Telangana Allegations Six Point Formula by Indira Gandhi

TSStudies
0

ఆరు సూత్రాల పథకం(Six Point Formula in Telangana)

  • ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అంశాల ప్రణాళికను తీసుకువచ్చింది 
  • ఆరు సూత్రాల ప్రణాళిక అమలు కోసం రాజ్యాంగంలో 1973లో 32వ రాజ్యాంగ సవరణ చేయబడింది 
  • ఈ అంశానికి రాజ్యాంగబద్ధత కల్పించవలసిన అవసరం ఈ క్రింది వాటివల్ల ఏర్పడింది
  • 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి
  • రాజ్యాంగంలోని 371 వ ఆర్టికల్ ఈ అంశాలను వివరిస్తుంది. కానీ సుప్రీం కోర్టు 371 ఆర్టికల్ను అనుసరించి ఏర్పరిచిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుల మరియు నివాస ప్రాంతాల చట్టం 1957 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది 
  • దీనిలో ఇరు ప్రాంతాలలో ఆందోళనలను తలెత్తి విభేదాలు పెరిగాయి 
  • ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఉద్వేగపరమైన ఏకత్వం సాధించినందుకు సెప్టెంబర్ 21, 1973న ఆరు సూత్రాల ప్రణాళిక ప్రతిపాదించబడినది 
  • ఈ ఆరు సూత్రాల ప్రణాళిక ద్వారా ఏకరూపత కలిగిన సత్వర ప్రగతిని మరియు అన్ని ప్రాంతాలలో సమాన అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాలలో వెనుకబడిన ప్రాంతాలలో అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం 
  • ముల్కీ నిబంధనల సవరణ చట్టం మరియు ఆరు సూత్రాల ప్రణాళిక 21 సెప్టెంబర్ 1973 & 22 అక్టోబర్ 1973 న ప్రకటించబడ్డాయి.
దీనిలోని ముఖ్యాంశాలు
1. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డుతో పాటు వెనుకబడిన ప్రాంతాల ఎమ్మెల్యేలకు నిపుణులకు భాగస్వామ్యం కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సంఘాలను నియమించాలి 
2. రాష్ట్రమంతటా విద్యాసంస్థలలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత, హైదరాబాద్ లో ఉన్నత విద్య వసతుల ను పెంచడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు 
3. ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాలను లోకలైజ్ ఇచ్చేసి, నియామకంలో స్థానికులకే ప్రాధాన్యత.
4. నియామకాలు, సీనియార్టీని గుర్తించడం, ప్రమోషన్ల వంటి విషయాలలో తలెత్తే ఫిర్యాదుల పరిశీలనకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను నియమించాలి.` 
5. పైన వివరించిన సూత్రాల అమలుకు తలెత్తే చిక్కులను అధిగమించడానికి రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించాలి 
6. పైన సూచించిన వాటి అమలులో ముల్కీ నిబంధనలు మరియు రీజనల్ కమిటీలు రద్దు అవుతాయి

14 ఎఫ్: 
  • 1975 రాష్ట్రపతి ఉత్తర్వులలో కొన్ని అంశాలను మినహాయించారు. అందులో పోలీసు శాఖకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం 1348 పసలిలోని సెక్షన్-3 క్లాస్-B లో పేర్కొన్న ఏ పోలీస్ అధికారి ఉద్యోగానికైనా ముల్కీ రూల్స్ వర్తించవు. దీనినే 14 ఎఫ్ అంటారు. 
  • హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు 2009 అక్టోబర్ 9న తీర్పు ఇచ్చింది 
  • 14 ఎఫ్ రద్దు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి కేసీఆర్ సిద్ధిపేట నగరంలో 'ఉద్యోగ గర్జన' నిర్వహించారు. 
  • ఈ సభలోనే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదం ఇచ్చాడు 
  • ఈ ఫ్రీజోన్ కాస్త ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గా మారింది
ఈ అంశాల వల్ల కలిగిన తక్షణ ఫలితం(Results of the implementation of 6 points formula)
1. తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు 
2. మూడు ప్రాంతాలకు, మూడు ప్రణాళిక మండల ఏర్పాటు మరియు అవసరాన్నిబట్టి హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు
ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయడానికి సెప్టెంబర్ 1973 నుండి ఫిబ్రవరి 1975 మధ్యకాలంలో మైలురాయి లాంటి రెండు అంశాలు జరిగాయి (ముల్కీ నిబంధనలు రద్దు చేయడం తెలంగాణ ప్రజలకి జరిగిన తీవ్ర నష్టం)
a) ముల్కీ నిబంధనలు 31 డిసెంబర్ 1973 న రాష్ట్రపతి ఆమోదంతో రద్దు చేయబడ్డాయి 
b) డిసెంబర్ 10, 1973 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రాంతీయ మండలి రద్దు చేయబడింది 
ఇది జనవరి 1, 1974 నుండి అమలులోకి వస్తుంది 
ఈ ఆరు సూత్రాల ప్రణాళిక ద్వారా రాష్ట్రంలో పరిస్థితులు చక్క బటన్ తో జనవరి 18, 1973న రాష్ట్రంలో విధించబడిన రాష్ట్రపతి పాలన, డిసెంబర్ 1973 న తొలగించారు 
విద్యా సంస్థలలో ప్రవేశాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు జూలై 1974లో విడుదల చేయబడ్డాయి 
కేంద్రీయ విశ్వవిద్యాలయం 1974లో పార్లమెంట్ చట్టం ద్వారా చేయబడింది 
1974వ సంవత్సరంలో ఇందిరాగాంధీ 6 సూత్రాల కార్యక్రమం లో భాగంగా హైదరాబాద్ లో "యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్" ఏర్పాటు చేయబడింది. దీనిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని కూడా అంటారు.


Post a Comment

0Comments

Post a Comment (0)