ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు 2005
అధ్యక్షుడు: ప్రణబ్ ముఖర్జీ
సభ్యులు: దయానిధి మారన్, రఘు వంశ ప్రసాద్ సింగ్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో 'విస్తృత అంగీకారం' కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన 2005లో ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తెలంగాణపై తమ అభిప్రాయం తెలపవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
కె సి ఆర్, నరేంద్ర, ఆచార్య జయశంకర్, టీఆర్ఎస్ ఎంపీలు స్వయంగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించారు
ఈ కమిటీ యొక్క గడువు 8 వారాలు.
ఈ కమిటీకి 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదనకు అనుకూలం
మాజీ ప్రధానమంత్రులు
దేవెగౌడ, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్ పేయి, ఐ.కె.గుజ్రాల్ తెలంగాణకు అనుకూలం అని ప్రకటించారు
పార్టీలు
యూపీఏ కూటమిలోని 13 పార్టీలలో 11 పార్టీలు
యూపీఏ ప్రభుత్వాన్ని బయటనుండి సమర్థిస్తున్నారు 6 పార్టీలు
ప్రతిపక్షమైన ఎన్డీయే కూటమిలోని 8 పార్టీలు
కొంతమంది స్వతంత్ర సభ్యులు స్పష్టంగా తన సమ్మతిని తెలియజేస్తూ రాతపూర్వకంగా తెలిపారు
వామపక్షాలు
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సభ్యులు 3 అనుకూలం
తటస్థం
సమాజ్ వాద్ పార్టీ తెలంగాణ పై ఏ విధంగానూ స్పందించలేదు
2008 అక్టోబర్ లో టిడిపి తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చింది
యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియ అంతా తమ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తమ సమ్మతిని ప్రత్యేకంగా రాసి ఇవ్వవలసిన అవసరం లేదని తెలిపింది