Telangana State Formation-ప్రవాస భారతీయులు

TSStudies
0
ప్రవాస భారతీయులు 
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(Telangana Development Forum) 
  • 1999లో అమెరికాలో మొదటిసారిగా అందుకే రెడ్డి ప్రారంభించారు. 
  • ఇది తెలంగాణ డాట్ కాం (www.telangana.com) అనే వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. 
  • 18 డిసెంబర్ 2011న తెలంగాణ డెవలప్ మెంట్  ఫోరం ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో నాలుగో ప్రవాసీ తెలంగాణ దివస్ ను నిర్వహించింది.
తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్(Telangana NRI Association)
  • ఇది 2007లో ఏర్పడింది. దీనికి చైర్మన్ గా నారాయణస్వామి వెంకటయ్యలు, అధ్యక్షుడిగా వెంకట్ మారోజు నియమించబడ్డారు. 
  • ఇది సకల జనుల సమ్మెకు మద్దతుగా అమెరికాలోని వాషింగ్టన్ లో 2011 అక్టోబర్ 15న 'తెలంగాణ ప్రవాస్' పేరిట భారీ ప్రదర్శనను నిర్వహించింది.
వైద్యులు(Doctors) 
  • తెలంగాణ డాక్టర్స్ ఫోరం ను ఏర్పాటు చేసి దీనికి ఏ గోపాల్ కిషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
  • తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డాక్టర్ రమేష్ నాయకత్వంలో పని చేయగా, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పేరుతో డాక్టర్ల జెఎసి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో పనిచేసింది. 
  • జనవరి 22, 2010 న తెలంగాణ వైద్య గర్జన పేరుతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సభ నిర్వహించారు.
  • 2011 మార్చి 1న పల్లెపల్లెకు పట్టాలపై కార్యక్రమంలో భాగంగా వైద్యులు పట్టాలపైన పాలీ క్లినిక్ పేరుతో వైద్య సేవలను అందించారు. 
  • మే 15, 2013 వైద్యుల శంఖారావం పేరుతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో సభను నిర్వహించారు.
సంఘటిత - అసంఘటిత రంగాల పాత్ర(Low Category Employees)
  • ఇందులో సింగరేణి, రోడ్డు రవాణా సంస్థ, సిమెంట్ కంపెనీ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న సంఘటిత వర్గాలు పాల్గొన్నాయి. 
  • 2011 ఫిబ్రవరి 17 నుండి రాజకీయ జేఏసీ పిలుపు నిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. 
  • సింగరేణి కార్మికులు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 17 వరకు, ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 16 వరకు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. 
  • 2010 మే 23న ప్రవేట్ సెక్టార్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన సదస్సు జరిగింది. 
  • 19 జూలై 2012న 'భూమిపుత్రుల పాదయాత్ర' పేరుతో యాత్ర నిర్వహించారు.
సింగరేణి యాత్ర(Singareni Yaatra) 
  • తెలంగాణ జెఏసి 2011 నవంబర్ 9న సింగరేణి యాత్ర చేపట్టాలని నిర్ణయించింది దీనికి మూడు బృందాలను ఏర్పాటు చేసింది. 
1. కోదండరాం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని కోల్ బెల్ట్  ప్రాంతాన్ని సందర్శించారు. 
2. టీ-జేఏసీ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలో సందర్శించారు. 
3. టీ- జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సందర్శించారు.


Study Material:


Model Papers:


Post a Comment

0Comments

Post a Comment (0)