ఇబ్రహీం కూలీ కుతుబ్ షా (1550 - 1580)
ఇతను తెలుగు కవులను ఆదరాభిమానాలతో పోషించుట కారణంగా మల్కిభరాముడు అనే బిరుదు పొందాడు
కందుకూరి రుద్ర కవి -- నిరంకుశోపాఖ్యానం (ఇతను ఇబ్రహీంను శివునితో పోల్చాడు) , సుగ్రీవ విజయం
అద్దంకి గంగాధరుడు -- తపతి సంవరణోపాఖ్యానం (సామంత అమీర్ ఖాన్ కి అంకితమిచ్చాడు)
పొన్నెగంటి తెలగనార్యుడు -- యయాతి చరిత్ర
ఇబ్రహీం అషిఖానా లో కవితా గోష్ఠి నిర్వహించేవాడు
ఇతని కాలంలో ఉర్దూ బాషా బాగా అభివృద్ధి చెందినది
అందువల్లనే ఇతనిని ఉర్దూ చాజర్ (ఉర్దూ పితామహుడు) అంటారు
ఇతని కాలంలోనే దక్కనీ ఉర్దూ ప్రారంభమైంది.
ఇతను అనేక నిర్మాణాలు చేపట్టాడు అందులో కొన్ని ముఖ్యమైనవి
- గోల్కొండ చుట్టూ ప్రాకారం
- ఇబ్రహీం బాగ్
- పూల్ బాగ్
- ఇబ్రహీం పట్నం
- ఇబ్రహీం పట్నం చెరువు త్రవ్వించాడు
- పురానా మాల్ (ఇది మూసి నదిపై మొట్టమొదటి వంతెన)
ఇబ్రహీం అల్లుడు హుస్సేన్ షా / హుస్సేన్ నిజాం షా 'హుస్సేన్ సాగర్' ను త్రవ్వించాడు.
ఇబ్రహీం భాగీరథీ అనే మహిళను వివాహమాడి గోల్కొండను ఆమె పేరు మీదుగా భాగీరథపురం అని పిలిచేవాడు.
మొహమ్మద్ కూలీ కుతుబ్ షా (1580 - 1612)
ఇతను కుతుబ్ షాహీలలో గొప్పవాడు
ఇతను ఒక గొప్ప కవి
ఉర్దూ మరియు పర్షియా బాషలలో అనేక కవిత్వాలని రచించాడు
ఇతని యొక్క కలం పేరు 'మానీల్'
ఇతని కవిత్వాలను 'కులియత్ కులీ' అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.
ఇతను 'భాగ్యమతి' ని వివాహమాడాడు. ఈమెకు 'హైదర్ మహల్' ఇవ్వబడింది 'ఫెరిస్తా' పేర్కొన్నాడు.
ఇతను 1591 లో హైదరాబాద్ ను నిర్మించాడు(హైదరాబాద్ చించేల అనే గ్రామం నుంచి అభివృద్ధి చెందింది )
హైదరాబాద్ లో ఉద్యానవనాలు (బాగ్) లు అధికంగా ఉండడంచేత దీనికి 'బాగ్ నగర్' అనే పేరు వచ్చింది అని దేవినేట్ పేర్కొన్నాడు
హైదరాబాద్ లో ఫ్లేగును పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా ఇతను చార్మినార్ ను 1591-1594 లో నిర్మించాడు (చార్మినార్ వద్ద ఉన్న శిలాఫలకం ప్రకారం)
ఇతను చార్మినార్ చుట్టూ హైదరాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలని హైదరాబాద్ పట్టణ నమూనాను తానే స్వయంగా రూపొందించినాడు.
ఇతని కాలంలో సారంగా తమ్మయ్య 'వై జయంతి విలాసం' ను, సబ్బటి కృష్ణమాత్యుడు 'రత్నాకరం' ను రచించాడు
ఇతని సేనాపతి ఎక్లాస్ ఖాన్ 'అమీనాబాద్' అనే తెలుగు శాసనాన్ని వేయించాడు.
ఇతని కాలంలోనే 1605లో డచ్ వారు మచిలీపట్నంలో స్థావరాన్ని నిర్మించారు.
ఇతని కాలంలోనే 1611లో బ్రిటిష్ వారు మచిలీపట్నంలో స్థావరాన్ని నిర్మించారు
ఇతను అనేక నిర్మాణాలు చేపట్టాడు
- దాద్ మహల్
- గగన్ మహల్
- దార్ ఉల్ షిఫా (ఆసుపత్రి)
- చార్ కమాన్
Tags: Muhammad Quli Qutb Shah, great king of Qutb Shahi Dynasty, Ibrahim Quli Qutb Shah history, Qutb Shahi Dynasty history, telangana history Qutb Shahi Dynasty, indian history Qutb Shahi Dynasty, tspsc study material in telugu, appsc study material in telugu, telangana constable study material in telugu, ap constable study material in telugu, ap si of police study material in telugu, ap groups notes in telugu