History of Kakatiya Dynasty కాకతీయులు 4

TSStudies
గణపతి దేవుడు (క్రీ.శ. 1199 - 1162)
ఇతను అత్యధికంగా 63 సంవత్సరాలు పరిపాలించాడు 
యాదవ రాజు జైతూగి కాకతీయ రాజ్యంపై దాడి చేసి అప్పటి పాలకుడైన మహాదేవుని హతమార్చి వారసుడైన గణపతిదేవుణ్ణి తనతోపాటు దేవగిరికి తీసుకొనిపోయాడు. దీనితో కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడింది. 
మహాదేవుని సైన్యాధిపతి అయిన రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని సంక్షోభం నుండి కాపాడాడు. దీనితో అతనికి కాకతీయ రాజ్యభార దౌరేయుడు, కాకతీయ రాజ్య సమర్థుడు అనే బిరుదులు ఇవ్వబడ్డాయి. 
దేవగిరిలో గణపతి దేవుని మేథస్సు ను చుసిన జైతూగి అతన్ని విడుదల చేశాడు. 
గణపతి దేవుడు విడుదలలో జైతూగి కుమారుడు సింగనుడు సహకరించాడు. 
క్రీ.శ. 1199 లో గణపతి దేవుడు కాకతీయ పాలకుడు అయ్యాడు. 
ఇతను రేచర్ల రుద్రుని సహాయంతో కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. 

ఇతను అనేక దండ యాత్రలు చేశాడు అందులో ముఖ్యమైనవి 
నెల్లూరు
నెల్లూరు ప్రభువు 1వ మనువసిద్ధి మరణాంతరం అతని కుమారుడు తిక్కసిద్ధి నెల్లూరు ప్రభువు అవ్వడానికి సహకరించాడు. దీనికి గాను తిక్కసిద్ధి గణపతి దేవునికి పాకనాటిని అనే గ్రామాన్ని ఇచ్చాడు. గణపతి దేవుడు పాకనాటిని పాలించుటకు గంగా సాహిణి ని పంపాడు. 
తిక్కసిద్ధి మరణాంతరం విజయగొండ గోపాలుడు ఇతరుల సహాయంతో నెల్లూరు ప్రభువు అయ్యాడు. దీనితో తిక్కసిద్ధి కుమారుడైన 2వ మనుమసిద్ధి ఆస్థానకవి తిక్కన గణపతి దేవుడిని కలిసి తన రాజు తరుపున సహాయం కోరాడు 

దీనితో గణపతి దేవుడు సామంత భోజుడిని నెల్లూరుకు పంపాడు. సామంత భోజుడు వలయూర్ యుద్ధంలో విజయగొండ గోపాలుడిని ఓడించి 2వ మనుమసిద్దిని నెల్లూరు ప్రభువుగా చేశాడు. 
దీనికి గాను 2వ మనుమసిద్ధి గణపతి దేవుడికి మోటుపల్లి ఓడరేవుని ఇచ్చాడు. గణపతి దేవుడు మోటుపల్లి ఓడ రేవుని అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధిపరచి విదేశీ వరకుల కొరకు అనేక నియమ నిబంధనలతో మోటుపల్లి అభయ శాసనాన్ని రుపొందించాడు. మోటుపల్లిలో అభయ శాసనమును అమలుపరుచుటకు సిద్దయ్యదేవున్ని పంపాడు.

తీరాంధ్ర:
తీరాంధ్రలోని దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించుటకు ముత్యాల చౌదరాయుడు ని పంపాడు
ఇతను తీరాండ్రను పాలిస్తున్న అయ్య వంశానికి చెందిన పినచోడిని ఓడించి, దీపి లుంటాక, దీవి చూరకార అనే బిరుదులు పొందాడు.
పినచోడి ఓటమి అనంతరం తన కుమార్తెలు అయినా నూరంబ, పెరంబలను గణపతిదేవునికిచ్చి వివాహం చేశాడు.
పినచోడి కుమారుడైన జాయపసేనాని కాకతీయ గజ దళపతిగా నియమించబడ్డాడు.
జాయపసేనాని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనే గ్రంధంలులను సంస్కృత్రములో రచించాడు.

కళింగ
కళింగ ఆక్రమణ కొరకు రేచర్ల రాజానాయకుడు, చోడ భీముడు అనే సేనాపతులు పంపబడ్డారు. వీరు కళింగ రాజు అయిన గోదుమర్రటిని ఓడించి గంజాం, ఉదయగిరి, బస్తర్ ప్రాంతాలను ఆక్రమించారు.

ఈ విధంగా గణపతి దేవుడు మొత్తం ఆంధ్రదేశంలో పాటు దక్షిణ ఒరిస్సా, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ప్రాంతాలను కూడా పాలించాడు.
రేచర్ల రుద్రుడు పాలంపేటలో 1213లో రామప్పగుడిని నిర్మించాడు.
రామప్పగుడి ఏకశిలా కోవకు చెందుతుంది.
గణపతి దేవుని రథ దళాధిపతి 'గంగయ్య సేనాని'
గంగయ్య సేనాని యొక్క బిరుదులు - మాండలిక బ్రహ్మరాక్షస, రక్కశ గంగ, గండపెండేర
గణపతి దేవుడు ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా నిర్మించి రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చాడు. ఓరుగల్లు కోటను ఏడు మట్టి కోటల నగరమని కూడా అంటారు.
ఇతను ఓరుగల్లులో స్వయంభూ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు (దీనిని ప్రారంభించింది 2వ ప్రోలరాజు)

ఇతను రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను త్రవ్వించాడు.
పాండ్యరాజు జటావర్మ సుందరపాండ్య ముత్తుకూరు యుద్ధంలో నెల్లూరు ప్రభువు అయిన 2వ మనువసిద్ధిని హతమార్చాడు
కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ముత్తుకూరు యుద్ధంలోనే గణపతి దేవుడు కూడా హతమార్చబడ్డాడు.

ఇతనికి ఇద్దరు కుమార్తెలు:
రుద్రమాంబ / రుద్రమదేవి (భర్త చాళుక్య వీరభద్రుడు)
గణమాంబ (భర్త బేతరాజు)


<<<<<Previous                  Continue>>>>>


Tags: History of Kakatiya Dynasty in telugu, great empire of Kakatiya Dynasty, telangana history Kakatiya Dynasty, indian history Kakatiya Dynasty, Kakatiya Dynasty ganapati deva history, tspsc Kakatiya Dynasty study material in telugu,appsc notes in telugu,ap constable notes in telugu, ap si of police notes in telugu, appsc groups notes in telugu, tspsc groups notes in telugu