Nature and Salient features of Indian Constitution-3

TSStudies
0
The first meeting of the Constituent Assembly held on 9 december 1946

రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం (The first meeting of the Constituent Assembly)

రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం 1946 డిసెంబర్‌ 9వ  తేదీన ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరిగింది. మొట్టమొదటి సమావేశానికి 211 (9 మంది మహిళా సభ్యులతో సహా) మంది హాజరయ్యారు. ఈ సమావేశం డిసెంబర్‌ 12 వరకు కొనసాగింది.

The First meeting of Constituent Assembly Was Held on 9 December 1946,Committees of forming the Indian Constitution in telugu, Indian constitution in telugu, Salient features of indian constitution,indian constitution committees,indian constitution sub committees in telugu

డిసెంబర్‌ 9 న రాజ్యాంగ పరిషత్తులో సీనియర్‌ సభ్యుడైన డా. సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా (ఫ్రెంచి సంప్రదాయం ప్రకారం ఫ్రాన్స్‌లో ఈ పద్ధతి అమలులో ఉంది.), ఫ్రాంక్‌ ఆంథోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

డిసెంబర్‌ 12న డా. ఆర్‌. రాజేంద్ర ప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా జె.బి. కృపలాని ప్రతిపాదించగా . ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే హెచ్‌.సి. ముఖర్జీ ఉపాధ్యక్షులుగా పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించగా, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత వి.టీ. కృష్ణమాచారిని కూడా రాజ్యాంగ పరిషత్తు ఉపాధ్యక్షులుగా నియమించారు.

అంతర్జాతీయ న్యాయవాది బెనగల్‌ నరసింగరావును రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారుగా నియమించారు. ఇతడు బర్మా (ప్రస్తుత మయన్మార్) రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు.

ఆశయాల తీర్మానం

1946 డిసెంబర్‌ 13వ తేదీన జవహర్‌లాల్‌ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని (Objectives Resolution) ప్రతిపాదించాడు. ఈ ఆశయాల తీర్మానమే రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలం. ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారం. ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 22వ తేదీన ఏకగ్రీవంగా ఆమోదించింది.

రాజ్యాంగ పరిషత్తు కమిటీలు

రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, వీటికి అనుబంధంగా 7 ఉప కమిటీలు, 15 మైనర్‌ కమిటీలను కూడా నియమించటం జరిగింది.

ఈ కమిటీలలో అత్యంత ముఖ్యమైన కమిటీ - డ్రాఫ్టింగ్‌ (ముసాయిదా) కమిటీ. 1947 ఆగస్టు 29వ తేదీన డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షతన 6గురి సభ్యులతో ముసాయిదా కమీటీని నియమించారు.

 కమిటీ పేరు  చైర్మన్‌
 ముసాయిదా కమిటీ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌
 సలహా కమిటీ * హక్కుల కమిటీ, రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌
 సారథ్య కమిటీ * జాతీయ పతాక తాత్మాలిక కమిటీ, ఫైనాన్స్‌ & స్టాఫ్‌ కమిటి * రూల్స్‌ కమిటీ రాజేంద్ర ప్రసాద్‌
 కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ * రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ జవహర్‌లాల్‌ నెహ్రూ
 సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ వరదాచార్య
 హౌస్‌ కమిటీ, చీఫ్‌ కమిషనర్స్‌ ప్రొవిన్స్‌ల కమిటీ భోగరాజు   పట్టాభి సీతారామయ్య
 రాజ్యాంగ పరిషత్తు విధుల కమిటీ జి.వి. మావలంకర్‌
 సభా వ్యవహారాల కమిటీ కె. యం. మున్షి 
 రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ, ప్రుడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
 భాషా కమిటీ మోటూరి సత్యనారాయణ

సబ్‌ కమిటీలు
 కమిటీ పేరు చైర్మన్‌
 ప్రాథమిక హక్కుల ఉపకమిటీ జె.బి. కృపలాని
 మైనారిటీల సబ్‌కమిటీ హెచ్‌.సి. ముఖర్జీ
 ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ గోపినాథ్‌ బోర్డోలాయ్‌
 ప్రత్యేక ప్రాంతాల కమిటీ ఎ.వి. టక్కర్‌

Post a Comment

0Comments

Post a Comment (0)