ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు (Andhra State Formation)
భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి 1948లో S K థార్ కమీషన్ ఏర్పాటు చేశారు ఈ కమిటీ తన నివేదికలో పరిపాలన ఆధారంగానే(Based on Administration) రాష్ట్రం ఏర్పాటు చేయాలి కానీ భాష ఆధారంగా ఏర్పాటు చేయాలని సూచించింది.
తరువాత ఏర్పడిన జేవీపీ(J V P) కమిటీ కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్ళు వాయిదా వెయ్యాలని అని తెలిపింది.
కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంశంలో అత్యధిక ప్రజల ఆమోదం ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటును పరిశీలవచ్చునని తెలిపింది..
టంగుటూరి ప్రకాశం మద్రాసు రాజధానిగా రాష్ట్రం ఏర్పాటు కావాలని పట్టుబడటంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరగలేదు.
ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష(Hunger Strike) చేసి చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి 1952 డిసెంబర్ 19న నెహ్రూ పార్లమెంటులో ప్రకటించడం జరిగింది.
ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయాన్ని కె ఎన్ వాంచూ సమర్పించిన నివేదిక ఆధారంగా 1953 మార్చి 25న ప్రధాని ప్రకటించారు.
పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చట్టాన్ని 1953లో ఆమోదించిన తదుపరి సెప్టెంబర్ 14 1953న రాష్ట్రపతి ఆమోదం లభించింది.
కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ప్రధాని నెహ్రూ దీనిని ప్రారంభించారు.