చందమామ కథలు-విత్తనం గింజ
ఆరో తరగతి చదివే కిరణ్ ఆ రోజు బడికి రాలేదు. ప్రతిరోజూ నియమం తప్పక బడికి వచ్చే కిరణ్ ఆ రోజు ఎందుకు రాలేదో మాధవయ్య పంతులు గారికి అర్థం కాకు మిగతా పిల్లల్ని ఆరా తీశాడు. అందరూ తమకు తెలియదనే సమాధానం ఇచ్చారు.
ఆ మరునాడు కూడా కిరణ్‌బడికి రాలేదు. కారణం ఏమై ఉంటుందో కనుక్కుందామని బడి వదలగానే మాధవయ్య కిరణ్ ఇంటికి దారితీశాడు.
కిరణ్ తండ్రి సూరయ్య ఆ గ్రామంలో పేరుకు రైతే గానీ, ఉన్న ఒక ఎకరంలో వచ్చే ఫలసాయం అంతంత మాత్రమే. భార్యా భర్తలిద్దరూ మిగతా రైతుల పొలాల్లో కూలీలుగా పనిచేస్తారు. పోయిన సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక కరువు పరిస్థితులు ఏర్పడిన. వాళ్ళ రెక్కల కష్టంతో అప్పు దీర్చడం మాట దేవుడెరుగు వడ్డీలు కట్టలేక పూట గడవని కష్టమొచ్చిపడింది. కిరణ్‌ని పశులు కాయడానికి పంపితే తిండి గింజలు కొలుస్తానని భుజంగం చెప్పడంతో గత్యంతరం లేక సూరయ్య కొడుకును ఆ పనిలోకి పంపాడు.
ఆ విషయం మాధవయ్య చెవిన పడగానే ఆయనకు కోపం వచ్చింది. ఎందుకంటే కిరణ్ చాలా తెలివైనవాడు. తరగతిలో ఎప్పుడూ అందరికంటే ముందుంటాడు. కష్టపడి చదువుకుంటే వాడు భవిష్యత్తులో గొప్పవాడవుతాడని మాధవయ్య నమ్మకం.
మాధవయ్య వెళ్లేసరికి సూరయ్య ఇంటి ముందు పెద్దగొడవగా ఉంది. సూరయ్యకు అప్పు ఇచ్చిన పెద్దమనిషి రెండు మూడు నెలలుగా వడ్డీ చెల్లించడం లేదేమిటని అతన్ని నిలదీస్తున్నాడు. రెండు మూడు రోజుల్లోగా సర్ధుబాటు చేస్తానని సూరయ్య అతడిని బతిమాలుకుంటున్నాడు. మాధవయ్య అక్కడికి రావడం చూస్తూనే ఆ పెద్దమనిషి “రెండు రోజుల తర్వాతే వస్తాను,” అంటూ అక్కడి నుండి వెల్లిపోయాడు. సూరయ్య మాధవయ్యకు నమస్కరించి, కూర్చోబెట్టి కుశల ప్రశ్నలడిగాడు. మాధవయ్య సూరయ్య మర్యాదలను పట్టించు కోకుండా “కిరణ్ ఎక్కడ?” అని సూటిగా అడిగాడు.
సూరయ్య మాట్లాడలేదు. మాధవయ్య వంక చూసే ధైర్యం లేక నేలచూపులు చూడసాగాడు. మాధవయ్యను గద్దించి అడిగిన మీదట సూరయ్య మెల్లగా పెదవి విప్పాడు. ఏ పరిస్థితుల్లో తన కొడుకును భుజంగం దగ్గర పనిలో పెట్టాడో వివరించాడు.
మాధవయ్య కోపం ఎక్కువైంది. “కిరణ్ గురించి మీకు తెలుసా? బాగా చదువుకుని రేపు వాడు ఎంత గొప్ప వాడవుతాడో తెలుసా? వాడిని పనిలో పెట్టి చాలా తప్పు చేశావు సూరయ్యా! అసలు చిన్నపిల్లవాడిని పనిలో పెట్టడం నేరం.. తెలుసా?” అన్నాడు.
“తెలియదయ్యా!..... ఆకలి తప్ప మా కేమీ తెలియదు. రేపటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం పూట గడవటం లేదు,” స్థిరంగా అన్నాడు సూరయ్య.
తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి తెలియచేసి కిరణ్‌ని ఎందుకు పనిలో పెట్టవలసివచ్చిందో మాధవయ్యకు పూస గుచ్చినట్లు వివరించాడు సూరయ్య. మాధవయ్య రకరకాల ఉదాహరణలతో ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కాని సూరయ్య నిర్ణయంలో మార్పు లేదు. చివరికి తాను కొంత ఆర్థిక సహాయం చేస్తానని, కిరణ్‌ని పనిమానిపించి బడికి పంపమని అడిగాడు. కాని సూరయ్య అందుకు ఒప్పుకోలేదు.
చేసేది లేక నిస్సహాయంగా వెనుదిరుగ బోతున్న మాధవయ్యకు వసారాలో పై అరుగు మీద కొన్ని ధాన్యపు బస్తాలు కనిపించాయి. వెంటనే “అవేమిటి?” అని సూరయ్యను అడిగాడు. “విత్తనం కోసం దాచిన ధాన్యం అయ్యగారూ!” అన్నాడు సూరయ్య.
ఎంత ఆకలికైనా ఓర్చుకుంటాడు కానీ రైతు విత్తనం కోసం దాచిన ధాన్యం ఏ పరిస్థితుల్లోనూ తిండికి ఉపయోగించడు. సూరయ్యను ఒప్పించడానికి మాధవయ్యకు మరొక మార్గం దొరికినట్లయింది. “పూట గడవటం లేదు అంటున్నావే అక్కడ అన్ని బస్తాల ధాన్యం ఉంది, వండుకొని తినొచ్చు కదా!” అన్నాడు సూరయ్యతో.
“మీకు తెలియంది ఏముంది అయ్య గారూ! అది విత్తనం కోసం దాచిన ధాన్యం. దాన్ని తింటే రేపు తొలకరికి చేలో విత్తనం ఏమి వేస్తాము?” అన్నాడు సూరయ్య. అంతలో పశువులు కాయడానికి పోయిన కిరణ్ ఇంటికి వచ్చాడు.
మాధవయ్య వాడిని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ, సూరయ్యను అతడి భార్యను కూర్చోమని చెప్పి, హితవు పలికాడు. “చూడు సూరయ్యా! పిల్లలు పుట్టగానే వాళ్లు మనకే సొంతమనే భ్రమలో ఉంటాం. దాదాపు వాళ్లను మన ఆస్థిలో భాగంగా భావిస్తాం. వాస్తవానికి పిల్లలు జాతీయ ఆస్థులు. ఒక ఎకరం పొలమున్న నీవే విత్తనం గింజల్ని ఇంట్లో ఇంత జాగ్రత్త చేస్తున్నావే... మరి జాతీయ ఆస్తులైన ఈ పిల్లలు కూడా విత్తనంలాంటివారే వారిని మరెంత జాగ్రత్తగా పోషించాలి? నువు పొలంలో విత్తనం వేస్తే మొలిచే మొక్క ఏం కాయ కాస్తుందో నీకు ముందే తెలుస్తుంది. కానీ ఈ పిల్లలనే మొక్కలు పెరిగి పెద్దవారై జాతికి ఎటువంటి ఫలాలు అందిస్తారో మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం. నీ కొడుకు చదువుకుంటే చాలా గొప్ప వాడవుతాడు. నీవు ఎందుకు వాడికి కిరణ్ అని పేరు పెట్టావో కానీ వాడు రేపు నీ కుటుంబానికే కాదు మానవ జాతికే వెలుగవుతాడు. వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది. నా మాటవిని రేపటి నుండి వాడిని బడికి పంపించు.”
ఆ మాటతో సూరయ్య మెత్తబడ్డాడు. అతని మనసు సమాధానపడ్డది. భవిష్యత్తు పట్ల చిన్న ఆశ కలిగింది. తమకు ఎంత కష్టం కలిగినా పిల్లవాడిని పని మాన్పించి బడికి పంపాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. మాధవయ్య నమ్మకం వమ్ముకాలేదు. కిరణ్ బాగా చదువుకుని ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపి గురువులు, తల్లిదండ్రులు, ఆ గ్రామం యావత్తూ గర్వపడేలా, దేశానికే పేరు తెచ్చేంత గొప్పవాడయ్యాడు.