Telangana State Formation Rossayya Committee-రోశయ్య కమిటీ

TSStudies
0
కేసీఆర్ రాజీనామా 
  • 2006 సెప్టెంబర్ 12న ఎం.సత్యనారాయణ చేసిన సవాలును స్వీకరించిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి అక్టోబర్ 8న సిద్దిపేట సమర శంఖారావం పేరుతో సభను నిర్వహించారు 
  • 2006 డిసెంబరు 4న కేసీఆర్ రాజీనామా చేసిన పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో కేసిఆర్ రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొంది డిసెంబర్ 22న నల్గొండ పట్టణంలో తెలంగాణ ఆత్మగౌరవ సభను నిర్వహించారు 
  • నల్గొండ నగారా పేరుతో 2007 ఏప్రిల్ 6-12 వరకు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలలో కేసీఆర్ పర్యటించాడు 
  • 2007 జూలై 15న మైనారిటీ సంక్షేమం కోసం ఇందిరాపార్క్ వద్ద కేసీఆర్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాడు 
  • 2007 నవంబర్ 15న పసునూరు దయాకర్ రావు డిజైన్ చేసిన 'తెలంగాణ తల్లి విగ్రహాన్ని' తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రతిష్టించాడు 
  • 2008 మార్చి 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది 
  • 2008 జూన్ 1న ఉప ఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీ రెండు లోక్ సభ స్థానాలు (కరీంనగర్, హనుమకొండ) మరియు ఏడు అసెంబ్లీ స్థానాల్లో(సిద్దిపేట, దొమ్మాట, కమలాపూర్, హుజూరాబాద్, మేడారం, చేర్యాల, ఆలేరు) గెలుపొందింది 
  • 2009 అక్టోబరు 21న మెదక్ జిల్లాలోని సిద్దిపేట లో ఉద్యోగ గర్జన నిర్వహించారు 

రోశయ్య కమిటీ 
ఫిబ్రవరి 12, 2009 న ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఉభయ సభ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు 
ఈ కమిటీకి చైర్మన్: రోశయ్య
సభ్యులు:
1) కొణతాల రామకృష్ణ 
2) గీతారెడ్డి 
3) ఉత్తమ్ కుమార్ రెడ్డి 
4) శ్రీధర్ బాబు 
5) పద్మరాజు 
6) షేక్ హుస్సేన్ 
7) అక్బరుద్దీన్ ఓవైసీ

గిర్ గ్లాని కమిషన్ 
  • 2001 జూన్ 25న తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి 610 జీవో అమలు కొరకు గిర్ గ్లాని కమిషన్ ను ఏర్పాటు చేశారు 
  • 2001 అక్టోబర్ 6న గిర్ గ్లాని కమిషన్ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది 
  • 2004 సెప్టెంబర్ 30న గిర్ గ్లాని కమిషన్ తన తుది నివేదికను అందించింది 
  • ఈ కమిషన్ 1975-2001 మధ్యకాలంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది

Post a Comment

0Comments

Post a Comment (0)