Role of Organisations, Meetings in 1969 Telangana Movement -1969 ఉద్యమంలో వివిధ సంస్థలు సదస్సులు

TSStudies
0
Role of Organisations, Meetings in 1969 Telangana Movement - 1969 ఉద్యమంలో వివిధ సంస్థలు సదస్సులు వాటి పాత్ర 

1. a) తెలంగాణ రక్షణ సమితి 
దీనికి అధ్యక్షుడు - వెంకట్రామిరెడ్డి 
లక్ష్యం - రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తెలంగాణా రక్షణల అమలు పరచాలి

b) తెలంగాణా విద్యార్ధుల కార్యాచరణ సమితి 
దీని ప్రధాన కార్యదర్శి - మల్లికార్జున్ 
లక్ష్యం - ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు 

ప్రత్యేక తెలంగాణ కోరుతున్న విద్యార్థులు మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ నుండి కోటి వరకు ఊరేగింపు నిర్వహించారు. 
తెలంగాణ రక్షణలు కోరుతున్న విద్యార్థులు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి నుండి అబిడ్స్ వరకు ఊరేగింపు నిర్వహించారు. 
ఈ రెండు వర్గాలు అబిడ్స్ చౌరస్తాలో ఎదురు ఎదురు పడి ఒకరినొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రచ్చ కొట్టుకున్నారు దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 
జనవరి 20న శంషాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు జరిపారు ఈ నిరసనలు ఆపడానికి పోలీసులు కాల్పులు జరిపారు కానీ ఎవరూ మరణించలేదు. 
శంషాబాద్ కాల్పులకు నిరసనగా సదాశివపేట దగ్గర విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపు పై పోలీసులు కాల్పులు జరపగా శంకర్ అనే వ్యక్తి మరణించాడు. 
1969 ఉద్యమంలో తొలి అమరుడు(First Martyr) శంకర్. 

తెలంగాణలో కొన్ని ప్రధాన రోజులు 

  • 1968 july 10 తెలంగాణా రక్షణల దినం 
  • 1969 మార్చి 17 పోరాట దినం ఉద్యోగులు ఉపాధ్యాయ కార్యాచరణ సమితి 
  • 1969 మార్చి 17 ప్రజాస్వామ్య రక్షణ దినం 
  • 1969 ఏప్రిల్ 15 తెలంగాణ పోరాట దినం 
  • 1969 ఏప్రిల్ 22 తెలంగాణ వంచన దినం 
  • 1969 మే ఒకటి కోరికల దినం 
  • 1969 మే 17 తెలంగాణ మృత వీరుల దినం 
  • 1969 జూలై 12 తెలంగాణ లిబరేషన్ డే 
  • 1969 జూలై 12 తెలంగాణ 
  • 1969 జూన్ 17 తెలంగాణ మహిళా దినం
2. తెలంగాణ విమోచనోద్యమ సమితి
విమోచనోద్యమ సమితి అధ్యక్షుడు - కాలోజి నారాయణరావు 
జనవరి 28న వరంగల్లులో రెండు తీర్మానాలు చేశారు 
1) ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి 
2) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి 

3. రెడ్డి హాస్టల్ సదస్సు 
మార్చి 8, 9 లలో రెండు రోజులపాటు హైదరాబాదులోని రెడ్డి హాస్టల్ తెలంగాణ సదస్సు నిర్వహించారు 
దీనికి అధ్యక్షత వహించింది శ్రీమతి సదాలక్ష్మి 
సదస్సు తీర్మానాలు: 
1. ప్రత్యేక తెలంగాణ రెండు 
2. ప్రత్యేక తెలంగాణ ఏర్పడే వరకు విద్యార్థులు నిరవధిక సమ్మె చేయాలి 

ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసినది ప్రొఫెసర్ ఆవడ సత్యనారాయణ.
తెలంగాణ మ్యాప్ ను ఈ సదస్సులోనే శాసనసభ్యుడైన టి పురుషోత్తమరావు ఆవిష్కరించారు. 
ఈ సదస్సు లోనే ఆదిరాజు వెంకటేశ్వరరావు ఏప్రిల్ 9 లోగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు. 
మార్చి 17న విద్యార్థులు ప్రజాస్వామ్య రక్షణ దినాన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు పాటించారు. 

4) తెలంగాణ ప్రజాసమితి 
5) ఉస్మానియా ప్రొఫెస్సర్స్ సదస్సు 


Post a Comment

0Comments

Post a Comment (0)