గిరిజన ఉద్యమాలు Girijana Udyamalu in Telangana
కొమరం భీమ్ (1901-1940 అక్టోబర్ 27)
కొమరం భీమ్ |
ఇతను ఆదిలాబాద్ గోండు తెగకు చెందిన వాడు.
ఇతను 15 సం॥ల వయసులో ఉన్నప్పుడు అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో ఇతని తండ్రి చనిపోయాడు. దీంతో కొమరం భీమ్ యొక్క కుటుంబం కరిమెర ప్రాంతంలో గల సరుడాపూర్ గ్రామానికి వలస పోయింది. అచ్చట కొంత భూమిని సాగు చేసుకుంటూ వీరు జీవితం కొనసాగించారు.
కరిమెర ప్రాంతంలో జమీందార్ అయిన సిద్దిఖీ యొక్క కన్ను కొమరం భీమ్ కుటుంబం సాగు చేనుకు భూమిపై పడింది. సిద్ధిఖీ తన అనుచరులమ పంపి ఆ సాగు భూమిని ఆక్రమించాడు
కరిమెర ప్రాంతంలో జమీందార్ అయిన సిద్దిఖీ యొక్క కన్ను కొమరం భీమ్ కుటుంబం సాగు చేనుకు భూమిపై పడింది. సిద్ధిఖీ తన అనుచరులమ పంపి ఆ సాగు భూమిని ఆక్రమించాడు
దీంతో ఆగ్రహించిన కొమరం ఖీమ్ సిద్దిఖీపై దాడి చేసి అతన్ని హతమార్చాడు. పోలీసులకు భయపడి తక్షణమే కొమరం భీమ్ కరిమెర ప్రాంతాన్ని విడిచిపెట్టి అస్సాంకు పారిపోయాడు. అస్సాంలోని కాఫీ, తేయాకు తోటల్లో 5 సం॥ల పాటు పనిచేశాడు. ఆ సమయంలో కొమరం భీమ్ బెంగాల్ విప్లవకారుల గూర్చి కథల రూపంలో వినేవాడు. విప్లవకారులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంతో బాగా ప్రభావితుడయ్యాడు. అప్పుడే అనేక రకాల ఆయుధాల ఉపయోగం గూర్చి కూడా తెలుసుకున్నాడు. 5సం॥లు అస్సాంలో గడిపిన కొమరం ఖీమ్ కరిమెర ప్రాంతానికి తిరిగివచ్చాడు.
ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు అనేక విధాలుగా దోచుకోబడు తున్నారు.
అడవుల యొక్క పట్టాలు జారీ చేయడంలో అటవీ ప్రాంతం ఒక కొనుగోలు, అమ్మకాల వస్తువుగా మారింది. దీంతో భూస్వాములు, ధనికులు, వడ్డీ వ్యాపారులు అడవులను కొనుగోలు చేసి పట్టాలు పొందేవారు. వీరు అడవుల్లోకి ప్రవేశించి గిరిజనులను మభ్యపెట్టి వారి భూములను హరించేవారు. వడ్డీ వ్యాపారులైతే బుణాలు ఇచ్చి భూములను కారుచౌక ధరలకు కొనుగోలు చేశారు. దీని ఫలితంగా గిరిజనులు కూలీ లుగా మారారు. తరతరాలుగా స్వేచ్చగా అనుభవిస్తున్న భూమిలో గిరిజనులు కౌలు దార్లుగా లేదా కూలీలుగా మారి, బానిస జీవితాన్ని గడుపుతున్నారు.
ప్రక్కనే ఉన్న మరాఠ ప్రాంతంలో రైతులు ఆదిలాబాద్‌లోకి ప్రవేశించి గోండుల భూములను ఆక్రమించసాగారు
నిజాం ప్రభుత్వం గిరిజనుల నుండి పుల్లరి, పశువుల కాపరి మొదలగు పేర్లతో పన్నులు వసూలుచేసేది.
నిజాం ప్రభుత్వం 1938-39లో సిర్పూర్ కాగిత పరిశ్రమను స్థాపించింది. దీని కొరకు సిర్పూర్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వేల ఎకరాల భూమిని తీసుకుంది. ఇచ్చట గిరిజనులను కూలీలు, కార్మికులుగా ఉపయోగించింది
పై కార్యకలాపాల కారణంగా ఆదిలాబాద్‌లో గోండులు చాలావరకు భూములను కోల్పోయారు. ఈ బహుముఖ దోపిడీతో విసుగు చెందిన గోండులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిని నడిపే నాయకుడు కావాలి. ఆ నాయకుడే కొమరం భీమ్ రూపంలో గోండులకు దర్శనం ఇచ్చాడు.
అస్సాంలో విప్లవకారుల గాధలు విన్న కొమరం భీమ్ ఇక గోండుల తరపున పోరాటం చేయుటకు కంకణం కట్టుకున్నాడు. ఆసిఫాబాద్ తాలూకాలోని బాబేర్సురి, జోడేఘాట్ గుట్టలు ఇతని పోరాటానికి కేంద్ర స్థానాలయ్యాయి.
