మైనారిటీ సంక్షేమం telangna minority welfare schemes

TSStudies
0
మైనారిటీ సంక్షేమం 
ఓన్ యువర్ ఆటో 
హైదరాబాద్ నగరంలో ప్రారంభించారు. 
ఈ స్కీమ్ ద్వారా 1,773 మంది మైనారిటీ యువకులకు 50% సబ్సిడీపై ఆటోలు కేటాయించారు. ఇప్పటివరకు 1,443 మంది లబ్ధి పొందారు. 

షాదీ ముబారక్ పథకం
ప్రారంభించిన తేదీ: 2 అక్టోబర్ 2014
నోట్: సెప్టెంబర్ 25, 2014 న ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ జారీ చేసింది
ముఖ్యంశాలు
మైనార్టీ వర్గాల పేద ముస్లిం కుటుంబాలలోని యువతుల వివాహానికి ఆర్థిక సహాయం కింద Rs.1,00,116 (ఏప్రిల్ 1, 2018 నుండి) అందిస్తున్నారు.
18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 2 లక్షలకు మించి ఉండరాదు
హెల్ప్ లైన్ నెంబర్: 040-24760452 (10 నవంబర్ 2014 నుండి)
2018-19 బడ్జెట్లో ఈ పథకానికి రూ. 1450 కోట్లు కేటాయించారు (కళ్యాణలక్ష్మీ తో కలుపుకొని)

ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం
మైనారిటీ ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ లో మే 19, 2015 ప్రారంభించింది.
ఒక్కొక్కరికి రూ. 20 లక్షల స్కాలర్ షిప్ తో పాటు విమాన ఖర్చులు కూడా అందిస్తున్నారు
ఇతర కార్యక్రమాలు 
206 మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించింది. ఇందులో 100 గురుకులాలు మైనారిటీ బాలికల కోసం ప్రారంభించింది
మైనారిటీ వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు సుధీర్ కమిషన్ ను నియమించింది
తెలంగాణలోని 5 వేల మసీదులో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.1500 చొప్పున భృత్తిని అందిస్తుంది (8,934మంది ఇమామ్, మౌజమ్ లకు ప్రయోజనం చేకూరుతుంది) 
మైనారిటీలకు 12% రిజర్వేషన్లు అందించే బిల్లును ఏప్రిల్ 16, 2017న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది

సబ్సిడీ-కమ్-బ్యాంక్ లోన్ స్కీమ్
రాష్ట్రంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం Rs. 2 లక్షలు  ఇస్తున్న లోను ను Rs.10 లక్షలకు పెంచడం జరిగింది. సబ్సిడీ 50% నుంచి 80% కు పెంచారు. 
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఇస్లామిక్ సెంటర్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో పది ఎకరాల స్థలాన్ని కేటాయించడమైనది 
ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయం ఇస్తున్న అనీస్ ఉల్ గూర్భకు 4300 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. భవన నిర్మాణానికి Rs. 20 కోట్లు కేటాయించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)