Telangana Movement Between 1970 to 2000-తెలంగాణ ఉద్యోగుల సంఘాలు

TSStudies
0

తెలంగాణ ఉద్యోగుల సంఘాలు 

తెలంగాణ ఎన్జీవో సంఘం 
  • ఇది 1946 లో నిజాం స్టేట్ లో ములాజిం యూనియన్ పేరుతో స్థాపితమైంది 
  • ఈ సంఘానికి ప్రథమ అధ్యక్షులు అబ్దుల్ గఫ్ఫార్ హుస్సేన్ 
  • ఇది 1967లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ గా మార్చబడింది 
  • 1969 ఉద్యమంలో కేఆర్ ఆమోస్, స్వామినాథన్ ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషించింది 
  • 2009 అక్టోబరు 21న సిద్దిపేటలో లక్షలాది ఉద్యోగుల గర్జన నిర్వహించింది
తెలంగాణ ఉద్యోగుల సంఘం 
  • 2001 జూలై 25న ఆవిర్భవించింది 
  • దీనికి అధ్యక్షుడుగా విఠల్ ఎన్నికయ్యారు 
  • ఇది 2004 నుంచి తెలంగాణ డైరీని ఆవిష్కరిస్తుంది 
  • 2006లో 'క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని' నిర్వహించింది 
  • దీనికి 2002 నుంచి 2005 వరకు ఎ కృష్ణా రెడ్డి అధ్యక్షులు ఆ తరువాత డి సుధాకర్, స్వామిగౌడ్, దేవీప్రసాద్ అధ్యక్షులు గా కొనసాగారు. ప్రస్తుతం కారం రవీందర్రెడ్డి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 
  • 2004 మే 31న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో అల్లం నారాయణ నాయకత్వంలో స్థాపించబడింది 
  • తెలంగాణ పాత్రికేయులు రాసిన వ్యాసాలన్నిటిని అల్లం నారాయణ, కందుకూరి రమేష్ సంపాదకత్వంలో 2001 మే లో 'మే 31' అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు
తెలంగాణ టీచర్స్ ఫోరం 
  • సెప్టెంబర్ 20, 2006న సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో ఇది స్థాపించబడింది 
  • జి శ్రీధర్ కన్వీనర్ గా తెలంగాణ టీచర్స్ ఫోరం తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డారు
తెలంగాణ ఐటీ ఫోరం 
  • ఆర్ట్స్ కాలేజీలో 2006లో దీనిని స్థాపించారు 
  • ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడంతో పాటు విప్రో, సత్యం, హైటెక్ సిటీలలో స్థానికులకు రిజర్వేషన్లు సాధించడం కోసం కృషి చేసింది
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 
  • ప్రభుత్వ ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులకు 2007 జూలై 8న ఆవిర్భవించింది 
  • దీనికి అధ్యక్షులుగా మురళీమనోహర్ ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్, షబ్బర్ అలీ, కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కత్తి వెంకటస్వామి ఎన్నికయ్యారు 
  • ప్రస్తుతం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడుగా కత్తి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా యు.సిద్దేశ్వర్ కొనసాగుతున్నారు
తెలంగాణ ప్రైవేటు రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ 
  • జూన్ 15, 2008న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయబడింది 
  • ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% ప్రైవేట్ ఉద్యోగాలు, జిల్లా స్థాయిలో ఏర్పడిన ప్రైవేట్ సంస్థలలో 100% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేందుకు కృషి చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)