మౌలిక సదుపాయాలు

TSStudies
0
మౌలిక సదుపాయాలు
హరితహారం 3వ విడత: 
ప్రారంభించిన తేదీ 12 జూలై 2017 
ప్రారంభించిన ప్రదేశం - కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యామ్ వద్ద 
ప్రారంభించిన వారు - ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు 
అటవీ శాఖ లెక్కల ప్రకారం మూడో విడతలో నాటిన మొక్కలు - 7.67 కోట్లు 
మూడవ విడతలో అత్యధికంగా మొక్కలు నాటిన జిల్లా - నిజామాబాద్ (72 లక్షలు) 
జిల్లా లక్ష్యసాధనలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా - కామారెడ్డి (42.71% మొక్కలు నాటారు)

తెలంగాణకు హరితహారం లక్ష్యాలు విజయాలు 
నినాదం: కోతులు వాపస్ పోవాలి, వానలు వాపస్ రావాలి 
రాబోయే మూడు సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలు నాటాలి. ఇందులో అటవీ ప్రాంతంలో వంద కోట్లు,  అటవేతర ప్రాంతాలలో 120 కోట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్  అథారిటీ ప్రాంతంలో 10 కోట్లు 
పచ్చదనాన్ని ప్రస్తుతం ఉన్న 24% నుండి 33% కి పెంచటం 
మొక్కలు నాటడం వీలుగాని చోట విత్తన బంతులు (సీడ్ బాల్స్) చల్లటం 
మొక్కల సంరక్షణ కోసం హరిత సైన్యాల (గ్రీన్ బ్రిగేడియర్) ఏర్పాటు 
గత 2 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 47.53 కోట్ల మొక్కలు నాటబడ్డాయి 
ఈ సంవత్సరం 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది 
ఇప్పటివరకు 81 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. ఈ ఏడాది మరో 40 కోట్ల మొక్కలు నాటడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు Rs.1,166 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది

నోట్: 8 జులై 2016 రెండవ దశను నల్గొండ జిల్లా గుండ్లపల్లి లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు 
హరితహారం మొదటి దశ 3 జులై 2015న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద సీఎం కేసీఆర్ ప్రారంభించారు 
తెలంగాణకు హరితహారం అనేది మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం

తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్):
రాష్ట్రంలోని 13 జిల్లాలను కలుపుతూ 880 కిలోమీటర్ల మేర బంగారు వలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు కలవు 
ఈ వలయాన్ని కామారెడ్డి, సిరిసిల్ల, నల్గొండ, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా ఏర్పాటు చేయనున్నారు 
రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతూ కారిడార్ రూపొందించనున్నారు అదిలాబాద్-జగిత్యాల-పెద్దపల్లి-జనగామ-నల్గొండ-హైదరాబాద్ నాగర్ కర్నూల్ మార్గాలను అనుసంధానించ నున్నారు
మెదక్-జనగాం-హనుమకొండ-కొత్తగూడెం మార్గాలను కలుపుతూ తూర్పు,పడమర కారిడార్ గా అభివృద్ధి చేస్తారు. పై రెండు కలిపి 1069 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. 
సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తెలంగాణకు అనుసంధానం చేసేలా బంగారుమాల కారిడార్ ను రూపొందించనున్నారు 
ట్రాక్ లో చేపట్టే మార్గాలు బంగారువలయం 986 కిలోమీటర్లు, బంగారు మాల 1534 కిలోమీటర్లు, ఉత్తర-దక్షిణ కారిడార్ 558 కిలోమీటర్లు, తూర్పు-పడమర కారిడార్ 511 కిలోమీటర్లు, ప్రగతి మార్గాలు రేడియల్ రోడ్స్ 1816 కిలోమీటర్లు. 

జిల్లా జ్ఞాన ఆవిష్కరణ కేంద్రాలు (డిస్టిక్ నాలెడ్జ్ ఇన్నోవేషన్ సెంటర్): 
జిల్లా పై సమగ్ర సమాచారంతో పాటు అధ్యయనం, విశ్లేషణ, కార్యాచరణకు ఇది ఉపయోగపడుతుంది 
ప్రతి జిల్లాపై జిల్లా యంత్రాంగానికి అవగాహన కల్పించడం దీని ఉద్దేశం 
సభ్యులు ప్రాంతీయ శాస్త్రవేత్త, సమన్వయ అధికారి, ఐటీ శాఖ జిల్లా మేనేజర్ 
విధులు: సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సమాచారాన్ని విశ్లేషిస్తుంది 
వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి వాటిని నమోదు చేస్తుంది 
పథకాల అమలులో లోటుపాట్లను, జిల్లాలోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపిస్తుంది 
జిల్లాకు ఆలోచన విధిగా ఉపయోగపడుతుంది 
వికేంద్రీకరణ, అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తుంది 
జిల్లా ప్రణాళికల తయారీకి ఉపయోగపడుతుంది

Post a Comment

0Comments

Post a Comment (0)