కొమరం ఖీమ్ ప్రఖ్యాత “జల్, జంగిల్, జమీన్' మనది ఛలో ఛలో అనే నినాదాన్ని ఇచ్చాడు. స్థానిక గోండు తెగల వారిని ఏకం చేశాడు.
“జల్, జంగిల్, జమీన్ అనగా నీరు, అడవి, భూమి మనదే, వీటిపై పూర్తి హక్కు మన స్టానికులదే. మైదాన ప్రాంతాల నుండి వచ్చి మన భూములను, గుట్టలను ఆక్రమించుకున్న భూస్వాములు, ధనిక రైతులు, వడ్డీ వ్యాపారులు గోండుల నుండి ఆక్రమించుకున్న భూములను తిరిగి అప్పగించి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాడు.
ప్రభుత్వం కూడా పుల్లరి, పశువుల కాపరి సన్నులను వసూలు చేయడాన్ని ఖండించాడు.
పన్ను వసూలు అధికారులపై దాడులు చేశాడు.
భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, ధనిక రైతులపై కూడా దాడులు చేశాడు
దీంతో నిజాం ప్రభుత్వం శాంతిభద్రత సమస్య అనే పేరుతో పోలీసులను మన్యంలోకి పంపింది
కొమరం ఖీవ్ నాయకత్వంలోని గోండులు నిజాం పోలీసులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. పోలీసులను అటవీ ప్రాంతంనుండి తరిమికొట్టారు
దీంతో నిజాం ప్రభుత్వం 1939-40లో బాబేర్సురి, జోడేఘాట్ గుట్టల్లో కార్యకలా పాలు నిర్వహిస్తున్న కొమరం భీమ్‌ను అంతం చేయుటకు సైన్యాన్ని పంపింది
కొమరం భీమ్ అనుచరుల్లో ఒకడైన కుర్చుపటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 8న జోడేఘాట్ గుట్టల్లో కొమరం భీమ్ యొక్క రహస్య స్థావరాన్ని ముట్టడించింది.
నిజాం సైన్యం మరియు కొమరం భీమ్ యొక్క అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో సంఘర్షణ జరిగింది. కొమరం భీమ్ తన యుద్ధ చాతుర్యతను ప్రదర్శించి సైన్యాన్ని బాగా ప్రతిఘటించాడు. కానీ సైనికబలం అధికంగా ఉండుటచే కొమరం భీమ్ 1940 అక్టోబర్ 27న వీరమరణం పొందాడు.
గోండులు పవిత్రంగా భావించే అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ అసువులుబాసాడు.
నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదిలాబాద్ గోండుల పోరాటంతో ప్రభావితుడై వారి స్థితిగతులను హైమన్ దార్స్/హెమిండ్రాఫ్ అనే జర్మనీకి చెందిన మానవ శాస్రజ్ఞుడు (ఆంత్రోపాలజిస్ట్)చే అధ్యయనం చేయిం చాడు. గోండుల స్థితిగతుల గూర్చి హైమన్ దార్ తన “ట్రైబల్ హైదరాబాద్” అనే పుస్తకంలో వివరించాడు.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గోండుల జీవనశైలితో ప్రభావితుడై సుమారు లక్ష ఎకరాల భూమిపట్టాలను గోండులకు ఇచ్చాడు.
తెలంగాణ ప్రభుత్వం 2014 అక్టోబర్ 8న కొమరం భీమ్ యొక్క 74వ వర్ధంతిని ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ వద్ధ అధికారికంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొమరం ఖీమ్ పేరుపై 25 కోట్ల రూ॥లతో 100 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు.
రాంజీగోండ్
ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలువబడే 1857 తిరుగుబాటు కంటే ముందే బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటం చేనిన వీరుడు రాంజీగోండ్, కానీ చరిత్ర దీన్ని విస్మరించింది. వలస పాలకులు ఈ గోండు నాయకుడి పోరాటానికి కనీస ప్రాధాన్యత కూడా కల్పించలేదు.ఈ క్రమంలో గోండుల పాలన గూర్చి మనం తెలుసుకుందాం
గోండులు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆదిలాబాద్‌లో 530 సం॥లు పాలించారు
క్రీ.శ. 1220లో కోల్‌ఖిల్ గోండు రాజ్యాన్ని స్టాపించాడు. ఇతని రాజధాని ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్. ఇతను కాకతీయ గణపతిదేవునికి సమకాలీకుడు.
ఇతని తర్వాత వచ్చిన భీమ్ భల్లాల్ సింగ్ సిర్పూర్ లో బలమైన కోటను నిర్మించాడు.
దినకర్‌సింగ్ పాలనాకాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇతను సాహిత్యాన్ని బాగా పోషించాడు.
