సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా (1612 - 1626)
ఇతను మొహమ్మద్ కూలీ కుతుబ్ షా యొక్క అల్లుడు
ఇతను హైదరాబాద్ కు సుల్తాన్ నగర్ గా నామకరణం చేసాడు
ఇతనికాలంలోనే మక్కా మసీద్ నిర్మాణం ప్రారంభమైంది (దీనిని ఔరంగజేబు పూర్తి చేసాడు)
ఇతనిని కాలంలో ట్రావెర్నియర్ (ఫ్రెంచ్) హైదరాబాద్ లో పర్యటించి మక్కా మసీద్ నిర్మాణం గురుంచి వివరించాడు
ఇది భారతదేశ నిర్మాణాల్లో ఒకటి అని, ఈ నిర్మాణంలో 2వేల మంది మేస్త్రీలు, 2వేల మంది శిల్పులు, 4వేల మంది కూలీలు పాల్గొన్నారని పేర్కొన్నాడు
మక్కా నుంచి కొన్ని రాళ్లు, మట్టి తెప్పించి ఈ మసీదు నిర్మాణం పూర్తి చేపట్టారు. కావున దీనికి మక్కా మసీదు అని పేరు వచ్చింది.
ఇతను ఖైరతాబాద్ మసీదును నిర్మించాడు
ఇతని కాలంలో మొహ్మద్ మోమిన్ రిసాలా మికార్దయా అనే గ్రంధాన్ని తూనికలు కొలతలపై రచించాడు.
అబుల్లా కుతుబ్ షా (1626 -1672)
ఇతను 12 సంవత్సరాల వయస్సులో పాలకుడైనాడు
ఇతని సంరక్షకురాలు హయత్ బక్షీ భేగం
ఇతను అత్యధిక కాలం పాలించిన కుతుబ్ షాహి పాలకుడు
ఇతని కాలంలోనే షాజహాన్ గోల్కొండ పై దాడి చేశాడు. దీనితో అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్ తో శాంతి ఒప్పందం చేసుకొని ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని, లక్షల విలువైన బహుమానాలు షాజహాన్ కు ఇచ్చాడు
కోహినూర్ వజ్రం కృష్ణా డెల్టా కల్లూరు అనే ప్రాంతంలో దొరికింది అని ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి ట్రావెర్నియర్ పేర్కొన్నాడు
కానీ కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కోహినూర్ వజ్రం గోల్కొండపు వజ్రపు గనుల్లో దొరికింది అని అంటారు.
గోల్కొండలో ఆంగ్లేయులు యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి బంగారు ఫర్మానా 1636లో జారీ చేశాడు
ఇతని కాలంలోనే క్షేత్రయ్య "మువ్వపదాలు" రచించాడు. క్షేత్రయ్య బిరుదు 'శృంగార కవి'
Tags: Telangana history Qutb Shahi Dynasty in telugu, Indian History Qutb Shahi Dynasty in telugu,
tspsc study material in telugu, ancient history of telangana in telugu, ancient history of india in telugu, tspsc notes in telugu, appsc notes in telugu, telangana constable notes in telugu, ap constable notes in telugu, groups class room notes in telugu