Telangana Movement Between 1970 to 2000-నిర్మాణ దశ(1996-2001)

TSStudies
0
నిర్మాణ దశ 1996-2001 
నిజామాబాద్ సభ(Nizamabad Sabha) 
  • 1996 అక్టోబర్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ప్రజాసంఘాల నాయకులు నిజామాబాద్ లో సభను నిర్వహించారు 
  • ఈ సభలో పాల్గొన్న ముఖ్యనాయకులు కాళోజీ రావు, ప్రొ. జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, భూపతి కృష్ణమూర్తి, గద్దర్, రఘువీరారావు. 
  • ఈ సభ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ ప్రాంత సమస్యలకు ఏకైక పరిష్కారం అని తీర్మానించింది. 

భువనగిరి సభ(Bhuvanagiri Sabha)
  • 1997 మార్చి 8, 9 తేదీలలో ఈ సభ జరిగింది 
  • ఈ సదస్సు ప్రాంగణానికి "నిజాం వ్యతిరేక పోరాటాలు అమరవీరుల ప్రాంగణం"గా నామకరణం చేశారు 
  • ఈ సభకు "దగాపడ్డ తెలంగాణ" గా నామకరణం చేశారు 
  • ఈ సభను కాళోజీ నారాయణ రావు ప్రారంభించారు 
  • మార్చి 9వ తేదీన జరిగిన సభకు నాగారం అంజయ్య అధ్యక్షత వహించారు 
  • ఈ సభలో వివిధ మేధావులు ప్రసంగించిన భిన్న అంశాలు 
  • విద్య వైద్య రంగం ప్రొఫెసర్- జయశంకర్ సార్ 
  • తెలంగాణ వనరులు పారిశ్రామిక కాలుష్యం- ప్రొఫెసర్ జాదవ్ సార్ 
  • వలసీకరణ ఉద్యోగాలు- ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు 
  • తెలంగాణ ఉద్యమం అవగాహన-గద్దర్, వెంకటేశ్వర్లు 
  • భాషా సంస్కృతి మీడియా-నందిని సిద్ధారెడ్డి 
  • సాంఘిక సంక్షేమ రంగం-ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి 
  • రిజర్వేషన్లు వర్గీకరణ-డాక్టర్ ముత్తయ్య 
  • ఆదివాసి సమస్యలు-ప్రొఫెసర్ బాల జనార్ధనరావు 
  • ఈ రెండు రోజుల సమావేశంలో తన ఉద్యమ పాటలతో బెల్లి లలిత తెలంగాణవాదులు ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించింది

తెలంగాణ మహాసభ(Telangana Mahasabha) 
  • 1997 ఆగస్టు లో తెలంగాణ మహాసభ ఏర్పడింది దీని లో కీలక పాత్ర పోషించింది మారోజు వీరన్న 
  • 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో "ధోఖాతిన్న తెలంగాణ" పేరుతో సదస్సు జరిగింది 
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది - డా. చెరుకు సుధాకర్
  • ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు -వి ప్రకాష్ 
  • 17 డిమాండ్లతో "సూర్యాపేట డిక్లరేషన్" ను డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రతిపాదించారు 
  • ఈ సంస్థ ఆధ్వర్యంలో మారోజు వీరన్న తెలంగాణ ఉద్యమంలోకి దళిత, బహుజనులను పెద్ద మొత్తంలో సమీకరించారు 
  • తరువాత కాలంలో మారోజు వీరన్న ఎన్ కౌంటర్ లో మరణించారు 
  • తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తెలంగాణ మహాసభ మాస పత్రికను వి ప్రకాష్ వెలువరించారు

ఉద్యమ వేదికలు 
సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్(Center for Telangana Studies) 
  • దీనిని 1997 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థాపించారు.  
  • దీనికి అధ్యక్షులు: ప్రొఫెసర్ జయశంకర్ 
  • ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివరాలు సేకరించి ప్రచురించి ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లింది

తెలంగాణ స్టడీస్ ఫోరం(Telangana Studies Forum) 
  • దీన్ని 1998లో ఏర్పాటు చేశారు. 
  • దీనికి అధ్యక్షుడు గాదె ఇన్నయ్య 
  • ఈ ఫోరం తెలంగాణ సమస్యలపై కరపత్రాలు పుస్తకాలను ముద్రించి ప్రజల్లో అవగాహన చేపట్టింది

తెలంగాణ ఐక్యవేదిక(Telangana Ikya Vedika) 
  • 1997 ఆగస్టు 16న జయశంకర్ సార్ నేతృత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది 
  • మొదట్లో ఈ ఐక్యవేదిక కాచిగూడలోని సుప్రభాత కాంప్లెక్స్ లో ఉండేది 
  • తరువాత కాలంలో ఐక్యవేదిక కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమయిన జలదృశ్యంలోకి మార్చబడింది 
  • ఈ ఐక్యవేదిక కార్యాలయం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం గా మారింది 
  • తెలంగాణ ఐక్యవేదిక అనేక సదస్సులు సమావేశాలు పెట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయింది 
  • తర్వాత కాలంలో కేసీఆర్ తెలంగాణ విషయంలో శ్రద్ధ వహించడం తో తెలంగాణ ఐక్యవేదిక నాయకులైన జయశంకర్ సార్, వి ప్రకాష్ రావు, కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ నాయకత్వ బాధ్యతలు అప్పగించడంతో క్రియాశీలక పాత్ర పోషించారు. 

తెలంగాణ జనసభ(Talangana Janasabha) 
  • ఉపాధ్యాయులు, లాయర్లు, జర్నలిస్టులు కలిసి తెలంగాణ జన సభను 1998 జూలైలో హైదరాబాదులోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేశారు 
  • ఈ సభలోనే "జనతెలంగాణ మాస పత్రిక" ను(Jana Telangana Monthly Magazine) కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు 
  • తెలంగాణ జనసభ అనుబంధంగా జహంగీర్ కన్వీనర్ గా  తెలంగాణ కళా సమితి ఏర్పడింది 
  • తెలంగాణ కళాసమితికి కో కన్వీనర్ గా ఉన్న బెల్లి లలితను కొంతమంది దుండగులు 1999 మే లో భువనగిరిలో హత్య చేశారు

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(Telangana Development Forum) 
  • ప్రొఫెసర్ జయశంకర్ సలహాపై 1999లో తెలంగాణ ప్రవాస భారతీయులు దీనిని ప్రారంభించారు 
  • దీనికి అధ్యక్షుడు మధు కె రెడ్డి 
  • చైర్మన్ డి పి  రెడ్డి


Post a Comment

0Comments

Post a Comment (0)