తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rastra Samithi T.R.S)
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో '2001 ఏప్రిల్ 27'న కేసీఆర్ హైదరాబాద్ లోని జలదృశ్యం(కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం)లో తెలంగాణ రాష్ట్ర సమితి ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు
ఇది 2001 మే 15న కరీంనగర్ లో 'సింహగర్జన' పేరుతో సభ జరిపింది. దీనికి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబుసొరేన్ తెలంగాణకు మద్దతు తెలిపారు
జూన్ 1, 2001 న పాలమూరులో, జూన్ 2న నల్గొండ, జూన్ 4న నిజామాబాద్, జూన్ 5న నిర్మల్, జూన్ 21న వరంగల్ లో భారీ సభలు నిర్వహించారు
2001 జూలై లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నాగలి గుర్తుపై పోటీ చేసి కరీంనగర్(రాజేశ్వరరావు), నిజామాబాద్ (సంతోష్ కుమార్) జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకుంది
2001 నవంబర్ 17న ప్రజా గర్జన సభను ఖమ్మంలో నిర్వహించింది
2002 మార్చి 27న రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో శంఖారావ సభ నిర్వహించారు
2002 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవ సభను నల్గొండలో నిర్వహించింది. ఈ సభకు శిబుసొరేన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్ హాజరయ్యారు.
టిఆర్ఎస్ కార్యక్రమాలు(Programmed by T.R.S)
టిఆర్ఎస్ పార్టీ 2002 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది
నవంబర్ 25, 2002 - జనవరి 6, 2003 వరకు జలసాధన కార్యక్రమాన్ని నిర్వహించింది
జనవరి 6, 2003న హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్స్ లో 'తెలంగాణ గర్జన' పేరుతో ఒక మహాసభను నిర్వహించింది
ఏప్రిల్ 27, 2003 న వరంగల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వితీయ వార్షికోత్సవ సభలు జరిగాయి. ఈ సభకు టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జైత్రయాత్ర అనే నామకరణం చేసింది
రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేసీఆర్ 2003 మే 20-25 వరకు మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర చేశారు
2003 ఆగస్టులో మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో కోలాహలం సభ, నాగర్ కర్నూలులో నగారా సభ(2003 సెప్టెంబర్) నిర్వహించారు
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కేసీఆర్ 2003 ఆగస్టు 25-30 వరకు కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేశారు
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదనను ఢిల్లీకి చేరవేయడానికి 2003 మార్చి 27న హైదరాబాద్ పలక్ నమా ప్యాలెస్ నుండి ఢిల్లీకి కారు ర్యాలీ చేపట్టారు
2003 సెప్టెంబర్ 9న మౌలంకార్ హోటల్ లో వివిధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్ గా కేసీఆర్ ను ఎన్నుకున్నారు
కాకినాడ తీర్మానం అమలు చేయక పోయేసరికి ఆలే నరేంద్ర బిజెపి నుండి బయటకు వచ్చి 'తెలంగాణ సాధన సమితి' అనే పార్టీని స్థాపించారు
కేసీఆర్ తో సంప్రదింపుల అనంతరం తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని నిర్వహించి 2002 ఆగస్టు 11న టిఆర్ఎస్ లో తెలంగాణ సాధన సమితి విలీనమైంది
సెప్టెంబర్ 17, 2003న ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ముందు భారీ బహిరంగ సభను విద్యార్థులను ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా దోహదం చేసింది
2003 నవంబరు 19న మెదక్ జిల్లాలో 'సింగూరు సింహగర్జన' అనే పేరుతో బహిరంగ సభ
2003 నవంబర్ 21న మహబూబ్ నగర్ జిల్లాలో 'పాలమూరు సింహ గర్జన'
2003 డిసెంబర్ 3న నిజామాబాద్ లో 'ఇందూరు సింహ గర్జన'
2003 డిసెంబర్ 5న వరంగల్ లో 'ఓరుగల్లు సింహ గర్జన'
2003 డిసెంబర్ 16న సిరిసిల్లలో 'కరీంనగర్ కథనభేరి' నిర్వహించారు