ముత్యాలమ్మ జాతర
ఈ ముత్యాలమ్మను పోచమ్మ అని కూడా పిలుస్తారు
ముత్యాలమ్మ గ్రామా ప్రజల రాక్షుకురాలని, స్త్రీలకు సంతానం ఇస్తుందని, ఆమెను సేవిస్తే పంటలు బాగా పండుతాయని, బోనాలు పండుగ చేస్తే పిల్ల పాపలు సుఖంగా ఉంటారని ప్రజల యొక్క విశ్వాసం.
ప్రధానంగా ఈ పండుగను నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలలో శ్రావణమాసంలో కొలుస్తారు.
ఈ జాతర బియ్యం కొలతతో ప్రారంబమవ్వుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రధాన సూత్రదారి 'బలనీడు'
జాతరను చేయడానికి పశువును బలి ఇవ్వడానికి వచ్చేవాళ్లను 'ఆచారమంతులు' అంటారు.
ఈ జాతరలో ప్రధాన ఘట్టాలు శిడిమాను, పూలకప్పెర, పోలి. బలి ఇచ్చిన మేకపోతు ప్రేగులను 'బలనీడు' దరిస్తాడు.
మైసమ్మ జాతర
ఈ జాతరను 3 లేదా 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు.
ఇది ప్రధానంగా శ్రావణమాసంలో జరుపుకునే పండుగ
గంగా దేవమ్మ జాతర
నల్గొండ జిల్లాలోని నూతనకల్లు మండలంలోని బిక్కుమల్ల గ్రామంలో గంగాదేవమ్మ ఆలయం ఉన్నది
ఇక్కడ జాతరను మాసనపల్లి యాదవులు నిర్వహిస్తారు
కనకదుర్గమ్మ జాతర
ఈ జాతర అడవిదేవరపల్లి గ్రామంలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ గ్రామం దామరచర్ల మండలంలో ఉన్నది
దీనిలో సిడిమాన్ ఊరేగింపు, బండ్ల ఊరేగింపు, గండ దీపం ప్రత్యేకమైన కార్యక్రమాలు
మారమ్మతల్లి జాతర
ఈమె పిల్లలకు పశువులకు ఆరాధ్య దేవత
ఈ జాతరను నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకా లోని వెలువర్తి, పిట్టంపల్లి గ్రామాలలో ఘనంగా నిర్వహిస్తారు.
చౌడమ్మ జాతర
ఈ జాతరను సూర్యాపేట జిల్లాలో ప్రజలు మూడు రోజులపాటు జరుపుతారు
చౌడమ్మ యాదవుల కుల దేవత
కేవలం సూర్యాపేట జిల్లాలో మాత్రమే ఈ దేవత గుడులు కలవు
కొండగట్టు జాతర
కరీంనగర్ జిల్లాలోని ముత్యంపేట దగ్గర ఉన్నది
హనుమంతుడు ఒక వైపు నరసింహస్వామి ముఖంతో, మరోవైపు ఆంజనేయునిస్వామి ముఖంతో ఉండటం దీని ప్రత్యేకత.
ఈ గుడిలో 40 రోజులపాటు పూజలు చేయడం వల్లన సంతానం కలుగుతుంది అని ప్రజల విశ్వాసం.
పాలశేర్లయ్య గట్టు / గొల్లగట్టు జాతర
తెలంగాణ ప్రజలు పెద్దగట్టు జాతర గా పిలుచుకునే ఈ జాతరను సూర్యాపేట జిల్లాలో పోలశేర్లయ్య గట్టు మీద ఘనంగా నిర్వహించబడుతుంది
ఇది తెలంగాణాలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది.
ఈ జాతరను 2 సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు.
దిష్టి పొయ్యటం అనే ఆచారం గొల్లగట్టు జాతరలో అతి ప్రధానమైన అంశంగా పేర్కొంటారు.
గొల్లగట్టు జాతర సందర్భంగా 20 విగ్రహాలు ఉండే దేవర పెట్టెను కేసారం గ్రామానికి తీసుకెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. ఆ తరువాత లింగమంతుల స్వామి తోబుట్టువు అయిన చౌడమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తారు. ఖాసీంపేట యాదవ కులం వారు ఈ జాతరలో పసిడి కుండను ఆలయ గోపురంపై అలంకరిస్తారు.
సూర్యాపేట యాదవ కులస్తులు స్వామికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
సాయంత్రం భోజనాలు ముగించిన తరువాత గండదీపం వెలిగిస్తారు.
తరువాత మరుసటి రోజు పోతురాజు తదితర దేవుళ్ళకు మొక్కులు చెల్లిస్తారు, దీనితో జాతర పూర్తవుతుంది.
ఏడుపాయల జాతర
మెదక్ జిల్లాలోని వనదుర్గాభవాని దేవాలయం ఏడుపాయల జాతరకు ప్రసిద్ధి.
ఈ దేవాలయం మంజీరా నది ఏడుపాయలుగా చీలిపోయే చోట నిర్మించబడింది. అందువల్లనే ఏడుపాయల జాతరగా ప్రసిద్ధి చెందినది
ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు నుంచి మూడు రోజులపాటు ఈ జాతరను నిర్వహిస్తారు.
నాగోబా జాతర
ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో గల కేస్లాపూర్ లో జరుగుతుంది.
ఈ జాతరలో నాగ దేవతను ఆరాధిస్తారు.
యాలాల జాతర
ఆదిలాబాద్ లోని చెన్నూరు మండలంలో జరుగుతుంది
కొమురవెల్లి జాతర
వరంగల్ లో జరుగుతుంది.
మల్లికార్జునస్వామిని పూజిస్తారు
రాజన్న జాతర
వేములవాడలో జరుగుతుంది.
రాజరాజేశ్వరున్ని ఆరాధిస్తారు.