మొహర్రం ఇస్లాం పంచాంగంలో మొదటి నెల. యుద్దాన్ని పరిహరించవలసిన 4 పవిత్ర మాసాలలో ఇది ఒకటి. 'హరమ్(నిషిద్ధం)' అన్న పదం నుంచి మొహర్రం వచ్చింది. ఇది రంజాన్ తరువాత ముస్లింలకు అతి ముఖ్యమైన మాసం.
మొహర్రంలో 10 వ దినమున తమ ఇమామ్ బలిదానం చేసాడు కనుక ఆ రోజును షియాలు శోకదినంగా పాటిస్తారు.
మొహర్రం ను 'యౌము - యె - ఆషూరా' అని ముస్లిములు పిలుస్తారు. అరబ్బీలో 'ఆషూరా' అంటే పది.
మొహర్రం పండుగ పుట్టుపూర్వోత్తరాలు
3వ ఖలీఫా ఓట్టమన్ హింసాయుతమైన తిరుగుబాట్లతో అంతమైనది. ఓట్టమాన్ హత్య జరిగాక, చాల రోజులు తిరుగుబాటుదార్లు మదీనా నగరాన్ని ఆక్రమించారు.
ఉమ్మా ఒత్తిడి వాళ్ళ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ను 4వ ఖలీఫా గ ఎన్నుకోవడం జరిగింది. ముస్లింల ఏకత సాదించడడమే అతడి మొదటి కర్తవ్యం, అయితే సిరియా గవర్నరు మువ్వయ్య, అలీ పట్ల విశ్వాసం చూపక తిరుగుబాటు చేసాడు. మువ్వయ్య, అలీ ల మధ్య వైరం నెలకొంది. మొత్తం ముస్లిం ప్రపంచమే రెండు స్కందవరాలుగా విడిపోయింది
అలీ చనిపోయాక అతడి కుమారుడు హాసన్ ఇబ్న్ అలీ తండ్రికి వారసుడై మరింత రక్తపాతం జరగకుండా మువ్వయ్యతో సంధి చేసుకున్నాడు. మువ్వయ్య సిరియా కు పాలకుడిగా ఉండిపోయాడు.
మువ్వయ్య తానూ చనిపోక ముందు ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచెయ్యటమే కాక మొదటిసారి ఇస్లాంలో వంశపారంపర్య పాలనను ప్రవేశపెట్టే విధంగా, తన తర్వాత తన కొడుకు యాజిద్ పాలకుడవ్వాలని భావించాడు.
ఇది అమ్మలోని ప్రముఖ నాయకులెవరికి అంగీకారయోగ్యం కాలేదు. అలీ ఇబ్న్ తాలిబ్ చిన్న కొడుకు హుస్సేన్ ఇబ్న్ అలీ కూడా వ్యతిరేకించాడు.
అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్, అబ్దుల్లా ఇబ్న్ జుబైద్, అబ్దుల్లా ఒమర్, హుస్సేన్ ఇబ్న్ అలీ, అబ్దుల్లా రెహ్మాన్ ఇబ్న్ అబూ బాకర్ లాంటి ప్రముఖ మిత్ర కుటుంబ నాయకుల ప్రవర్తనను అధిక సంఖ్యాకులైన ముస్లింలు గమనించసాగారు.
ఎవరిని ఎలా వంచలో మువ్వయ్య కొడుకు చెప్పాడు. ప్రత్యేకంగా హుస్సేన్ ఇబ్న్ అలీ విషయంలో జరగట్టగా ఉండాలని, అతడొక్కడే ప్రవక్తకు దగ్గరి రక్తసంబంధికుడని హెచ్చరిక చేసాడు.
యాజిద్ ముగ్గురిని లొంగదీసుకున్నాడు. అబ్దుల్లా ఇబ్న్ జుబైర్ మక్కాలో ఆశ్రయం పొందాడు. హుస్సేన్ ఇబ్న్ అలీ మాత్రం వంశానుగత పాలనకు నడుం కట్టాడు.
మువ్వయ్యా హిజ్రా 60 రజబ్ 22న చనిపోయాడు. అప్పటికే అతడు మొత్తం సామ్రాజ్యం తన కొడుక్కు లొంగిపోవాలన్న కార్యక్రమాన్ని అమలు పరిచాడు.
తాను రాజయ్యాడు కనుక హుస్సేయిం విశ్వాసం ప్రకటించేటట్లు చేయవలసింది మదీనాలో తన ప్రతినిధి వాలిద్ ను ఆదేశించాడు. 'నాలాంటి వాడెవడు, యాజిద్ లాంటి పాలకుడిని ఎప్పటికి అంగీకరించడు' అని చెప్పి హుస్సేన్ మదీనాకు వెళ్ళిపోయాడు. అతడు మదీనాలో ఉన్నప్పుడే తాను వచ్చి తమకు మార్గదర్శనం చేయాలని కుఫా నుండి అతడికి చాలా ఉత్తరాలు అందాయి.
