Evolution of Indian Constitution-8

TSStudies
సైమన్‌ కమీషన్‌ - నవంబర్‌ 1927
simon commission notes,simon commission upsc,simon commission ralley,simon commission facts in telugu,why simon commission
భారత ప్రభుత్వచట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి రెండు సంవత్సరాలు ముందుగానే, ఆనాటి బ్రిటీష్‌ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్‌ 1927 నవంబర్‌లో సర్‌ జాన్‌ సైమన్‌ నాయకత్వంలో 6 గురు సభ్యులతో కూడిన ఒక రాయల్ కమీషన్ ను నియమించింది.
ఇందులో ఒకానొక సభ్యుడైన క్లిమెంట్‌ ఆట్లి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఇంగ్లాండ్‌ ప్రధానిగా ఉన్నారు.
ఈ సంఘంలో సభ్యులందరూ ఆంగ్లేయులు కావడం వల్ల భారతీయులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కమీషన్‌ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
మొదటగా 1928 ఫిబ్రవరి 3 నుండి మార్చి 31 వరకు, రెండవ పర్యాయం 1928 అక్టోబర్‌ 11 నుండి 1929 ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పర్యటించింది. ఈ కమీషన్‌ తన నివేదికను 1930లో సమర్పించింది.
ముఖ్యాంశాలు
రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయడం, మంత్రులు శాసన సభకు బాధ్యత వహించేలా చేయడం.
భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించడం
రాష్ట్ర శాసన మండళ్లలో సభ్యత్వ సంఖ్యను పెంచడం
ఏక కేంద్రవ్యవస్థ భారతదేశానికి సరిపడదు కనుక సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేస్తుకోవడం
హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పాటు చేయడం
సార్వజనీన ఓటు హక్కు వెంటనే సాధ్యం కాదు కనుక దీనిని కాలానుగుణంగా విస్తృతం చేయడం
మొదటిసారిగా సమాఖ్యను సూచించినది సైమన్‌ కమీషన్‌  సైమన్‌ కమీషన్‌ అనేది భారత సమస్యలపైన ఒక సమగ్ర అధ్యయనం అని కుప్లాండ్  అనే రచయిత పేర్కొన్నారు. బ్రిటన్‌లోని లేబర్‌ పార్టీ ఈ నివేదికలోని అంశాలపైన తీవ్రమైన దృష్టిపెట్టలేదు. ఆ తరువాత వచ్చిన భారత ప్రభుత్వ చట్టం, 1935లో సైమన్‌ కమీషన్‌ ప్రతిపాదించిన అంశాలను పొందుపరిచారు.