Satavahana Dynasty Bit Bank 4

TSStudies
0
1. పురాణాల ప్రకారం 13వ శాతవాహన రాజు 
కుంతల శాతకర్ణి 

2. ఏ శాతవాహన రాజు కాలంలో సంస్కృతం బాగా అభివృద్ధి చెందింది 
కుంతల శాతకర్ణి 

3. కుంతల శాతకర్ణి యొక్క బిరుదు 
విక్రమార్క 

4. కాతంత్ర వ్యాకరణం ను సంస్కృతంలో రచించింది ఎవరు 
శర్వవర్మ (ఇతను కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానకవి)

5. బృహత్కథ ను పైశాచిక భాషలో రచించింది ఎవరు 
గుణాడ్యుడు (ఇది విష్ణువర్మ పంచతంత్రం రచించుటకు ఆధారమైనది)

6. కుంతల శాతకర్ణి యొక్క భార్య పేరు 
మలయావతి (ఈమె కరికర్త అనే రతి భంగిమ కారణంగా చనిపోయింది) 

7. కుంతల శాతకర్ణి గురుంచి ఏ గ్రంధములలో ప్రస్తావించబడింది 
వాత్సాయన కామ సూత్రం, రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాడ్యుడు బృహత్కథ 

8. కుంతల శాతకర్ణి తరువాత పాలకుడు ఎవరు 
స్వాతివర్ణ (ఇతను 14వ రాజు)

9. పురాణాల ప్రకారం 15వ శాతవాహన రాజు 
1వ పులోమావి 

10. 1వ పులోమావి కణ్వ వంశానికి చెందిన సుశర్మ ను ఓడించి మగధను 10 సంవత్సరాలు పాలించినట్లు దేని ద్వారా తెలుస్తుంది 
వాయు పురాణం 

11. 1వ పులోమావి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి 
కుహరమ  (పాటలీపుత్ర సమీపాన)

12. పులోమావి అనగా అర్ధం ఏమిటి 
గడ్డిలో జన్మించినవాడు అని అర్ధం 

13. 1వ పులోమావి తరువాత పాలకుడు ఎవరు 
శివస్వాతి 

14. 17వ శాతవాహన రాజు ఎవరు 
హాలుడు 

15. కవిరాజు అని ఏ శాతవాహన రాజును పిలుస్తారు 
హాలుడు 

16. హాలుడు యొక్క బిరుదు 
కవివత్సలుడు 

17. హాలుడు ప్రాకృతంలో రచించిన గ్రంధం ఏది 
గాథాసప్తశతి 

18. శాతవాహన కాలం నాటి సమాజం గురుంచి వివరించిన గ్రంధం 
గాథాసప్తశతి  (దీనిలో 700 శృంగార పద్యాలు కలవు)

19. ఏ శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం గ పేర్కొంటారు 
హాలుడు 

20. లీలావతి పరిణయంను రచించినది 
కుతూహలుడు (దీనిలో హాలుడు శ్రీలంక రాకుమార్తె లీలావతి ని వివాహమాడినట్లు తెలుపుతుంది)


Tags: Telangana History Satavahana Dynasty Notes in telugu, indian history in telugu, telangana history notes in telugu, tspsc practice questions with answers in telugu, tspsc groups notes, appsc notes in telugu, satavahana empires list in telugu, satavahana kings list


Post a Comment

0Comments

Post a Comment (0)