అతని బంధువు ముస్లిం ఇబ్న్ అకిల్ ముందుగా వెళ్లి పరిస్థితి హుస్సేన్ కు వివరించి అనుకూలంగా ఉన్నాడని ఉత్తరం వ్రాశాడు. అయితే ఉబైద్ అల్లా ఇబ్న్ జియాద్ కుఫా కొత్త ప్రతినిధిగా రావడంతో పరిస్థితులు మారిపోయాయి
అకీలను, అతనికి ఆతిధ్యమిచ్చిన వ్యక్తిని చంపటం జరిగింది. ప్రజల్లో కొందరు అమీర్ యాజిద్ వైపు తిరిగిపోయారు.
హజ్ సమయంలో తనను చంపే కుట్ర జరుగుతుందని తెలుసుకున్న హుస్సేన్ మక్కాను వదిలి కుఫాకు వెళ్తుంటే అప్పుడతనికి ముస్లింను చంపినవార్త తెలిసింది, అయితే అతడు వెనకకు తిరగకుండా ముందుకే సాగాడు.
కుఫాకు ఇంకా కొన్నిరోజుల ప్రయాణం ఉందనగా, 1000 మంది సైనికులతో కూడిన యాజిద్ సైన్యం అడ్డగించింది, ప్రవక్త కుటుంబం క్రీ.శ. 650 అక్టోబర్ 2న (మొహర్రం) కార్బలకు చేరింది. అక్కడ శిబిరం వేసుకుంది.
ఉమర్ ఇబ్న్ సాద్ శత్రు సైన్య నాయకుడు. 40000 సైన్యంతో మొహర్రంరెండవ రోజుకు చేరాడు. ఇబ్న్ జియాద్ ఆజ్ఞానుసారం హుస్సేన్ కు, అతని పరివారానికి నీరు లభించకుండా చేసింది సైన్యం.
మొహర్రం 10 రాత్రి యుద్ధం ముగిసేదాకా ఈ నీటి దిగ్బంధం కొనసాగింది, వెంటనే యుద్ధం ప్రారంభించవలసిందని ఉమర్ ఇబ్న్ జియాద్ నుండి ఆదేశం వచ్చింది.
అప్పుడు మర్నాటి దాకా యుద్దాన్ని ఆపాలని ఉమర్ ని కోరాడు హుస్సేన్, ఆ రోజు రాత్రి ఇష్టమున్న వాళ్ళు మరణించడం కంటే చీకటిలో పారిపోవచ్చని తన అనుయాయులకు చెప్పాడు, అందులో ఎవరు అందుకు అంగీకరించలేదు.
మొహర్రం 10 (ఆషూరా) న ఉదయం ప్రార్థనాలయ్యాక యుద్ధం ఆరంభమైంది. 32 మంది అశ్వికులు, 40 మంది కాల్బలంతో హుస్సేన్ తన గుర్రం జులీనాను అధిరోహించాడు. అటువైపు ఉమర్ స్థానంలో షిమర్ సేనానిగా వచ్చాడు. అంత కొద్ది బలగంతో హుస్సేన్ తలపడ్డాడు. తన అనుచరులతో బంధువులతో మృత్యువాత పడ్డాడు.
ఇమామ్ హుస్సేన్ శరీరం అర్పించుబలిదానం చేశాడు కానీ 'నూర్ (వెలుగు)' 'ఇమామత్' లు అతని కొడుకు అలీ లోకి ప్రవేశించాయి. అతడే ఇమామ్ అలీ జైనుల్ అబూదీన్ అయ్యాడు అని జనాలు సాంప్రదాయకంగా నమ్ముతారు.
కర్బాలలో ఇమామ్ హుస్సేన్ బలిదానం శతాబ్దాల తరబడి ప్రజలపై ప్రభావం చూపింది. ధైర్యానికి, ధార్మికతకు, నిజాయితీకి, భక్తికి, భగవంతుని ఇచ్చ కు సమర్పించుకోవడాన్ని చిహ్నమైంది.
Tags: Telangana festival Muharram, telangana history Muharram, Muharram history, Muharram festival celebrations, tspsc syllabus,appsc syllabus in telugu, tspsc notes in telugu, appsc notes in telugu, tspsc study material in telugu, appsc study material in telugu, ap constable notes in telugu, telangana groups notes in telugu, telangana govt jobs notes in telugu