తెలుగు జాతీయత తెలంగాణ అస్తిత్వం
తెలుగు ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ
1982 తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత అనతికాలంలోనే 1983లో అధికారంలోకి వచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరులు ఉద్యోగాలలో నియమించబడ్డారు అని టీఎన్జీవో సభ్యులు ఆధారాలతో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు తెలియజేశారు
ఈ ఉల్లంఘనను 1975 నుంచి 1985 వరకు జరిగాయని పేర్కొన్నారు
టిఎన్జీవోల విన్నపం మేరకు స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జై భారత రెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశాడు
జై భారత్ రెడ్డి కమిటీ(Jai Bharath Reddy Committee or Officers Committee)
జై భారత్ రెడ్డి కమిటీ(Jai Bharath Reddy Committee or Officers Committee)
ఈ కమిటీ 1985లో నియమించబడింది. ఈ కమిటీని ఎన్టీరామారావు నియమించారు
ఈ కమిటీ కి మరొక పేరు- ఆఫీసర్స్ కమిటీ
ఈ కమిటీ చైర్మన్ - జై భారత్ రెడ్డి ఐఏఎస్
ఈ కమిటీ సభ్యులు: ఉమాపతి, కమల్ నాథ్
ఈ కమిటీ నివేదిక
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా అక్టోబర్ 18, 1975 నుంచి జూన్ 30, 1985 ల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా స్థానికేతరులు 56,962 మంది నియమించబడ్డారు అని తేల్చింది.
జై భారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదిక పైన పునఃపరిశీలనకు వేసిన కమిటీ సుందరేషన్ కమిటీ
సుందరేషన్ కమిటీ కూడా జై భారత్ రెడ్డి కమిటీ నివేదికను సమర్ధించింది.
పై రెండు కమిటీల సూచనల మేరకు ఎన్టీఆర్ ప్రభుత్వం డిసెంబర్ 30, 1985 న 610 జీవో ను విడుదల చేశారు
610 జీవో (610 G.O)
మార్చి 31, 1986 లోపు తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను తిరిగి వారి స్వస్థలాలకు పంపాలని తెలుపుతుంది
స్థానికేతరులను వారి స్వస్థలానికి పంపగా ఏర్పడిన ఖాళీలను తెలంగాణ వారితో భర్తీ చేయాలని పేర్కొంది
564 జీవో (564 G.O)
564 జీవో (564 G.O)
రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న స్థానికేతరులు అయిన కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిని తిరిగి స్వస్థలాలకు పంపేందుకు జీవో 564 డిపార్ట్మెంట్, 05-12-1985 న విడుదలైంది.
నోట్: దీనిని మాత్రం సక్రమంగా అమలు చేసారు కానీ 610 G.O ని మాత్రం పక్కన పడవేశారు.
నోట్: దీనిని మాత్రం సక్రమంగా అమలు చేసారు కానీ 610 G.O ని మాత్రం పక్కన పడవేశారు.