పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు
- 2014 ఫిబ్రవరి 14న హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే 'రాష్ట్ర పునర్విభజన బిల్లు'ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.
- బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు షిండే ప్రకటిస్తున్న సమయంలో ఆంధ్ర ఎంపీలు గొడవ చేశారు.
- ఈలోపు స్పీకర్ మీరాకుమార్ సభలో బిల్లును ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు.
- 2014 ఫిబ్రవరి 14న ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో పెప్పర్ స్ప్రే తో దాడి చేశాడు.
- ఈ పెప్పర్ స్ప్రే వలన తీవ్ర అనారోగ్యమునకు గురైన ఎంపీ పొన్నం ప్రభాకర్ (కరీంనగర్ ఎంపీ).
- ఈ సభలో గందరగోళానికి కారణమైన 16 మంది ఎంపీలను స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
- ఈ సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి.
- 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది.
- బిల్లుపై హోంమంత్రి షిండే మాట్లాడారు. లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18న ఆమోదించినట్లు స్పీకర్ మీరా కుమార్ తెలిపారు.
- ఫిబ్రవరి 19, 2014 ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రం పై నిరసన వ్యక్తం చేస్తూ తన సీఎం పదవికి రాజీనామా చేశాడు.
- లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిజెపి పార్టీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ పరిపూర్ణ మద్దతు ఇవ్వడంతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
- 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు.
- రాజ్యసభలో బిజెపి ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
- విశాలాంధ్రను కోరుకుంటున్నామని సభ నుంచి సిపిఎం ఎంపీలు బైకాట్ చేశారు.
- 'ది బిల్ ఈస్ పాస్డ్' అని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ విభజించబడింది.
తెలంగాణ బిల్లు ఆమోదం(Approval of Telangana Bill in Parliament)
- లోక్ సభలో ఆమోదం 2014 ఫిబ్రవరి 18
- రాజ్యసభలో ఆమోదం 2014 ఫిబ్రవరి 20
- రాష్ట్రపతి సంతకం 2014 మార్చి 1
- కేంద్ర ప్రభుత్వం గెజిట్ 2014 మార్చి 2
- 2014 మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ బిల్లు చట్టబద్ధమైంది.
- భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది
- 2014 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2 అని కేంద్రం ప్రకటించింది.
నోట్: రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన 1973 జనవరి 1 నుండి డిసెంబర్ 10 వరకు విధించారు
Study Material:
Model Papers: