Telangana Folk dance styles-జానపద నృత్య రీతులు

TSStudies
2
జానపద నృత్య రీతులు

కోయ నృత్యం (పేరమ్ కోకి  ఆట)
కోయలు పండుగల పెళ్లి ఉత్సవాలలో బైసన్ హార్న్ డాన్స్(పేరమ్ కోకి ) ఆటను ప్రదర్శిస్తారు
పురుషులు ఎద్దు కొమ్మలను తనపై ధరించి, రంగు దుస్తులను ధరిస్తారు

నామాల  సింగడి నృత్యం
ఇది వ్యక్తిగత నృత్యం - నామాల సింగడు పీర్ల పండుగ జాతర తిరునాళ్ళలో మోగించే తప్పెట ఆధారంగా అడుగులు వేస్తారు
ముఖానికి నామాలు, తలకు వేపమండలు, చేతులకు బేడీలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు

కురు నృత్యం
వరంగల్ జిల్లాలోని కోయలు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు
పురుషులు మాత్రమే పాల్గొంటారు

గరుడ స్తంభ దాసరి
ఇది వ్యక్తిగత నృత్యం - శంఖం, జేగంట, దీపపు సెమ్మె, రాగిచెంబు, హనుమంతుడి బిళ్ళ గుర్తులతో నృత్యం చేసే దాసరి
దీపపు సెమ్మె నీ గరుడ స్తంభం అంటారు
వీరిని శంకర శంక దాసర్లనీ, గరుడ స్తంభ దాసర్లని అని పిలుస్తారు

థింసా నృత్యం
థింసా నృత్యాన్ని రాజ్ గోండులు పురుషులు మరియు మహిళలు చేస్తారు
కొన్నిసార్లు యవ్వనంలో ఉన్న యువకులు మహిళలు గా నృత్యంలో పాల్గొంటారు

గద్దె చెప్పే ప్రక్రియ
ఇది వ్యక్తిగత నృత్యం - గద్దె చెప్పేవారు భవిష్యత్తు గురించి చెప్పే ఎరుకల సానులు
పట్టణాలలో మహంకాళి జాతర అనంతరం  గద్దె చెప్పే ప్రక్రియ కూడా ప్రచారంలో ఉంది

గుసాడి నృత్యం
ఈ నృత్యాన్ని గోండు తెగ పురుషులు చేస్తారు
ఈ జానపద గిరిజన నృత్యాలు ఆషాడమాసంలో (జూన్ జూలై) పౌర్ణమి రోజున ప్రదర్శిస్తారు (దేశమంతా ఈ రోజున గురు లేదా వ్యాస పౌర్ణమ)

కోలాటం
సామూహిక నృత్యం - కోల అంటే కర్ర
కర్రలు వాయిద్యంగా లయబద్ధంగా చేసే నృత్యమే కోలాటం
దీన్నే దండ నర్తనం, దండలాస్యమని వ్యవహరిస్తారు
వీరి నాయకుడు కోలన్న
ఇద్దరు ఇద్దరు కలిసి వుద్ధిగా(ఉజ్జి) వచ్చి ఏర్పడుతారు
లోబుద్ధి, వెలది అనే భాగాలుగా విడిపోయి నృత్యం చేస్తారు

లంబాడా నృత్యం
ఉత్సవాలప్పుడు మరియు పెళ్లిళ్లలో లంబాడ మహిళలు, లంబాడ పురుషుడు సంగీత పరికరాలు వాయిస్తుంటే దానికనుగుణంగా నృత్యాన్ని చేస్తారు
హోలీ పండుగ సందర్భంగా లంబాడ మహిళలు మంట చుట్టూ ఒక వలయాకారంలో ఒకరి చేయి ఒకరు పట్టుకొని నృత్యం చేస్తారు

చెక్కభజన
చెక్కలతో చేసే భజన, దీనిని శ్రీరామలీలలు, శ్రీకృష్ణ లీలలు ఇతర పౌరాణిక గాధలతో ప్రదర్శిస్తారు.
గురువు మధ్యలో ఉండి పాటను ఎత్తుకుంటాడు, కళాకారులు వంత పాడుతారు
ఇది సామూహిక నృత్యం సాధారణంగా శ్రీరామనవమి రోజున ఇది గ్రామ గ్రామాన ప్రదర్శిస్తారు

చెంచు నాటకం
పండుగల సమయంలో గ్రామ దేవాలయం యందు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు
చెంచుల యొక్క పెళ్లిళ్లు మరియు ఇతర సాంప్రదాయ ఉత్సవాల సందర్భంగా ఎవరైతే నాటకం వేయమని కోరతారో వారి ఇంటి ముందు ప్రదర్శిస్తారు
నాటకం ప్రారంభమయ్యే ముందు చెంచమ్మ దేవతను తలుచుకుంటారు

పండరి భజన
పండరి పురంలోని పాండురంగని కీర్తిస్తూ చేసే భజన
పసుపు పచ్చని జెండా పట్టుకొని ప్రదర్శిస్తారు
ఇది సామూహిక నృత్యం

పేరిణి తాండవ నృత్యం
ఈ నాట్యం వీర నాట్య శైలికి చెందినది
వీరావేశంతో ఈ నృత్యం ఉంటుంది

గురవయ్యలు
కురుమలలో వంశానికి ఒకరు చొప్పున గొరవయ్యలుగా మారతారు
చేతిలో డమరుకం, మరో చేతితో పుల్లకొయ్యతో నల్లటి కంబళి కప్పుకొని, మెడలో గవ్వల దండ తో నాట్యం చేస్తారు

బీరప్ప డొల్లలు
పెద్దడోలును నడుముకు తగిలించుకొని నాట్య విన్యాసాలు చేస్తారు
కుడుములు ప్రదర్శిస్తారు

ఒగ్గుడోలు
తెలంగాణ ప్రాంతంలో ఒగ్గు వారు ప్రదర్శించే ప్రదర్శన ఒగ్గుడోలు
ఒగ్గు కథ చెప్పే కళాకారులే ఎక్కువగా ఈ డోలు విన్యాసాలు ప్రదర్శిస్తారు
పల్టీలు కొట్టడం, గుండ్రంగా తిరగడం, ఒకరిమీద ఒకరు ఎక్కడం ద్వారా విన్యాసాలు నృత్యాలు ప్రదర్శిస్తారు

రేల నృత్యం
దీనిని రేలాటని అంటారు. కోయతెగలో మహిళలు ఈ నృత్యం చేస్తారు

డప్పు నృత్యం
డప్పు చర్మ వాయిద్యం మాదిగల వంశపారంపర్యంగా ఉంది
దీన్నే తప్పెట, కనక తప్పెట, పలక, డప్పు అని వ్యవహరిస్తారు
ఈ వైద్యం మీద 'జగ్ నకన్' అనే శబ్దంతో రకరకాల కొడతారు

మరగాళ్లు
కాళ్లకు మరల సాయంతో ఎత్తుగా ఉండేలా కట్టుకుంటారు
10 అడుగుల మనిషిగా మారి డప్పు గతికి అనుగుణంగా అడుగులు వేయడం కనిపిస్తుంది

మదిలి
మొహరం (పీర్ల పండుగ) రోజున మదిలీ తొక్కుతారు
గుండం చుట్టూ తిరుగుతూ, తప్పెట దరువుకు అనుగుణంగా అడుగులు వేయడం దీనిలో ప్రత్యేకం
గుండం కోపు డప్పుమీద కొడుతుండగా మదిలి నృత్యాన్ని తొక్కటం ఆచారం

Post a Comment

2Comments

  1. Very useful syllabus

    ReplyDelete
  2. Really it was good & very useful information .. thanks for this information

    ReplyDelete
Post a Comment