Violations of Safeguards - రక్షణల ఒప్పందం ఉల్లంఘనలు

TSStudies
0
Violations of Safeguards - రక్షణల ఒప్పందం-ఉల్లంఘనలు

పెద్ద మనుషుల ఒప్పందంనకు ఆంధ్ర పాలకులు అనేక తూట్లు పొడిచి ఉల్లంఘించారు(Violated the Safeguards). 

1. తెలంగాణ మిగులు నిధులు(Surplus of Telangana)
తెలంగాణ మిగులు నిధుల పై నియమించిన భార్గవ కమిటీ తెలంగాణ మిగులు నిధులు ఆంధ్రాకు తరలించబడ్డాయి అని పేర్కొన్నది.  
2. ముల్కీ నిబంధనలు (Mulki Rules)
పెద్ద మనుషుల ఒప్పందం కంటే ముందు ఉన్న 17 సంవత్సరాల స్థానికతను స్థానికతను పెద్దమనుషుల ఒప్పందంలో 12 సంవత్సరాలకు కుదించారు కానీ Note on Safe guards లో ఈ 12 సంవత్సరాల స్థానికతను ఐదు సంవత్సరాల తాత్కాలిక సౌకర్యంగా మార్చి వేశారు.
3. తెలంగాణకే ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కానీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ నాయకుడికి ఉపముఖ్యమంత్రి పదవి లేదు. 
4. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Hyderabad Congress Pradesh Committee)
తెలంగాణకు కల్పించిన రక్షణల ప్రకారం హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కొనసాగించాలి. కాని తెలంగాణలో రాజకీయ నాయకత్వం ఎదగకుండా ఆంధ్రా నాయకులు దీన్ని రద్దు చేశారు. 
5. కొత్త రాష్ట్రం పేరు 
ఆంధ్ర-తెలంగాణ గా పెట్టుటకు కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఈ పేరు పెట్టడానికి అందరూ అంగీకరించారు కానీ పార్లమెంటులో రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదించినప్పుడు ఈ పేరును ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. 
6. తెలంగాణేతరులకు ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములను అమ్మటం నిషేధం(Related to Agricultural Lands)
ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో భూముల అమ్మకాలు తెలంగాణ ప్రాంతీయ సంఘం నియంత్రణలో ఉండాలి కానీ తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దు తర్వాత భూములను ఆంధ్ర వారు కొనుగోలు చేశారు. 
7. వ్యవసాయ రంగంలో, నీటిపారుదల రంగంలో చాలా వరకు ఉల్లంఘనలు జరిగాయి.



Post a Comment

0Comments

Post a Comment (0)