History of Kakatiya Dynasty కాకతీయులు 3

TSStudies
రుద్రదేవుడు / 1వ ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1158 - 1196)
కళ్యాణి చాళుక్యులు బలహీన మవ్వడంతో రుద్రదేవుడు హనుమకొండలో పూర్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. 
ఇతను పూర్తి స్వతంత్ర పాలన చేసిన మొదటి కాకతీయ రాజు 
ఇతను హనుమకొండ శాసనం, గణ పాంప గణపవరం శాసనాలు వేయించాడు 
ఈ రెండు శాసనాల్లో తన తండ్రి 2వ ప్రోలరాజు యొక్క విజయాల గురుంచి వివరించాడు. 
హనుమకొండ శాసనాన్ని అచింతేంద్రుడు లిఖించాడు. 
రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు 
ఇతను ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా నిర్మించి రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చాడు. 
రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చినది 'గణపతిదేవుడు'
ఇతను ఉదయచోడుడు కుమార్తె పద్మావతిని వివాహమాడిన సందర్భంగా రుద్రసముద్ర తటాకం అనే చెరువును త్రవ్వించాడు. 
ఇతను సంస్కృతంలో నీతిసారం అనే గ్రంధాన్ని రచించాడు. 
ఇతను విద్యాభూషణ అనే బిరుదును పొందాడు. 
క్రీ.శ. 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో ఇతను నలగామరాజు కు మద్దతు తెలిపాడు 
ఇతనికి రాజ్యపాలనలో గంగాధరుడు అనే మంత్రి సహకరించాడు. దీనితో రుద్రదేవుడు గంగాధరుడుని సబ్సి మండలానికి నాయకుడిని చేశాడు. 
గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. 
రుద్రదేవుని యొక్క సేనాని 'కోట సేనాని. ఇతనికి కోటగెల్వటా అనే బిరుదు కలదు. 
ఇతని కాలంలోనే యాదవులు దేవగిరి వద్ద పూర్తి స్వతంత్ర పాలన ప్రారంభించారు. 
యాదవ రాజు జైతూగి రుద్రదేవుడుని హతమార్చాడు. 

మహాదేవుడు (క్రీ.శ. 1196 - 1199)
రుద్రదేవునికి సంతానం లేని కారణంగా అతని తమ్ముడైన మహాదేవుడు పాలకుడయ్యాడు. 
మహాదేవునికి గణపతిదేవుడు అనే కుమారుడు, మైలాంబ, కుదంబిక అనే కుమార్తెలు కలరు. 
తన ఇద్దరి కుమార్తెలను నతవాడి పాలకులైన ఒక్కలిక (మైలాంబ), మొదటి రుద్రుడు (కుందాంబిక ) కు ఇచ్చి వివాహం చేశాడు. 
ఇతని శైవ మత గురువు 'దృవేశ్వర పండితుడు'
యాదవ రాజు జైతూగి కాకతీయ రాజ్యంపై దండెత్తి మహాదేవుడిని కూడా హతమార్చాడు. 

<<<<<Previous                              Continue>>>>>


Tags: History of Kakatiya Dynasty, telangana history Kakatiya Dynasty notes in telugu,tspsc Kakatiya Dynasty, appsc Kakatiya Dynasty notes in telugu, Kakatiya Dynasty empires list in telugu, ancient history of Kakatiya Dynasty, Kakatiya Dynasty rudradeva king history, Kakatiya Dynasty mahadeva king history, Kakatiya Dynasty bit bank in telugu