Indian Constitution Practice Bits-38

TSStudies
0
Welfare Mechanism for Enforcement of Indian Constitution Previous Exams Bits in Telugu

గత ప్రశ్నలు: 1990 నుంచి వివిధ పరీక్షల్లో ముఖ్యంగా (సివిల్స్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, జె.ఎల్‌., డి.ఎల్‌., నెట్స్‌ సెట్‌ మొ.) వచ్చిన ప్రశ్నలు

1. ఈ క్రింది రాష్ట్రాలలో షెడ్యూల్డ్‌ కులాల జనాభా శాతం గరిష్టంగా ఉంది

ఎ) పంజాబ్‌ 

బి) బీహార్‌

సి) తమిళనాడు 

డి) కేరళ


2. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల రిజర్వేషన్లు ఏ సం.వరకు పెంచబడినాయి.

ఎ) 1999 

బి) 2010 

సి) 2020 

డి) 2005


3. సమాచార హక్కు చట్టం ఏ నంవత్సరంలోరూపొందించారు.

ఎ) 2000 

బి) 2001 

సి) 2002 

డి) 2005


4. 16(4-A) అధికరణ దేని కొరకు

ఎ) వికలాంగులకు రిజర్వేషన్‌

బి) స్త్రీల రిజర్వేషన్‌

సి) ఎస్‌.సి/ఎస్‌.టి రిజర్వేషన్‌

డి) ప్రమోషన్‌ రిజర్వేషన్‌


5. 'బెగర్‌' అంటే

ఎ) ఏమి ఆశించకుండా పని చేయడం

బి) ఏమి ఆశించకుండా బలవంతంగా చేయించడం

సి) కొంత మొత్తానికి బలవంతంగా చేయడం

డి) చట్ట మూలంగా చేయించడం


6. ఆదేశిక సూత్రాలు

ఎ) ప్రశ్నించవచ్చు

బి) ప్రశ్నించరాదు

సి) కోర్టు తీర్పుకు వదిలివేయాలి

డి) పరిపాలించే వారు నిర్ణయం చేయాలి


7. రాజ్యాంగంలోని 275 అధికరణ షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధికి సంబంధించి ఏమి కోరవచ్చు

ఎ) గ్రాంట్లు అందించడం

బి) ఆస్తి హక్కు

సి) భూమి లేని వారికి భూ పంపకం

డి) ఉద్యోగ కల్పన


8. ఎస్‌.సి./ఎస్‌.టి (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌) చట్టం పీఠిక - చెప్పే విషయం

ఎ) బాధితులు - పునరావాసం

బి) బాధితులను గుర్తించడం

సి) బాధితుల నుంది సాక్ష్యం చెప్పడం

డి) బాధితులు - ఆర్థిక సాయం


9. ఎస్‌.సి./ఎస్‌.టి చట్టంలో విచారించే అధికారి

ఎ) పోలీసు ఇన్‌స్పెక్టర్‌ 

బి) డి.ఎస్‌.పి

సి) డి.ఐ.జి 

డి) డి.సి.పి


10. షెడ్యూల్డు కులాలకు మరో పేరు

ఎ) ఇండిజినస్‌ క్లాస్‌

బి) ఆదివాసులు

సి) మైనారిటీలు

డి) దళితులు


11. ఉమ్మడి సివిల్‌ కోడ్ కు సంబంధించి ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు

ఎ) సరళ ముద్గల్ కేసు 

బి) మేనకా గాంధీ కేసు

సి) రాజ్‌నారాయణ్‌ కేసు

డి) బొమ్మయ్‌ కేసు


12. ఎస్‌.సి./ఎస్‌.టి చట్టంలో ........ అట్రాసిటీ కింద వస్తుంది

ఎ) వాళ్ళ యింటి ముందు / పరిసరాల్లో చెత్త వేయడం

బి) వాళ్ళను స్కూళ్ళలోకి రాకుండా నిరోధించడం

సి) వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్‌

డి) వాళ్లను ఇతర కులస్తులతో వివాహం కాకుండా నిరోధించడం


13. ఎస్‌.సి./ఎస్‌.టిలను ఉరిశిక్షకు గురి చేయడంలో ఇతర కులస్తులు తప్పుడు సాక్ష్యం చెపితే వారికి పడే శిక్ష

