Telangana History Model Paper 2

TSStudies
0
1. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడ బయల్పడని ప్రత్యకమైన సమాధి ఒక కళేబరంపై మరొక కళేబరం తెలంగాణలోని ఏ ప్రాంతంలో బయటపడింది 
1) నార్కెట్ పల్లి 
2) జానంపేట 
3) శేరుపల్లి 
4) ఏలేశ్వరం 

2) శాతవాహనులు హీన జాతికి చెందినవారు అని చెప్పటానికి ఆధారం 
1) బౌద్ధ గ్రంధాలు 
2) నాసిక్ శాసనం 
3) జైన గ్రంధాలు 
4) పురాణాలు 

3) కల్నన్ క్యాలిన్ మెకంజీ అమరావతి స్తూపాన్ని ఎప్పుడు కనుగొన్నాడు 
1) 1877 
2) 1787
3) 1797
4) 1897

4) వడ్డాయన కొండపై జైన బసదిని నిర్మించినది ఎవరు 
1) భట్టారిక మహాదేవి 
2) సంప్రాతి 
3) ఉపాశిక బోధిశ్రీ 
4) మఠరశ్రీ 

5) 1వ సాలార్ జంగ్ తోలి నాణెములను ఏ రాజు పేరు మీదుగా ముద్రించాడు 
1) నసీరుద్దౌలా 
2) అఫ్జల్ ఉద్దౌలా 
3) సిరాజ్ ఉద్దౌలా 
4) ముజఫర్ ఉద్దౌలా 

6) మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మైనర్ అవటం వల్లన 1వ సాలార్ జంగ్ తో పాటు పాలనా బాధ్యతలు నిర్వహించింది ఎవరు 
1) రేమండ్ 
2) మీర్ ఆలం 
3) షంషాద్ ఉమ్రా 
4) నిజాం అలీ 

7) తెలంగాణాలో తోలి సంస్కృత శాసనాన్ని వేయించింది ఎవరు 
1) 1వ గోవిందవర్మ 
2) 1వ మాధవవర్మ 
3) 2వ మాధవవర్మ 
4) ఇంద్రభట్టారకవర్మ 

8) కాకతీయ వంశం పేరుకు సంబంధించి ఈ క్రిందివానిలో సంబంధం లేని అంశం 
1) మాగల్లు శాసనం 
2) ప్రతాపరుద్ర యశోభూషణం 
3) క్రీడాభిరామం 
4) కథాసరిత్సాగరం 

9)నిరువద్యపురం యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది 
1) 1వ బీమునికి - గుండ్యన 
2) గుండ్యన -- 2వ భీముడు 
3) 2వ కృష్ణుడు -- 2వ భీముడు 
4) 1వ భీముడు -- 2వ కృష్ణుడు 

10) గణపతి దేవుడు బందీగా ఉన్నప్పుడు అతని విడుదలకు సహకరించింది ఎవరు 
1) జైతూగి 
2) రేచర్ల రుద్రుడు 
3) సింగనుడు 
4) మహాదేవుడు 

11) రుద్రమదేవి పాలకురాలు కావటాన్ని వ్యతిరేకించింది ఎవరు 
1) మురారి దేవుడు, కుమార దేవుడు 
2) హరిహర దేవుడు,  అంబ దేవుడు 
3) మురారి దేవుడు, హరిహర దేవుడు 
4) జన్నిగ దేవుడు, హరిహర దేవుడు 

12) ప్రతిదండ భైరవ బిరుదు గల వెలమ రాజు ఎవరు 
1) సింగమ నాయుడు 
2) 3వ సింగమనాయుడు 
3) 2వ సింగ భూపాలుడు 
4) 1వ అనపోతా నాయకుడు 

13) విజయనగరంలో 7 సంవత్సరాలు గడిపిన కుతుబ్ షాహి చక్రవర్తి ఎవరు 
1) సుల్తాన్ కూలీ కుతుబ్ షా 
2) జంషీద్ కూలీ కుతుబ్ షా
3) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
4) మొహమ్మద్ కూలీ కుతుబ్ షా

