మలిదశ ఉద్యమంలో వివిధ వర్గాల పాత్ర
ఉద్యోగులు
ఉద్యోగులు
- 2009 అక్టోబర్ 10న హైదరాబాద్ ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్ నుంచి 'చలో అసెంబ్లీ' కార్యక్రమం చేపట్టారు
- 2009 నవంబర్ 21న మెదక్ జిల్లా సిద్దిపేటలో 'ఉద్యోగ గర్జన' చేపట్టారు
- 2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన 30న తెలంగాణ ఉద్యోగులు 'పెన్ డౌన్' కార్యక్రమం చేపట్టారు
- ఫిబ్రవరి 17, 2011 నుండి మార్చి 3, 2011 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టారు
- జూన్ 19, 2011 న 'హైదరాబాద్ కుక్స్ ఆన్ రోడ్స్' అనే కార్యక్రమాన్ని ఉద్యోగ జేఏసీ విజయవంతం చేసింది
- 13 సెప్టెంబర్ 2011 నుంచి అక్టోబర్ 24, 2011 వరకు సకల జనుల సమ్మెలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి
- సకల జనుల సమ్మెలో భాగంగా 11 అక్టోబర్ 2011న ఉద్యోగుల మహా ధర్నా నిర్వహించాయి
- కరీంనగర్ లో 11 అక్టోబర్ 2011న నిర్వహించిన 'ఉపాధ్యాయ మహా గర్జన' ను విజయవంతం చేశారు
- మార్చి 10, 2012 న నిర్వహించిన 'మిలియన్ మార్చ్' ను విజయవంతం చేశారు
- మే 31, 2001 న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడింది
- 2010 ఏప్రిల్ 28న 'తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు' అనే నినాదంతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు
- 2010 అక్టోబర్ 4న తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 'మీడియా మార్చ్' నిర్వహించాయి
- 2010 డిసెంబర్ 5న ఆర్టీసీ కళాభవన్ లో తెలంగాణ పాత్రికేయుల మహా సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రీయ లోక్ దళ్ నేత అజిత్ సింగ్ హాజరయ్యారు
- 2011 మే 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ ఆధ్వర్యంలో 'ఒక చేత్తో కలం మరో చేత్తో ఉద్యమం' అనే నినాదంతో ధర్నా నిర్వహించారు
- 2012 అక్టోబర్ 16న V6, హెచ్ఎంటీవీ, టీ న్యూస్, నమస్తే తెలంగాణ వంటి మీడియా సంస్థలపై సీమాంధ్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి
- డిసెంబర్ 8, 2009న సుందరయ్య భవన్ లో న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. దీనికి కన్వీనర్ గా రాజేందర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు
- ఫిబ్రవరి 22, 2010 న డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద న్యాయవాదుల ధర్నా నిర్వహించారు
- ఫిబ్రవరి 17, 2011 న సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తెలంగాణలోని అన్ని కోర్టులను బహిష్కరించారు
- ఫిబ్రవరి 20, 2011న చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు
- జూన్ 19, 2011 L.B. నగర్ లోని రంగారెడ్డి కోర్టు వద్ద వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్దర్, నాగం జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు
- జూలై 5, 2011 న తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ కు మద్దతుగా కోర్టును బహిష్కరించారు
- అక్టోబర్ 15-16, 2011 లో జరిగిన రైల్ రోకో కార్యక్రమం
- సెప్టెంబర్ 30, 2011 న సాగరహారం
- ఏప్రిల్ 29-30, 2010 లో ఢిల్లీలో జరిగిన సంసద్ యాత్రలో పాల్గొన్నారు.
- 29 జూన్ 2013 న ప్రజాకోర్టులో చలో అసెంబ్లీ నిర్వహించారు
- జూన్ 29, 2013న మాసాబ్ ట్యాంక్ లోని వెటర్నరీ భవన్ లో ప్రజాకోర్టు నిర్వహించారు
- 1969 తొలి దశ ఉద్యమంలో టి.ఎన్.సదాలక్ష్మి ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి లాంటి వారు పాల్గొన్నారు
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో బెల్లీ లలిత, విమలక్క, సంధ్య, జాగృతి కవిత, సూరేపల్లి సుజాత, అల్లం పద్మ, జ్యోతి కిరణ్, విజయశాంతి, పద్మాదేవేందర్ రెడ్డి, వనం ఝాన్సీ, రత్నమాల లాంటివారు చురుకైన పాత్ర పోషించారు
- 2009లో ఏర్పడిన తెలంగాణ మహిళా ఐక్యకార్యాచరణ సమితి, 2010 జనవరి 31న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులను నిర్వహించింది
- 2013 మార్చి 3న హైదరాబాద్ లోని ధర్నా చౌక్ (చిందు ఎల్లమ్మ వేదిక) లో మహిళా జెఏసి ధూం దాం నిర్వహించింది
- దీనిని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీవోడబ్ల్యూ, స్త్రీ విముక్తి తెలంగాణ మహిళా జేఏసీలు సంయుక్తంగా నిర్వహించాయి
This comment has been removed by the author.
ReplyDeleteSagara haaram 30/09/2012
ReplyDelete