5 సూత్రాల పథకం(1972 నవంబర్ 27 )(Five Point Formula)
దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో డిసెంబర్ 31, 1972న ఆమోదించబడినది.
ఆంధ్ర సేన(Andhra Sena)
జై ఆంధ్ర ఫ్రంట్(Jai Andhra Front)
- ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు తహసీల్దార్, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ పదవులతో పాటు సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు మిగతా ఉమ్మడి కార్యాలయాలలో ప్రత్యక్షంగా ఎంపికయ్యే నాన్ గెజిటెడ్ ఉద్యోగాలలో ప్రతి మూడింటిలో ఒక ఉద్యోగానికి వర్తిస్తాయి.
- ముల్కీ నియమాలు జంటనగరాలలో 1977 వరకు మిగతా తెలంగాణ జిల్లాల్లో 1980 సంవత్సరం వరకు అమలులో ఉంటాయి
- ఉభయ ప్రాంతాలలోను గెజిటెడ్ స్థాయి వరకు గల ఉద్యోగాలను లోకలైజ్ చేస్తారు
- జంట నగరాలలోని విద్యాలయాలలో సీట్ల సంఖ్యను పెంచి అదనంగా వచ్చిన సీట్లను ఓపెన్ సీట్లు గా పరిగణిస్తారు. సీట్లకు ఏ ప్రాంతం వారైనా అర్హులే.
- జంట నగరాలలో రెండు ప్రాంతాలకు సంబంధించిన పోలీసు బలగాలు ఉంటాయి. దీనికి సంబంధించి వివరాలు రూపొందించిన అవసరమైన శాసనం తయారవుతుంది.
దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో డిసెంబర్ 31, 1972న ఆమోదించబడినది.
ఆంధ్ర సేన(Andhra Sena)
- 1972 డిసెంబర్ 17న మాదాల జానకిరామ్ అధ్యక్షతన ఆంధ్ర సేనను ఏర్పాటు చేశారు
- దీనికి సలహాదారు - పిచ్చయ్య నాయుడు
- దీనికి కార్యవర్గ సభ్యులు - జాగర్లమూడి దుర్గాప్రసాద్, వాలిన సూర్య భాస్కర రావు,
- ఆంధ్ర సేన తీర్మానం - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన
జై ఆంధ్ర ఫ్రంట్(Jai Andhra Front)
- ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఏర్పడిన మరో సంఘం జై ఆంధ్ర ఫ్రంట్
- ఈ ఫ్రంట్ సాధనకు గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం వంటి ఆంధ్ర నాయకులు కృషి చేశారు
- జై ఆంధ్ర ఫ్రంట్ వారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్న నాయకులను తమ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి నాయకుడు బి.సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు
- జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 5 సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది.
- కోస్తాంధ్ర నాయకత్వం ముల్కీ నిబంధనలను అమలుచేయడం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ తో ముందుకు వచ్చింది
- దీనికోసం అప్పటి ఉప ముఖ్యమంత్రి బి.వి.సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేసి 31 డిసెంబర్ 1972 నా తిరుపతిలో సదస్సు నిర్వహించారు
- ఈ సదస్సు పనులు కట్టరాదని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించమని పిలుపునిచ్చింది.
- ఈ విధంగా జై ఆంధ్రా ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది.