తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ
తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) 2009 డిసెంబరు 24న ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా, పార్టీలకతీతంగా తెలంగాణ రాజకీయ కార్యాచరణ కమిటీ ఏర్పడింది.
దీనికి కన్వీనర్ - ప్రొఫెసర్ కోదండరాం
కో-కన్వీనర్ - మల్లేపల్లి లక్ష్మయ్య
జె ఏ సి లో చేరిన పార్టీలు
టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ టిడిపి ఫోరం, బిజెపి, సిపిఐ, న్యూ డెమోక్రసీ
డిసెంబర్ 25, 2009న బంజారాహిల్స్ లోని రావి నారాయణరెడ్డి హాలులో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
2010 ఫిబ్రవరి 18న జేఏసీ నుండి కాంగ్రెస్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
తరువాత కాలంలో తెలంగాణ టిడిపి ఫోరం కూడా జేఏసీ నుంచి తప్పుకుంది.
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టింది
ప్రజా ఉద్యమాలు నిరసన రూపాలు
- ఫిబ్రవరి 12, 2011 న తెలంగాణ రాజకీయ జేఏసీ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ప్రణాళికను ప్రకటించింది.
- 13 ఫిబ్రవరి 2011న గ్రామ గ్రామాన చాటింపులు, దీక్షా కంకణం
- 14 ఫిబ్రవరి 2011న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
- 15 ఫిబ్రవరి 2011న జైల్ భరో కార్యక్రమం
- 16 ఫిబ్రవరి 2011 న తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్, టీడీపీల ఎంపీ మరియు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా
- 17 ఫిబ్రవరి 2011న సహాయ నిరాకరణ కార్యక్రమం మొదలు దీనిలో భాగంగా ఉద్యోగులకు సంఘీభావ ర్యాలీలు
- 18 ఫిబ్రవరి 2011న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్
- 19 ఫిబ్రవరి 2011న రాస్తారోకోలు, నేషనల్ హైవే-9 దిగ్బంధం, పట్టణాల్లో వాక్ ఫర్ తెలంగాణ, గ్రామాల్లో ప్రభాతభేరి
- 20 ఫిబ్రవరి 2011న సార్వత్రిక సమ్మె , బంద్ ప్రారంభం
తెలంగాణ జెఎసి నిరసన కార్యక్రమాలు
- 2010లో మానవహారం ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు మరియు హైదరాబాద్ నుండి కోదాడ వరకు
- 2011 జనవరి 10-11 కలెక్టరేట్ల ముట్టడి
- 2011 జనవరి 19 న వంటావార్పు
- 2011 ఫిబ్రవరి 17 నుండి మార్చి 4 వరకు సహాయనిరాకరణ
- 2011 మార్చి 1న పల్లెపల్లె పట్టాలపైకి
- 2011 మార్చి 10న మిలియన్ మార్చ్
- 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు సకలజనుల సమ్మె
- 2012 సెప్టెంబర్ 30 న తెలంగాణ మార్చ్ / సాగరహారం
- 2013 మార్చి 21 న సడక్ బంద్
- 2013 ఏప్రిల్ 29-30 న సంసద్ యాత్ర