నూర్జ భల్లాల్‌సింగ్ ఢిల్లీ సుల్తానుల నుండి 'షా' అనే బిరుదు పొందాడు. ఇతని తర్వాత గోండు పాలకులు 'షా అనే పదాన్ని తమ పేరుకు జోడించుకునేవారు.
ఖండియా భల్లాల్ షా భల్లాల్‌పూర్ అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిని భల్లాల్‌పూర్/బల్డార్నా (మహరాష్ట్ర)కు మార్చాడు. తర్వాత ఇతను చంద్రపూర్ కోటను నిర్మించి రాజధానిని చంద్రపూర్‌కు మార్చాడు
నీలకంఠషాను గోండుల చివరి రాజుగా పేర్కొంటారు. ఇతను క్రీ.శ. 1750లో మరణించాడు
గోండు రాజ్యం చీలికకు గురైంది. కొంత ప్రాంతాన్ని మరాఠాలు ఆక్రమించుకొనగా మరికొంత ప్రాంతాన్ని అసఫ్‌జాహీలు ఆక్రమించుకున్నారు.
1818లో బ్రిటీష్‌వారు మరాఠా రాజ్యాన్ని ఆక్రమించారు. దీంతో గోండు ప్రాంతం బ్రిటీష్‌వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆదిలాబాద్ గోండు ప్రాంతం అసఫ్‌జాహీల ఆధీనంలో ఉండిపోయింది.
గత గోండు పాలకుల వారసులు తర్వాత కాలంలో భూస్వాములుగా కొనసాగారు. కొంతవరకు తమ ఆధీనంలో ఉన్న గ్రామాల్లో వారు స్వతంత్ర అధికారాన్ని చెలాయించేవారు.
రాంజీగోండ్ |
రాంజీగోండ్ పూర్తి పేరు మార్సికొల్లా రాంజీ (1836-60)
రాంజీగోండ్ నిర్మల్‌ను తన ఆధీనంలోకి తీసుకొని నిర్మల్‌ను తన రాజధానిగా ప్రకటించుకున్నాడు.
బ్రిటీష్‌వారు గోండువారిచే వెట్టిచాకిరీ చేయించేవారు. గోండులను అనేక విధాలుగా హింసించేవారు. దీన్ని రాంజీగోండ్ తీవ్రంగా ఖండించాడు.
రాంజీ గోండ్ నాయకత్వంలో సాగుతున్న తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలుకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజన ప్రాంతం.
రాంజీ గోండ్ నాయకత్వంలో తిరుగుబాటు త్రీవతరం అవుతున్న తరుణంలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేయడానికి మరియు రాంజీను అంత మొందించేందుకు ప్రత్యేక అధికారి కల్నల్ రాబర్జ్‌ను నియమించింది.
ఈ తిరుగుబాటు తుది కీలక ఘటం 1860 మార్చి, ఏప్రిల్ నెలల్లో చోటుచేసుకుంది.
1860 ఏప్రిల్ 9న రాంజీ గోండ్ నిర్మల్‌లో ఉన్న అటవీ ప్రాంతాలలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న కల్నల్ రాబర్ట్ పెద్ద ఎత్తున బ్రిటీష్ సైన్యాన్ని మొహరించి దాడులు జరిపాడు.
బ్రిటిష్ వారి ఆధునిక ఆయుధాలు (తుపాకీ) ధాటికి అనేక అమాయక గోండు ప్రజలు చంపబడ్డారు.
ఈ పోరాటంలో వీరోచితంగా ఎదిరించి పోరాడుతూ రాంజీ తీవ్రంగా గాయ పడ్డాడు. రాంజీ గోండ్‌తో సహా మరో వెయ్యి మంది గిరిజనులను బ్రిటీష్ వారు బంధించారు.
1860 ఏప్రిల్ 9న నిర్మల్ ఖజానా చెరువు దగ్గర ఉన్న మర్రి చెట్టుకు రాంజీ గోండ్‌ను ఉరితీశారు. అతనితో పాటు మరో 1000 మంది గోండు వీరులను నిర్ధాక్షిణ్యంగా అదే మర్రి చెట్టుకు ఉరితీశారు.
అప్పటినుండే ఆ మర్రి చెట్టుకు వెయ్యి ఉరుల మర్రి చెట్టు అని పేరొచ్చింది.
తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రిచెట్టును తర్వాత కాలంలో 1995లో నరికి వేశారు.
రాంజీ గోండ్ నాయకత్వంలో సాగిన ఇంతటి వీరోచిత పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారు.
జలియన్ వాలాబాగ్ దురాగతానికి కారణమైన జనరల్ డయ్యర్ గురించి ప్రపంచానికి తెలుసు కానీ సుమారు 1000 మంది అమాయక గిరిజన సమూహాన్ని నిర్దాక్షిణ్యంగా ఉరివేసి చంపిన కర్కశుడైన కల్నల్ రాబర్జ్ గురించి చాలామందికి తెలియదు.