Qutb Shahi Dynasty కుతుబ్‌షాహీలు 4

TSStudies
హాసన్ తానీషా (1672-1687)
ఇతని గురువు షారాజు కట్టాల్ , ఇతనికి తానిషా (భోగి) అనే బిరుదు ఇచ్చాడు 
ఇతని కాలంలోనే కంచర్ల గోపన్న / భక్త రామదాసు పాల్వంచ కు తహిసీల్దార్ గా  ఉన్నాడు 
కంచర్ల గోపన్న తాను వసూలు చేసిన శిస్తును ఖజానాకు పంపకుండా భద్రాచలంలో శ్రీరాముని దేవాలయం నిర్మించాడు. దీనితో కంచర్ల గోపన్న గోల్కొండ కోటలో బందించబడ్డాడు. తరువాత విడుదల చేయబడ్డాడు 
హాసన్ తానీషా పాల్వంచ, శంకరగిరి గ్రామాలను భద్రాచలం దేవాలయ నిర్వహణకు గాను దానంగా ఇచ్చాడు 

రామదాసు రచనలు -- దాశరథి శతకం, రామదాసు కీర్తనలు 
సింగనా చార్యుడు -- నిరోష కావ్యం 
ఇతని కాలంలో అక్కన్న (సైన్యాధిపతి), మాదన్న(ప్రధాని) లు శివాజీ మరియు బీజాపూర్ లతో కలిసి ఔరంగజేబు కు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసారు. 
1686 లో వీరిద్దరు హత్యకు గురైనారు. 
1686 లో బీజపూర్ ను ఆక్రమించిన తరువాత ఔరంగజేబు గోల్కొండ ఆక్రమణకు బయలుదేరాడు. 
1687 ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు గోల్కొండ ఆక్రమణ కొరకు యుద్ధం జరిగింది. 
చివరకు హాసన్ తానీషా సేనాధిపతులలో ఒకడైన అబ్దుల్లా బానీ ఔరంగజేబుతో కుట్ర పన్నడంతో ఇతను గోల్కొండ యొక్క తూర్పు ద్వారాన్ని తెరిచాడు. దీనితో ఔరంగజేబు సైన్యం గోల్కొండ కోటలోకి ప్రవేశించి హాసన్ తానీషా సైన్యాన్ని ఓడించి గోల్కొండను ఆక్రమించింది. 
హాసన్ తానిషా తరుపున విరోచితపోరాటం చేసి మరణించిన సేనాపతి -- అబ్దుల్ రజాక్ లౌరీ 
1687 అక్టోబర్ 3వ తేదీన గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. 

కుతుబ్ షాహీల కాలంలో కొన్ని ప్రత్యేకతలు 
కుతుబ్ షాహీ, నిజాం పాలనలో పన్ను వసూలు లెక్కలను జమాబందీ అనేవారు. 
రెండవ పంటకు చెరువు నీటి వాటాను నిర్ణయించడాన్ని తహబందీ అనేవారు. 
కొత్తగా చెరువులు నిర్మించిన గ్రామాల్లో 5 సంవత్సరాల వరకు పన్ను విధించకుండా మినహాయింపు ఇచ్చేవారు, దీనిని దుంబాల అనేవారు. 
రైతులు పన్ను భారమై ఊరు విడిచి వెళ్ళిపోతే వారిని తిరిగి రప్పించి పునరావాసాలు ఏర్పరిచేవారు. ఇలాంటి చోట్ల తక్కువ శిస్తు ను వసూలు చేసేవారు. 
వీరి కాలంలో ధాన్యానికి నాగు, ధనానికి మిత్తి వ్యవహారంలో ఉండేవి.



Tags: Telangana history qutub shahi dynasty, ancient history of telangana in telugu, qutub shahi dynasty notes in telugu, tspsc groups study material in telugu, appsc groups study material in telugu, tspsc class room notes in telugu, ts constables notes in telugu, ap constables notes in telugu, ap si of police notes in telugu, tspsc practice questions in telugu, appsc groups mcq in telugu,ts studies, Qutb Shahi Dynasty  in telugu,