రాజ్యాంగ పరిషత్ నిర్మాణం (Making of the Constituent Assembly)
కేబినెట్ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం ఇతర ప్రక్రియలను నిర్ణయించడం జరిగింది. 1946 జులై, ఆగస్టులో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.
ప్రతి ప్రొవిన్స్ నుండి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు.
బ్రిటీష్ పాలిత ప్రాంతాలలో మూడు ప్రధాన వర్గాలైన మహమ్మదీయులు, సిక్కులు, జనరల్ క్యాటగిరి వారికి జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు.
రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389
ఇందులో 292 మంది బ్రిటీష్ ఇండియా నుండి ఎన్నికవుతారు. వీరిని బ్రిటీషు పాలిత ప్రాంతాలు లేదా గవర్నర్ ప్రొవిన్స్‌ల నుండి ఎన్నికైన శాసనసభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు. ఆనాటికి మొత్తం 11 ప్రొవిన్స్‌లు ఉండేవి. అవి మద్రాసు, బాంబే, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఒరిస్సా, పంజాబ్, నార్త్ వెస్ట్ ప్రాంటియర్ ప్రొవిన్స్, సింధ్, బెంగాల్ మరియు అస్సాం.
93 మంది ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల నుండి నామినేట్ అవుతారు.
4 గురు సభ్యులను చీఫ్ కమీషనర్ ప్రాంతాలయిన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్ మరియు బ్రిటీష్ బెలూచిస్థాన్ నుండి తీసుకున్నారు.
రాజ్యాంగ పరిషత్తులో రాష్ట్రాలవారిగా ప్రాతినిధ్యం వహించిన సభ్యులు (డిసెంబర్ 1947 నాటికి) .
ఇండియన్ ప్రావిన్స్‌లు | సభ్యులు |
యునైటెడ్ ప్రావిన్స్ | 55 |
మద్రాస్ ప్రావిన్స్ | 49 |
బీహార్ ప్రావిన్స్ | 36 |
బాంబే ప్రొవిన్స్ | 21 |
బెంగాల్ ప్రొవిన్స్ | 19 |
ఈస్ట్ పంజాబ్ ప్రావిన్స్ | 12 |
సి.పి అండ్ బేగర్ ప్రావిన్స్ | 17 |
ఒరిస్సా | 9 |
అస్సాం | 8 |
ఢిల్లీ | 1 |
అజ్మీర్ & మేవార్ | 1 |
కూర్గ్ | 1 |
మొత్తం | 229 |
స్వదేశీ సంస్థానాలు | సభ్యులు |
ట్రావెన్‌కోర్ | 55 |
మైసూర్ | 49 |
గ్వాలియర్ | 36 |
బరోడా | 21 |
సెంట్రల్ ఇండియా స్టేట్స్ | 19 |
ఈస్ట్ రాజ్‌పుతానా స్టేట్స్ | 12 |
వెస్ట్రన్ ఇండియా స్టేట్స్ గ్రూప్ | 17 |
పంజాబ్ స్టేట్స్ గ్రూప్ | 9 |
అల్వాల్ | 8 |
భోపాల్ | 1 |
బికనీర్ | 1 |
కొచ్చిన్ | 1 |
జైపూర్ | 3 |
జోధ్ పూర్ | 2 |
కొల్హాపూర్ | 1 |
కోట | 1 |
మయూర్ భంజ్ | 1 |
పాటియాలా | 2 |
రేవా | 2 |
సిక్కిం మరియు కూచ్ బెహార్ గ్రూప్ | 1 |
త్రిపుర, మణిపూర్, ఖాసీ స్టేట్స్ | 1 |
యు.పి స్టేట్స్ గ్రూప్ | 1 |
గుజరాత్ స్టేట్స్ గ్రూప్ | 2 |
డెక్కన్ & మద్రాస్ స్టేట్ గ్రూప్ | 2 |
ఈస్ట్రన్ స్టేట్ గ్రూప్-1 | 4 |
ఈస్ట్రన్ స్టేట్ గ్రూప్-2 | 3 |
రెసిడెన్సీ స్టేట్ గ్రూప్ | 4 |
మొత్తం | 70 |
బ్రిటిష్ ప్రావిన్స్‌లు 229 + స్వదేశీ సంస్థానాలు 70 = 299
రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో ఆనాడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. అవి సాధించుకున్న స్థానాలు
జాతీయ కాంగ్రెస్ | 208 |
ముస్లిం లీగ్ | 73 |
యూనియనిస్ట్ | 1 |
యూనియనిస్ట్ ముస్లిం | 1 |
యూనియనిస్టు షెడ్యూల్డ్ క్యాస్ట్ | 1 |
కృషిక్ ప్రజా | 1 |
షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ | 2 |
సిక్కు నాన్‌కాంగ్రెస్ | 1 |
స్వతంత్ర కమ్యూనిస్టులు
| 8 |
మొత్తం | 296 |
మతాలు, సామాజిక వర్షాలు వారిగా సభ్యుల సంఖ్య
హిందువులు | 160 | దళితులు | 33 |
క్రిస్టియన్స్ | 7 | మహిళలు | 15 |
సిక్కులు | 5 | పారసీలు | 3 |
ఆంగ్లో ఇండియన్‌లు | 3 | ముస్తింలు | 3 |
ప్రత్యేక వివరణ
“ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండుతో భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి నిష్క్రమించింది. దరిమిలా దేశ విభజన జరగఢం చేత, రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299 కి తగ్గింది. ఇందులో బ్రిటీషు పాలిత ప్రాంతాలనుండి 229 మంది ఎన్నికైన సభ్యులు, స్వదేశీ.సర్వస్టానాల నుండి 70 మంది సభ్యులు కలిపి రాజ్యాంగసభలో స్థానాలు 299 కి కుదించడం జరిగింది.”
గమనిక: బెంగాల్ నుండి ఎంపికైన డా॥ బి.ఆర్.అంబేద్కర్ దేశ విభజన తరువాత తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. బాంబే రాష్ట్రం. నుండి రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ చేయబడ్డారు.
రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ వర్గాలలోని ప్రముఖులు
ముస్లింలు | మౌలానా అబుల్‌కలామ్ ఆజాద్, సయ్యద్ సాదుల్లా |
సిక్కులు | సర్దార్ బలదేవ్‌సింగ్, హుకుం సింగ్ |
మైనారిటీలు | హెచ్.సి. ముఖర్జీ |
యురోపియన్లు | ఫ్రాంక్ ఆంథోని |
అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు | డా॥ బి.ఆర్.అంబేద్కర్ |
కార్మిక వర్గాలు | బాబు జగ్‌జీవన్‌రామ్ |
పారసీలు | హెచ్.పి. మోడి |
అఖిల భారత మహిళా సమాఖ్య | హన్సా మెహతా |
హిందు మహాసభ | డా॥ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎమ్.ఆర్. జయకర్ |
మహిళా సభ్యులు
దుర్గాభాయ్. దేశ్‌ముఖ్, రాజకుమారి _అమృత్ కౌర్, విజయలక్ష్మి పండిత్, శ్రీమతి సరోజిని నాయుడు, హన్సా మెహతా, అమ్ము స్వామినాథన్, ఆనే మాస్మార్నె నాథ్, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయణి వేలాయుధన్, కమలా చౌదరీ, లీలా రే, మాలతి చౌదరి, పూర్ణిమ బెనర్జీ, రేణుకా రే, సుచిత్రా కృపలాని మొదలగువారు.
రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన తెలుగువారు - టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కళా వెంక్రటావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్.జి. రంగా, వి.సి. కేశవరావు. ఎమ్. తిరుమలరావు, బొబ్బిలి రాజ రామకృష్ణ రంగారావు.