదే విధంగా మండల, జిల్లాల రైతు సమన్వయ సమితిలో 24 మంది సభ్యులు, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు 
ప్రతి సమితిలో మూడోవంతు మహిళలు ఉంటారు 
గ్రామ సమన్వయ సమితిలో 5గురు,, జిల్లా మండల రైతు సమన్వయ సమితిలో 8మంది, రాష్ట్ర సమన్వయ సమితిలో 14మంది చొప్పున మహిళలు ఉంటారు.  
రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నామినేట్ చేసే రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో Rs.500 రివాల్వింగ్ ఫండ్ను ఏర్పాటు చేశారు 
రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, పండించిన పంట ఉత్పత్తులకు గ్రామాలు, మండలాల్లో వ్యాపారులతో బేరం ఆడేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్  ఉపయోగపడుతుంది  
రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. దీని ప్రకారం మొత్తం గ్రామ రైతు సమన్వయ సభ్యుల సంఖ్య 1,61,000 అందులో మహిళా సభ్యులు 52,170

Post a Comment

0Comments

Post a Comment (0)