14) కందుకూరి రుద్రకవి ఏ కుతుబ్ షాహీ పాలకుడిని శివునితో పోల్చాడు 
1) జంషీద్ కూలీ కుతుబ్ షా
2) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
3) అబ్దుల్లా కూలీ కుతుబ్ షా
4) మొహమ్మద్ కూలీ కుతుబ్ షా

15) అంబుససి సంత ఏ రాష్ట్రంలో నిర్వహించ బడును 
1) బీహార్ 
2) అస్సాం 
3) రాజస్థాన్ 
4) పంజాబ్ 

16) నిజాం పాలనను ఖండిస్తూ స్వపరిపాలన డిమాండ్ చేస్తూ ఆర్య సమాజం హైదరాబాద్ డే ను ఏ సంవత్సరంలో నిర్వహించింది 
1) 1937
2) 1938
3) 1939
4) 1940

17) 3వ ఆంధ్ర మహిళా సభకు సుమారు ఎంతమంది వచ్చారు 
1) 1500
2) 2500
3) 3000
4) 3500

18) హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని అంటారు 
1) ఆదయ్య 
2) బందెల చిత్తరంజన్ 
3) మాదిరి భాగ్యరెడ్డి వర్మ 
4) బి యస్ వెంకట్రావ్ 

19) శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం 1904 లో ఏ నెలలో స్థాపించబడింది 
1) జనవరి 
2) ఏప్రిల్ 
3) నవంబర్ 
4) ఫిబ్రవరి 

20) రామిరెడ్డి ఈ క్రింది ఏ ప్రాంతానికి దేశముఖ్ గ ఉండేవాడు 
1) పరిటాల ప్రాంతం 
2) మునుగోడు 
3) బేతవోలు 
4) కొలనుపాక 

21) ఈ క్రిందివానిలో దేనికి 'పంటకోత కాలం పండుగ' అంటారు 
1) ఉగాది 
2) హోలీ 
3) దీపావళి 
4) సంక్రాతి 

22) భారతదేశంలో మొట్టమొదటి ఉర్సు గరీబ్ నవాబ్ ఖ్వా జా మొయినుద్దీన్ చిస్తీ పేరు మీదుగా ఎక్కడ నిర్వహిస్తారు 
1) హైదరాబాద్ 
2) కడప 
3) అజ్మీర్ 
4) ముంబాయి 

23) చందా రైల్వే పథకం పునః సమీక్షించాలిసిందిగా లేఖ రాసిన వారిలో లేని వారు 
1) ముల్లా అబ్దుల్లా ఖయ్యిమ్ 
2) దస్తూర్ ఔసంజి హోషంగ్ 
3) అఘోరనాథ చటోపాధ్యాయ 
4) ముల్లా అహ్మద్ 

24) నిజాం రాష్ట్ర కేంద్ర జన సంఘం తొలి సమావేశ కాలంలో లక్ష్మణయ్య పరిశోధనా మండలి కార్యదర్శిగా ఎవరు ఉన్నారు 
1) గోపరాజు 
2) లక్ష్మణరాజు 
3) వీరభద్రరాజు 
4) రంగరాజు 

25) ఆంధ్ర మహాసభ 1930 లో ఈ  క్రింది ఏ విధంగా మార్చబడింది 
1) మతపరమైన సంస్థగా 
2) ఆర్థికపరమైన సంస్థగా 
3) రాజకీయమైన సంస్థగా 
4) సామాజిక సంస్థగా 

జవాబులు 
1) 4 2) 4 3) 3 4) 2 5) 2
6) 3 7) 18) 4 9) 1 10) 3
11) 3 12) 2 13) 3 14) 2 15) 2
16) 3 17) 3 18) 4 19) 4 20) 2
21) 4 22) 3 23) 4 24) 3 25) 3

Tags: Telangana History Model Papers in telugu, Telangana History quiz in telugu,Telangana History practice questions with answers in telugu, group 2 Telangana History online test, online bits for Telangana History, telangana group 2 online quiz, telangana history online bits in telugu,Indian online views

Post a Comment

0Comments

Post a Comment (0)