Sri Krishna Committee on Telangana State Formation-శ్రీ కృష్ణ కమిటీ

TSStudies
1 minute read
0
శ్రీ కృష్ణ కమిటీ 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ ఫిబ్రవరి 3, 2010 లో ఏర్పడింది 
  • కమిటీ చైర్మన్ - జస్టిస్ శ్రీ కృష్ణ రిటైర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి 
  • కమిటీ సభ్యులు 
  • ప్రొఫెసర్ రణబీర్ సింగ్  - వైస్ ఛాన్సలర్, జాతీయ న్యాయ కళాశాల, ఢిల్లీ 
  • డాక్టర్ అబుసలే షరీఫ్- సీనియర్ ఫెలో, జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా సంస్థ, ఢిల్లీ 
  • ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ కౌర్ - సాంఘిక శాస్త్ర విభాగం, ఐఐటీ, ఢిల్లీ 
  • కమిటీ కార్యదర్శి - వినోద్ కుమార్ దుగ్గల్ (రిటైర్డ్ ఐఏఎస్) 
  • ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 31 లోపు అందించాలని కేంద్రం నిర్దేశించింది 
  • ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 30న కేంద్రానికి అందజేసింది

కమిటీ ప్రతిపాదనలు(Recommendations of Sri Krishna Committee
  • ఈ కమిటీ తన మొదటి సమావేశం ఫిబ్రవరి 13, 2010 న ఢిల్లీలో జరిగింది 
  • శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 505 పేజీలు 9 చాప్టర్లు ఉన్నాయి
  1. ఉద్యమాన్ని సాధారణ శాంతిభద్రతల పరిస్థితిగా పరిగణించి కేంద్రం సాధారణ మద్దతు తీసుకుంటూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవడం 
  2. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం 
  3. హైదరాబాద్ రాజధానిగా రాయలసీమ, తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు 
  4. ప్రత్యేక తెలంగాణ, పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు గుంటూరు, కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాలోని కొన్ని మండలాలను కలుపుకొని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం 
  5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతి
  6. ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం
  • ఈ కమిటీ 6వ అంశాన్ని తమ తొలి ప్రాధాన్యత అంశంగా పేర్కొంది. అంటే పరోక్షంగా సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించింది 
  • ఒకవేళ 6వ అంశం అమలు చేయడం సాధ్యం కాకపోతే రెండవ ప్రాధాన్యత 5వ అంశం అని పేర్కొంది 
  • 8వ అధ్యాయం ను రహస్యంగా ఉంచి హోంమంత్రికి సమర్పించింది 
  • 8వ అధ్యాయం బహిర్గతంపై కోర్టులో తెలంగాణ వాది అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ కేసు వేశారు 
  • 2011 మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి 8వ అధ్యాయం లోని కొన్ని అంశాలను కోడ్ చేస్తూ తీవ్ర విమర్శలతో కూడిన తీర్పు ఇచ్చాడు 
  • కానీ ఈ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది

ప్రముఖుల నిరాహారదీక్షలు 
కొండా లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహ దీక్ష 
2011 నవంబర్ 1 నుండి 2011 నవంబర్ 7 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ దీక్ష 
2011 నవంబరు 1న నల్గొండలోని క్లాక్ టవర్  వద్ద దీక్ష చేపట్టారు 

శ్రీమతి రాయబారపు నళిని (డిఎస్పి) నిరాహారదీక్ష  
2011 డిసెంబర్ 9 నుంచి 16 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షను చేపట్టారు


Post a Comment

0Comments

Post a Comment (0)