ఎ) జీవితకాలం జైలు

బి) 5 సం॥లు

సి) 10-15 సం॥లు

డి) 1సం॥


14. షెడ్యూల్‌ తెగలు నివసించే చోటు

ఎ) పల్లెకు దూరంగా 

బి) నిర్ణయించిన స్థలంలో

సి) గ్రామాలలో 

డి) పట్టణ శివార్లలో


15. జాతీయ మైనారిటీ కమీషన్‌ ఎవరి చర్య వల్ల ఏర్పాటైంది

ఎ) కేంద్ర ప్రభుత్వం

బి) రాష్ట్ర ప్రభుత్వం

సి) పార్లమెంటు

డి) మైనారిటీలు జాతీయ కమిషన్‌


16. 350(ఎ) అధికరణ క్రింద రక్షింపబడే మైనారిటీ హక్కులు

ఎ) భాషాపర 

బి) మతపర

సి) సాంస్కృతి 

డి) పై అన్నియు


17. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ విచారణ తరువాత

ఎ) నష్ట పరిహారం చెల్లించమని ఆదేశించడం

బి) నష్టపరిహారం విషయంలో ప్రభుత్వానికి చెప్పడం

సి) నష్ట పరిహార విషయంలో అధికారం లేకపోవడం

డి) జరిగిన విషయాన్ని తెలియజేయడం


18. ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్సుగా పరిగణింపబడేది

ఎ) సెషన్స్‌ కోర్టు 

బి) కలెక్టరేట్‌

సి) పంచాయితీ 

డి) గ్రామ సభ


19. స్త్రీలను కించపరచకుందా స్వస్తి పలికే ప్రాథమిక బాధ్యతకు సంబంధించిన అధికరణం

ఎ) ప్రకరణ 51 A(c) 

బి) ప్రకరణ 51 A(d)

సి) ప్రకరణ 51 A(e)

డి) ప్రకరణ 51 A(a)


20. రాజ్యాంగంలో ప్రజా సంక్షేమం కొరకు ఉపయోగపడే విభాగం

ఎ) విభాగం I

బి) విభాగం II

సి) విభాగం III

డి) విభాగం IV


21. ఏ విధమైన వృత్తినైనా చేసుకొనే హక్కును పరిరక్షించే అధికరణం

ఎ) అధికరణ 19(1)(e) 

బి) అధికరణ 19(1)(f)

సి) అధికరణ 19(1)(g) 

డి) అధికరణ 19(1)(b)


22. ఉచిత న్యాయ సహాయం కలుగచేసే అధికరణం

ఎ) ప్రకరణ 48A 

బి) ప్రకరణ 19(1)(d)

సి) ప్రకరణ 31A

డి) ప్రకరణ 31B


23. ఆడవాళ్ళను లైంగికంగా హింసించకుండా ఉండటానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిన కేసు

ఎ) మోహిని జైన్‌ 

బి) విశాఖ

సి) మేనకా గాంధీ

డి) బేగా బేగం


24. బాల్యము మరియు యవ్వనము పరిరక్షించు అధికరణం

ఎ) ప్రకరణ 39(a) 

బి) ప్రకరణ 39(d)

సి) ప్రకరణ 39(f)

డి) ప్రకరణ 89(9)


25. కార్మికులను యాజమాన్యంలో భాగస్వాములు చేయుటకు ఉద్దేశించిన అధికరణం

ఎ) ప్రకరణ 41A

బి) ప్రకరణ 43A

సి) ప్రకరణ 39A

డి) ప్రకరణ 51A


26. రాజ్యాంగంలోని అధికరణ 39(సి) ఉద్దేశం 

ఎ) వనరుల పంపిణీ

బి) మహిళా సంక్షేమం

సి) సంపద కొందరి వద్దే కేంద్రీకృతం కాకుండా అడ్డుకోవడం

డి) బాలల సంక్షేమం


 27. రాజ్యాంగంలోని అధికరణ 243డి పంచాయితీలకు కలుగచేసేది

ఎ) జనాభా 

బి) గ్రామ కమిటీ

సి) గ్రామ సభ 

డి) సీట్లు రిజర్వేషన్‌



సమాధానాలు

1.ఎ 2.సి 3.డి 4.డి 5.బి 6.బి 7.ఎ 8.ఎ 9.బి 10.డి 11.ఎ 12.ఎ 13.ఎ 14.ఎ 15.సి 16.ఎ 17.బి 18.ఎ 19.సి 20.డి 21.సి 22.ఎ 23.బి 24.డి 25.బి 26.సి 27.డి 

 

Post a Comment

0Comments

Post a Comment (0)