Ambedkar Views on Small States - చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బి.ఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు

TSStudies
0
చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బి.ఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు


1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకొరకై డిమాండ్ అధికమైనది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు 1953 డిసెంబర్ 22న సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్ర పునర్విభజన కమిషన్ ను నియమించింది.

1985 సెప్టెంబర్ 30న రాష్ట్ర పునర్విభజన కమిషన్ తన నివేదికను కేంద్రానికి సమర్పించి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు అని పేర్కొంది.

దీంతో బి.ఆర్ అంబేద్కర్ ఎస్ ఆర్ సి(SRC) ఫై మరియు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై 1955 డిసెంబర్ లో Thoughts on Linguistic States అనే పుస్తకం రచించి తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు.

బిఆర్ అంబేద్కర్ మొదట్లో పెద్ద రాష్ట్రాల ఏర్పాటుపై ఆసక్తి చూపాడు కానీ తరువాతి కాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను గమనించి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మొగ్గు చూపాడు.

భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ ఆలోచనా విధానాలను ఈ విధంగా చెప్పవచ్చు
1. మిశ్రమ రాష్ట్ర ఆలోచనలను పూర్తిగా విడనాడాలి 
2. ఏక భాష ప్రాతిపదికగా ఒక రాష్ట్రం ఒక భాష గల రాష్ట్రాలు ఉండాలి
3. ఒక భాష - ఒకే రాష్ట్రం (One Language - One State)అనే ఆలోచనకు స్వస్తి చెప్పాలి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగా ఒకే భాష మాట్లాడే ప్రాంతాలను అనేక రాష్ట్రాలుగా విభజించాలి.
4. ఈ క్రింది నాలుగు సూత్రాలను తప్పనిసరిగా ప్రార్థించాలి 
a) సమర్థవంతమైన పాలన యంత్రాంగం 
b) వివిధ ప్రాంతాల అవసరాలు 
c) వివిధ ప్రాంతాల సెంటిమెంట్లు 
d) మెజారిటీ, మైనారిటీ ల మధ్య నిష్పత్తి పరిగణలోకి తీసుకోవాలి.
5. రాష్ట్రాలు చిన్నవిగా ఉండాలి విస్తీర్ణం పెరిగిన కొద్దీ మెజారిటీ, మైనారిటీ ల మధ్య నిష్పత్తి కూడా పెరుగుతుంది.
6. మెజారిటీ వర్గం నిరంకుశత్వం(Autocracy) నుండి మైనారిటీలకు రక్షణ కల్పించాలి. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించి బహుళ సంఖ్యలో నియోజకవర్గాలను(2 or 3) ఏర్పాటు చేయాలి. Cumulative Voting కల్పించాలి.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరమైనప్పటికీ స్వార్థపూరిత ప్రయోజనాలకు, రాజకీయ పార్టీల అభిరుచులు లేదా కొందరి కుటిల రాజకీయాలకు తలొగ్గక ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా రాష్ట్రాల ఏర్పాటు జరగాలి.


ఉన్నత స్థాయి కమిటీ డేబర్ కమిటీ (Debar Committee)

ఢిల్లీలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవంబర్ 8, 9 తేదీల్లో ఫజల్ అలీ ప్రతిపాదనలపై చర్యలు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ వారిని ఒప్పించి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ఆంధ్రా నేతలు కోరుతున్నట్లు ప్రస్తుత అసెంబ్లీ సభ్యులకే నిర్ణయాధికారం ఉండాలని సూచించింది తెలంగాణవాదులకు నచ్చజెప్పి ఒప్పించడానికి  నెహ్రూ, ఆజాద్, దేబర్ లతో కమిటీ ఏర్పాటయింది .

ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించి హైదరాబాద్ కు  రాగానే 15న హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినారు. విశాలాంధ్ర ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణవాదులను ఒప్పించాలని హైకమాండ్ హైదరాబాద్ నాయకులకు చెప్పింది.  కనుక కాంగ్రెస్ కార్యవర్గ నిర్ణయాన్ని అనుసరించాలని బూర్గుల రామకృష్ణారావు అన్నారు. 



Post a Comment

0Comments

Post a Comment (0)