Telangana State Formation-2004 ఎన్నికల పొత్తులు

TSStudies
0
2004 ఎన్నికల పొత్తులు 
టిఆర్ఎస్ పార్టీ 
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించింది. 
  • 2004 మార్చి 12న కరీంనగర్ లో నిర్వహించిన సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల మనోభావాలు మాకు తెలుసు, వాటిని మేము గౌరవిస్తాం వారి కోరికను తీర్చేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. 
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీకి 42 స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది 
  • 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 26 శాసనసభ సీట్లను 5 లోక్ సభ  సీట్లు గెలిచింది. 
  • కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలోకి రావడంతో టిఆర్ఎస్ కేంద్ర మంత్రివర్గంలో చేరింది 
  • దీనిలో కె.చంద్రశేఖరరావుకు ఓడలరేవు మంత్రిత్వశాఖ, ఆలె నరేంద్రకు గ్రామీణాభివృద్ధిశాఖ లభించింది 
రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన టిఆర్ఎస్ శాసన సభ్యులు 
యస్ సంతోష్ రెడ్డి 
విజయరామారావు, 
ఎ చంద్రశేఖర్, 
హరీష్ రావు, 
నాయిని నరసింహారెడ్డి,
 శ్రీ లక్ష్మీ కాంతారావు

కాకినాడ తీర్మానం(1998) 
జాతీయ పార్టీ అయినా బిజెపి కాకినాడలో చిన్న రాష్ట్రాలకు అనుకూలమని తీర్మానం చేసింది. దీని యొక్క నినాదం ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు.
  • 2004 మే 26న యూపీఏ ప్రభుత్వం తన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశాన్ని చేర్చింది 
  • 2004 జూన్ 7న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంలో అవసరమైన సంప్రదింపుల ద్వారా సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చేపడుతుందని పేర్కొన్నారు 
  • టిఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో 2004 డిసెంబర్ 1న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు 
  • తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ జాగరణ పేరుతో అనేక మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆరు వందల మందికి పైగా కార్యకర్తలను ఎంపిక చేసి హైదరాబాదులోని నోమ ఫంక్షన్ హాల్ లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది.  
  • 2006 ఫిబ్రవరి 12న పోలవరం ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలుపుతూ పోలవరం గర్జన పేరుతో భద్రాచలంలో బహిరంగ సభ నిర్వహించింది 
  • 2006 ఆగస్టు 23న కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించాడు.  
  • 2006 ఆగస్టు 25న యూపీఏ పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కెసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టాడు. తదనంతరం అదే రోజు రాత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవర్ కేసీఆర్ కు పండ్ల రసం ఇచ్చి దీక్ష విరమింపజేశాడు

Post a Comment

0Comments

Post a Comment (0)